రిటైర్డ్ ఐపీఎస్ బాలసుబ్రహ్మణ్యం ఇక లేరు: అమెరికాలో చికిత్స పొందుతూ కన్నుమూత.!
Publish Date:Oct 30, 2026
Advertisement
రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఎన్ బాలసుబ్రహ్మణ్యం కన్నుమూశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ, విభజిత ఆంధ్రప్రదేశ్ లోనూ పలు కీలక శాఖల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన సీనియర్ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, ఏపీఎస్‌ఆర్టీసీ మాజీ వైస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. బాలసుబ్రహ్మణ్యం కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన, మెరుగైన చికిత్స కోసం అమెరికాకు వెళ్లారు. న్యూయార్క్ నగరంలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. 1994 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఎన్. బాలసుబ్రహ్మణ్యం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు రాష్ట్ర విభజనానంతర ఏపీలోనూ రవాణా, శాంతిభద్రతలు, సాంకేతిక పరిజ్ఞాన విభాగాల్లో సేవలందించారు. విధి నిర్వహణలో ఆయన కనబరిచిన అంకితభావం, నిబద్ధత అందరి మన్ననలను పొందాయి. సాధారణ పోలీసు బాధ్యతలతో పాటు రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్‌గా, ఇంటెలిజెన్స్ ఐజీగా కూడా ఆయన పనిచేశారు. ప్రభుత్వ పాలనలో సాంకేతికతను జోడించే విషయంలో ఆయన క్రియాశీలక పాత్ర పోషించారు. ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులైన ఈ ప్రగతి అథారిటీ కి సీఈఓగా, రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) ముఖ్య కార్యనిర్వహణాధికారిగా బాలసుబ్రహ్మణ్యం పని చేశారు. ఇక ఇటీవలి కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఆయనను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించింది. ఆ పదవిలో బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆర్టీసి సంస్థను లాభాల బాట పట్టించేందుకు, ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించేందుకు ఆయన ఎంతో కృషి చేశారు. సంస్థ అభివృద్ధికి ఆయన చేపట్టిన వినూత్న చర్యలు అప్పట్లో ఎంతో ప్రాచుర్యం పొందాయి. అయితే అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ఆయన కొంతకాలం పాటు చికిత్సపై దృష్టి పెట్టాల్సి వచ్చింది. ఎన్. బాలసుబ్రహ్మణ్యం మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ పోలీసు ఉన్నతాధికారులు, ఆర్టీసీ సిబ్బంది, పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, రాష్ట్రానికి ఆయన అందించిన సేవలను స్మరించుకున్నారు. [Retired IPS Balasubrahmanyam NOmore MD APSRTC, Andhra Pradesh Police, Cancer Treatmeny, New York, Telugu One]
http://www.teluguone.com/news/content/retired-ips--balasubrahmanyam-nomore-md---apsrtc-43-235832.html
The All-India Motor Transport Congress has threatened
Defence Minister A. K. Antony and Union Minister
Prime Minister Manmohan Singh and party chief Sonia Gandhi




