రూ. 2.73 లక్షల కోట్లతో ఏపీలో రిలయెన్స్ యూసీజీ కాంప్లెక్స్.!

Publish Date:Aug 20, 2026

Advertisement

ప్రముఖ పారిశ్రామిక దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఏపీలో భారీ పెట్టుబడి ప్రణాళికతో ముందుకు వచ్చింది.  దాదాపు  2.73 లక్షల కోట్ల రూపాయల  అంచనాతో   ఇన్వెస్ట్ మెంట్ తో రాష్ట్రంలో  ఎనర్జీ ప్రాజెక్టును నెలకొల్పేందుకు సంస్థ ముందుకు వచ్చింది. వచ్చే  30 ఏళ్లలో ఈ దశలవారీ  పెట్టుబడులతో ఏలూరు జిల్లాలో   దేశంలోనే మొట్టమొదటి సమగ్ర భూగర్భ బొగ్గు గ్యాసిఫికేషన్ (యూజీసీ) కాంప్లెక్స్‌ను నిర్మించాలని రిలయన్స్ భావిస్తోంది. 

ఈ ప్రతిపాదిత ప్రాజెక్ట్ కోసం ఆంధ్రప్రదేశ్‌లోని చింతలపూడి,  రేచర్ల బొగ్గు బ్లాకులను ఎంపిక చేశారు. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఈ వేలం ప్రక్రియ ద్వారా ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ ఈ రెండు  బొగ్గు బ్లాకులను దక్కించుకుంది. క్షేత్రస్థాయి పరిశోధనలు, ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలు,  వాణిజ్యపరమైన లాభదాయకత ఆధారంగా పెట్టుబడుల కేటాయింపులు  జరగనున్నాయి.

ఈ   ప్రాజెక్ట్‌ను మూడు  దశల్లో అభివృద్ధి చేయడానికి కంపెనీ ప్రణాళిక సిద్ధం చేసింది. ప్రాథమిక అన్వేషణ, ప్రయోగాత్మక పైలట్ పనులతో ప్రారంభమయ్యే మొదటి దశను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే పట్టాలెక్కించనుంది. పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైన అనంతరం, పూర్తిస్థాయి వాణిజ్య ఉత్పత్తి దిశగా అడుగులు వేస్తుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి కార్యకలాపాలు ప్రారంభించే సమయానికి దాదాపు 3 వేల నుంచి 5 వేల మందికి ప్రత్యక్షంగానూ, పాతిక వేల మందికిపైగా పరోక్షంగానూ ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నది అంచనా.  

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన  నేషనల్ కోల్ గ్యాసిఫికేషన్ మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా రిలయన్స్ ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించింది. 2030 నాటికి దేశవ్యాప్తంగా 100 మిలియన్ టన్నుల బొగ్గు గ్యాసిఫికేషన్ సామర్థ్యాన్ని సాధించాలన్నది కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆ లక్ష్య సాధనలో ఏపీలో రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెట్ ఏలూరు జిల్లాలో నిర్మించనున్న యూజీసీ కాంప్లెక్స్ కీలక పాత్ర పోషిస్తుందనడంలో సందేహం లేదు.  

రాబోయే రోజుల్లో ఈ ప్రాజెక్ట్ ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడమే కాక, మౌలిక వసతుల కల్పన, వ్యాపార రంగాలు వేగంగా విస్తరిస్తాయని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రాథమిక సర్వే పనులు వేగవంతం కావడంతో, త్వరలోనే క్షేత్రస్థాయిలో మార్పులు కనిపిస్తాయన్న ఆశాభావం వ్యక్తమౌతోంది. 

Reliance Industries Investment inAP , Underground Coal Gasification AP, Mukesh Ambani AP Project, Eluru Coal Gasification Project, Andhra Pradesh Employment Generation

