అవసరమైతే చంద్రబాబును తీసుకొస్తా...
Publish Date:Nov 3, 2017
Advertisement
అదేంటంటే.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీకి సొంతంగా అధికారంలోకి వచ్చేంత సీట్లు రావని భావించిన రేవంత్ రెడ్డి… ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే ఏపీలోని చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీని కాంగ్రెస్ కూటమిలోకి తీసుకొచ్చే బాధ్యతను తాను తీసుకుంటానని రేవంత్ రెడ్డి రాహుల్ కు వివరించారట.చంద్రబాబు కూడా బీజేపీతో ఇష్టంలేకే కలిసి ఉన్నారని… పరిస్థితులు మారితే ఆయన కూడా ఆంధ్రప్రదేశ్ అవసరాల కోసం కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమిలోకి వస్తారని రేవంత్ రెడ్డి రాహుల్ తో వ్యాఖ్యానించారట. చంద్రబాబుతో తాను స్వయంగా చర్చించి ఈ విషయంపై ఒప్పిస్తానని రేవంత్ రెడ్డి చెప్పినట్టు సమాచారం. మరి తన గురువు గారి మీద అంత నమ్మకంతో చెబుతున్నాడు కానీ.. చంద్రబాబు ఇందుకు సిద్దంగా ఉన్నాడో.. ? లేదో... తెలియాలంటే ఎన్నికల వరకూ ఆగాల్సిందే.
రేవంత్ రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయిన సంగతి తెలిసిందే. ఏదో తాను పార్టీ మారుతున్నాడన్నప్పుడు వార్తలు వచ్చిన నేపథ్యంలో.. కాస్త నోరు జారి టీడీపీ నేతలపై ఆరోపణలు గుప్పించాడు తప్ప.. ఆ తరువాత మాత్రం ఎవరిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అసలు పార్టీపై కానీ.. పార్టీ అధినేత చంద్రబాబుపై కాని తాను ఒక్కమాట కూడా మాట్లాడలేదు. దీనికి కారణం అందరికీ తెలిసిందే. రేవంత్ కు చంద్రబాబు అంటే అభిమానం ఎక్కువ. చంద్రబాబు నీడలోనే రేవంత్ ఎదిగాడు. అందుకే చంద్రబాబుపై ఉన్న అభిమానంపై రేవంత్ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఈ విషయాన్ని తను చాలాసార్లే చెప్పాడు. పార్టీ మారుతున్నప్పుడు కూడా తెలంగాణలో కేసీఆర్ ను ఎదిరించడం కోసమే తాను టీడీపీని వీడి కాంగ్రెస్ లోకి వచ్చానని…చంద్రబాబు అంటే తనకు ఇప్పటికీ ఎప్పటికీ గౌరవమే అని చెప్పాడు. అయితే రేవంత్ పార్టీ మారిన తరువాత ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. రేవంత్ రాహుల్ తో భేటీ అయిన నేపథ్యంలో ఆయన చర్చించిన విషయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయింది.
http://www.teluguone.com/news/content/revanth-reddy-39-78609.html





