ఆరునెలల్లో అగ్రీగోల్డ్ బాధితుల సమస్య పరిష్కారం.. సీఎం చంద్రబాబు

Publish Date:May 14, 2026

Advertisement

ఏపీలోని లక్షలాది మంది అగ్రిగోల్డ్ బాధితులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. దశాబ్దంగా న్యాయం కోసం ఎదురుచూస్తున్న బాధితుల కష్టాలకు ముగింపు పలికేలా..  వచ్చే ఆరు నెలల్లోనే ఈ సమస్యను పూర్తిగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. గురువారం (మే 14) జరిగిన   కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం సీఎం ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.

సచివాలయంలో చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో  అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే ప్రక్రియను పర్యవేక్షించేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన  ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ కమిటీ బాధితుల వివరాలను పరిశీలించి, సకాలంలో వారికి చెల్లింపులు జరిగేలా చూడాలని స్పష్టం చేశారు. బాధితులకు అందాల్సిన ప్రతి పైసా అందేలా చూడటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. 

అగ్రిగోల్డ్   దేశవ్యాప్తంగా  ఎనిమిది రాష్ట్రాల్లో దాదాపు 19 లక్షల మందిని మోసంచేసింది వారిలో ఆంధ్రప్రదేశ్‌లోనే 11 లక్షల మందికి పైగా బాధితులు ఉన్నారు.  గత ప్రభుత్వం ఈ కేసును నీరుగార్చిందని, బాధితులకు న్యాయం చేయడంలో విఫలమైందన్న చంద్రబాబు  గత పాలనలో కొంతమంది అధికారులు కూడా అగ్రిగోల్డ్ నిధులను దుర్వినియోగం చేశారనే ఆరోపణలు ఉన్నాయని, వాటిపై కూడా విచారణ జరగాలన్నారు. 

సంస్థకు చెందిన ఆస్తులను వేగంగా వేలం వేయడం ద్వారా నిధులను సమీకరించి, బాధితుల బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా జమ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గతంలో ఏజెంట్లు, బాధితులు ఆత్మహత్యలు చేసుకున్న ఉదాహరణలు ఉన్నాయని, ఇకపై అటువంటి పరిస్థితులు రాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.  చట్టపరమైన చిక్కులను  తొలగించి, బాధితుల క్లెయిమ్‌లను పరిష్కరించాలని ఆదేశించారు.  

By
en-us Political News

  
తెలంగాణ పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ (PCS), హైదరాబాద్‌లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)గా విధులు
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.
టీచర్లకూ మధ్యాహ్న భోజనం.. తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో సరికొత్త పర్యాటక విధానాన్ని ప్రవేశపెట్టేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది.
తెలంగాణ పోలీస్ శాఖ భద్రతా ఏర్పాట్లలో కీలక మార్పులు చేపట్టింది.
పోస్టాఫీసు నుంచి స్పీడ్ పోస్ట్‌లో వచ్చే పార్శిల్‌లో మందులు ఉంటాయని భావిస్తారు.
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం వీబీ జీ రామ్ జీ ఏపీ నుంచి ప్రారంభమై దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది.
కర్ణాటక రాజధాని బెంగళూరు నగర శివార్లలో గురువారం తెల్లవారుజామున ఒక ఊహించని ఘోర విషాదం చోటుచేసుకుంది.
కంచన్ భాగ్ పోలీస్ స్టేషన్‌లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభ పక్ష ఉపనేత హరీశ్ రావుతో పాటు ఇతర నేతలను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో మాజీ ఐపీఎస్ అధికారి ఏ.కే. ఖాన్ కుమారుడు మొహ్సిన్ ఖాన్‌తో పాటు తబ్రేజ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
పుణేకు చెందిన ప్రముఖ రియల్టర్ కేతన్ అగర్వాల్ దారుణ హత్య కేసు ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.