By
en-us Political News

  
సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో  దోషిగా  తీహార్ జైళ్లో  శిక్ష అనుభవిస్తున్న సజ్జన్ కుమార్ తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆయనను జైలు అధికారులు సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి చేరుకునేసరికే ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.  
 దక్షిణాదిలోని ప్రధాన ఆర్థిక కేంద్రాల మధ్య రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన చంద్రబాబు నొక్కి చెప్పారు.  అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలను సమర్థవంతంగా అనుసంధానిస్తూ కుప్పం మీదుగా ప్రత్యేక బుల్లెట్ ట్రైన్ కారిడార్‌ను ఏర్పాటు  ప్రతిపాదించారు.
హర్మూజ్ జలసంధిలోని దక్షిణ మార్గంలో, ఒమన్ తీరానికి సమీపంలో అమెరికా నియంత్రణలోని ఈ ప్రత్యేక కారిడార్‌..  సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, ఇరాక్, ఖతార్ వంటి  ఇంధన ఉత్పత్తి దేశాల నుంచి చమురు నింపుకున్న ట్యాంకర్లతో పాటు, ఖాళీగా తిరిగొచ్చే నౌకలకు కూడా పూర్తి భద్రత కల్పిస్తూ రవాణాను సమన్వయం చేస్తున్నది.
దాదాపు వెయ్యి కోట్ల రూపాయల  విదేశీ చెల్లింపుల  వ్యవహారంలో పన్ను ఎగవేత, యు అక్రమ నిధుల మళ్లింపు ఆరోపణలపై ఐటీ అధికారులు ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఏకకాలంలో  13 ప్రాంతాలలో సోదాలు చేపట్టారు.  ఈ సోదాల్లో డిజిటల్ ఆధారాలు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో తన వాటాను 9.99 శాతానికి పెంచుకోవడానికి ఎల్‌ఐసికి ఆర్బీఐ అనుమతి లభించింది. ఈ వార్తతో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ షేరు ధర 1% పెరిగింది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఆస్ట్రేలియా టెన్నిస్ స్టార్ నిక్ కిర్గియోస్ డోపింగ్ వివాదంలో చిక్కుకున్నాడు. కొకైన్ పరీక్షలో పాజిటివ్‌గా తేలడంతో ITIA అతడిపై తాత్కాలిక సస్పెన్షన్ వేటు వేసింది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఎఫ్‌ఐహెచ్ పురుషుల హాకీ వరల్డ్ కప్ పూల్ డి మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై భారత్ 5 3 తేడాతో సంచలన విజయం సాధించింది. హర్మన్‌ప్రీత్ సింగ్, అభిషేక్ చెరో రెండు గోల్స్‌తో చెలరేగి జట్టుకు ఘన విజయాన్ని అందించిన పూర్తి వివరాలు చూడండి.
బిడబ్ల్యూఎఫ్ వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్‌లో పీవీ సింధు, ఆయుష్ శెట్టి ప్రిక్వార్టర్స్‌లోకి దూసుకెళ్లారు. సాత్విక్ చిరాగ్ జోడీకి వాకోవర్ లభించగా, లక్ష్యసేన్ తీవ్ర పోరాటంలో ఓటమి పాలయ్యాడు. మ్యాచ్ ఫలితాలు, కీలక గణాంకాల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి!
అంతర్జాతీయ చెస్ రంగాన్ని ఏలుతున్న భారత్! ప్రతిష్టాత్మక సింక్‌ఫీల్డ్ కప్‌లో ఫ్రాన్స్ గ్రాండ్‌మాస్టర్‌ను ఓడించి అగ్రస్థానానికి చేరుకున్న ఆర్. ప్రజ్ఞానంద. మరోవైపు ఆసియాన్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో భారత అండర్ 11 బాలికల జట్టు బ్రాంజ్ మెడల్ సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. పూర్తి వివరాలు చదవండి.
నాసా ప్రతిష్టాత్మక స్విఫ్ట్ గామా-రే టెలిస్కోప్ రెస్క్యూ మిషన్ విఫలమైంది. $30 మిలియన్ల వ్యయంతో చేపట్టిన రోబోటిక్ క్రాఫ్ట్ నియంత్ పిలవకపోవడంతో మిషన్‌ను నాసా రద్దు చేసింది. త్వరలోనే భూ వాతావరణంలో మండిపోనున్న స్విఫ్ట్ టెలిస్కోప్ పూర్తి వివరాలు ఇవే!
ఆస్టిన్ నగరంలో టెస్లా రోబోటాక్సీ ప్లాస్టిక్ బొల్లార్డ్స్‌ను ఢీకొట్టిన వైరల్ వీడియో వెనుక ఉన్న పూర్తి వివరాలు, టెస్లా స్వయంప్రతిపత్తి భద్రతా రికార్డులు మరియు సైబర్‌క్యాబ్ ప్రయోగాల వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.