గాంధీకి జగన్ కు పోలిక ఏంటి రోజా...?
Publish Date:Nov 3, 2017
Advertisement
రోజాకి ఇంత జరిగినా ఇంకా తెలిసొచ్చినట్టు లేదు. ఇన్నీ రోజులు మీడియా ముందుకు రాకుండా సైలెంట్ గా ఉన్న రోజా నోరు మళ్లీ లేస్తుంది. నంద్యాల ఉపఎన్నికలో ఓడిపోవడానికి సగం కారణం రోజా మీడియా ముందు రెచ్చిపోవడమే అని పార్టీ నేతలే ఆమెపై ఆగ్రం వ్యక్తం చేశారు. ఇక జగన్ పెట్టుకున్న పార్టీ ఎన్నికల ప్రధాన వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సైతం రోజా కాస్త దూకుడు తగ్గించాలని జగన్ కు చెప్పడంతో... జగన్ కూడా రోజాను సైలెంట్ గా ఉండమని చెప్పడం జరిగింది. దీంతో రోజా అప్పటినుండి ఇప్పటి వరకూ దాదాపు మీడియా ముందు రావడమే తగ్గించింది. పాపం మీడియా ముందు ఎప్పుడూ హడావుడి చేసే రోజా సైల్ంగా ఉండటం అంటే చాలా కష్టం కదా. అందుకే ఇప్పుడు మళ్లీ మీడియా ముందుకు వచ్చి తెగ హడావుడి చేసింది. అయితే రోజాకి జగన్ మీద అభిమానం ఉంది అని తెలుసు కానీ.. ఏకంగా జగన్ ను గాంధీ తో పోల్చేంత అభిమానం ఉందని తెలియదు. అసలు పాదయాత్ర జరుగుతుందా..? లేదా..? కోర్టు జగన్ కు పాదయాత్ర చేసుకోవడానికి అనుమతి ఇస్తుందా అని.. ఒకపక్క పార్టీ నేతలకే నమ్మకం లేకపోయినా వెయ్యి కళ్లతో ఎదురుచూశారు. ఏం జరిగింది ఆఖరికి కోర్టు అనుమతి లేదు ఏం లేదు అని మొహం మీదే చెప్పేసింది. ఇక చేసేది ఏంలేక ఏలాగో అలా తిప్పలు పడి మరీ పాదయాత్ర చేయడానికి రెడీ అయిపోయారు. ఇక వైసీపీ పార్టీ నేతలు కూడా ఎక్కువ ఏం మాట్లాడకుండా పాదయాత్ర చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ రోజా సైలెంట్ గా ఉండదు కదా. పాదయాత్రపై మీడియాతో మాట్లాడేందుకు వచ్చిన రోజా బలే కామెడీ డైలాగ్స్ వేసింది. రోజా మాట్లాడిన మాటలు వింటే నవ్వుకొక తప్పదు. పాదయాత్ర టీడీపీకి అంతిమయాత్ర అని.. ఇక చంద్రబాబుకు కౌంట్‌డౌన్ మొదలైనట్టేనని అన్నారు. ఇంకా విచిత్రం ఏంటంటే... గాంధీ గారు దండయాత్ర చేసేప్పుడు బ్రిటిష్ వాళ్లు ఎలాగైతే భయపడ్డారో... జగన్ పాదయాత్ర చేసేప్పుడు సోనియా గాంధీ ఎలాగైతే భయపడ్డారో ఇప్పుడు చంద్రబాబు అలా భయపడుతున్నారని కామెడీ వ్యాఖ్యలు చేసింది. ఇక్కడి వరకూ బాగానే ఉన్నా.. రోజా తీరుపై మళ్లీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ మీడియా ముందుకు వచ్చి రోజా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే పాదయాత్ర విషయంలో కూడా చేతులెత్తేయాల్సి ఉంటుందని జగన్ కు ఫిర్యాదు చేయడం.. జగన్ రోజాకి క్లాస్ తీసుకోవడం జరిగిపోయింది. మరి ఇంత జరిగినా రోజా మాత్రం ఎందుకో మీడియా ముందుకు వస్తే ఏమవుతుందో తెలియదు కానీ.. పూనకం వచ్చినట్టు ఊగిపోతుంది.
http://www.teluguone.com/news/content/mla-roja-39-78618.html





