రాప్తాడు నిందితుడి కాలు తొలగింపు: అనంతపురం జీజీహెచ్‌లో అర్ధరాత్రి శస్త్రచికిత్స.!
Publish Date:Nov 2, 2026
Advertisement
అనంతపురం జిల్లా రాప్తాడులో టెన్త్ బాలికపై చెట్లు కత్తిరించే ఎలక్ట్రిక్ రంపంతో దాడికి పాల్పడిన ఉన్నాది హూమంత్ కు అరెస్టు చేసే క్రమంలో పోలీసులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ కాల్పుల్తో హేమంత్ కాలికి తీవ్ర గాయమైన సంగతి తెలసిందే. తీవ్రంగా గాయడిన హేంమత్ కుడి కాలును వైద్యులు శస్త్ర చికిత్స చేసి తొలగించారు. పోలీసుల కాల్పుల సమయంలో బుల్లెట్లు హేమంత్ కాలికి తగలడంతో ఆ భాగంలో రక్తప్రసరణ నిలిచిపోయింది. దీంతో కణజాలం దెబ్బతిని ఆ ప్రాంతంలో తీవ్రమైన గ్యాంగ్రీన్ ఏర్పడింది. పరిస్థితిని గమనించిన వైద్య బృందం, కాలును అలాగే వదిలేస్తే శరీరంలోని ఇతర భాగాలకు కూడా ఇన్‌ఫెక్షన్ పాకి ప్రాణానికే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని నిర్ధారించారు. ఈ అత్యవసర పరిస్థితిని సంబంధిత అధికారులు న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. ప్రాణాపాయాన్ని నివారించేందుకు కాలు తొలగించడమే ఏకైక మార్గమని వైద్యులు అందజేసిన నివేదికను పరిశీలించిన కోర్టు, శస్త్రచికిత్సకు అనుమతినిచ్చింది. కోర్టు నుంచి స్పష్టమైన ఆదేశాలు వెలువడటంతో అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి వైద్యులు ఆపరేషన్ చేసి హేమంత్ కాలు తొలగించారు. మంగళవారం (నవంబర్ 2) అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రత్యేక వైద్య బృందం అనంతపురం జీజీహెచ్‌లో హేమంత్‌కు అత్యవసర శస్త్రచికిత్సను నిర్వహించింది. ఈ సర్జరీ ద్వారా అతని కుడి మోకాలు కింది భాగాన్ని పూర్తిగా తొలగించారు. [Raptadu Accused Leg Removed, Injured, Police, Firing, Anantapur GGH, Hemanth Raptadu Case, Raptadu Tenth Class Girl Attack, Telugu One]
http://www.teluguone.com/news/content/raptadu-accused-leg-removed-43-236114.html
The All-India Motor Transport Congress has threatened
Defence Minister A. K. Antony and Union Minister
Prime Minister Manmohan Singh and party chief Sonia Gandhi





