Publish Date:May 15, 2026
మంటల్లో బస్సు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
Publish Date:May 15, 2026
పశ్చిమ బెంగాల్ ఫలితాలు వెలువడిన అనంతరం శిబ్ పూర్ లో బీజేపీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించింది. ఆ విజయోత్సవ ర్యాలీపై బాంబులు, తుపాకులతో షమీమ్ అహ్మద్ దాడి జరిపించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనిపై కేసు కూడా నమోదైంది.
Publish Date:May 15, 2026
కేంద్ర భద్రతా సంస్థలు, ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, సీఐఎస్ఎఫ్ బృందాలు అత్యవసర చర్యలు చేపట్టాయి. విమానం సురక్షితంగా ల్యాండ్ అయిన వెంటనే దానిని రన్‌వే నుంచి దూరంగా ఉన్న ఐసోలేషన్ బేకు తరలించారు. ప్రయాణికులు మరియు సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.
Publish Date:May 15, 2026
ఈ పెంపుతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోలు ధర 110.50 రూపాయలకు చేరింది. అలాగే డీజిల్ ధర రూ. 98.70 కి చేరింది.ఇక ఏపీలోని గుంటూరులో పెట్రోల్ లీటర్ రూ. 112.24, డీజిల్ రూ. 100.34కి చేరింది.
Publish Date:May 15, 2026
హాజీ అలీ నౌక సోమాలియా నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని షార్జాకు వెళ్తుండగా బుధవారం తెల్లవారుజామున ఈ దాడి జరిగింది.
Publish Date:May 15, 2026
మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలతో పెట్ బషీరాబాద్ పోలీసులు భగీరథ్‌పై ఐపీసీ సెక్షన్లతో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే, ఈ ఆరోపణలను భగీరథ్ తరపున కోర్టులో వాదించిన న్యాయవాది, వైసీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి తోసిపుచ్చారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ కేసు పెట్టారని ఆయన వాదించారు.
Publish Date:May 14, 2026
ఐపీఎల్ 2026లో భాగంగా ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్ మధ్య కీలక మ్యాచ్ ప్రారంభానికి ముందు అర్షదీప్ తిలక్ వర్మపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అమర్యాదగా సంబోధించారు. పంజాబ్ కింగ్స్ కు అత్యంత కీలకమైన మ్యాచ్ ప్రారంభానికి ముందు ఈ సంఘటన చోటు చేసుకుంది.
Publish Date:May 14, 2026
టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 200 పరుగులు చేసింది. ఈ 201 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై ఒక బంతి మిగిలి ఉండగానే ఛేదించింది. ముంబై బ్యాటర్ బ్యాటర్ తిలక్ వర్మ 75 నాటౌట్ తో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
Publish Date:May 14, 2026
2023లో హైదరాబాద్‌లో జరిగిన ఫార్ములా ఈ కార్ రేసు నిర్వహణలో ఆర్థిక లావాదేవీలపై వచ్చిన ఆరోపణలతో కేసు ప్రాధాన్యం సంతరించుకుంది.
Publish Date:May 14, 2026
రాష్ట్రంలో జనగణన పూర్తయ్యేలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వాస్తవానికి గ్రేటర్ నగరాల ప్రతిపాదనలపై ఇప్పటికే నిర్ణయం తీసుకోవాల్సింది.. కానీ జనగణన కారణంగా పక్కన పెట్టారు.
Publish Date:May 14, 2026
జిల్లాల పర్యటనలలోనూ కాస్ట్ కటింగ్ పాటించాలని, మెజారిటీ మీటింగులను వర్చువల్‌గా నిర్వహించాలని, ప్రెజెన్స్ అవసరం లేని ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం అమలు చేయాలని కేబినెట్ తీర్మానించింది. అలాగే, ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీల ఉష్ణోగ్రత 24 నుంచి 27 మధ్యనే ఉంచాలని నిర్ణయించింది.
Publish Date:May 14, 2026
సచివాలయంలో చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే ప్రక్రియను పర్యవేక్షించేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ కమిటీ బాధితుల వివరాలను పరిశీలించి, సకాలంలో వారికి చెల్లింపులు జరిగేలా చూడాలని స్పష్టం చేశారు.
Publish Date:May 14, 2026
ఈ నెల 16వ తేదీ నాటికి నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులకు చేరుకోవడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడనున్నాయి. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది.