మంత్రి తలసాని సన్నిహితుల చుట్టూ ఈడీ ఉచ్చు

Publish Date:Nov 22, 2022

Advertisement

చీకోటి ప్రవీణ్ క్యాసినో కేసు దర్యాప్తు మొత్తం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చుట్టూ ఉచ్చు బిగిస్తోందా? ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ నోటీసులు జారీ చేస్తున్న వారు, విచారణకు పిలుస్తున్న వారిలో అత్యధికులు తలసాని సంబంధీకులే కావడంతో ఈ అనుమానాలు వ్యక్త మౌతున్నాయి. ఇప్పటి వరకూ చీకోటి ప్రవీణ్ కేసుకు సంబంధించి తెలంగాణలో ఈడీ నోటీసులు అందుకున్న వారు కానీ, విచారణకు హాజరైన వారు కానీ చాలా వరకూ తలసాని సంబధీకులు, ఆయన ఆర్థిక వ్యవహారాలుచూసే వారే కావడం గమనార్హం. ఈడీ ఇప్పటి వరకూ ఆయనకు నోటీసులు ఇవ్వలేదన్నమాటే కానీ ఆయన ఇద్దరు సోదరులు, వ్యక్తిగత కార్యదర్శిలను ఈడీ నోటీసులు జారీ చేసి పిలిపించుకుని మరీ ప్రశ్నించింది.

ఒక దశలో తలసాని కుమారుడికీ ఈడీ నోటీసులు జారీ చేసినట్లు విస్తృతంగా ప్రచారమైంది. అయితే.. అది వాస్తవం కాదనీ, ఈడీ నుంచి తనకు ఎలాంటి నోటీసులూ రాలేదనీ తలసాని కుమారుడు స్పష్ట చేశారు. ఇప్పుడిప్పుడే రాజకీయంగా ఎదుగుతున్న తనను బదనాం చేసే ప్రయత్నాలు చేయవద్దని ఆయన ట్వీట్ చేశారు. ఆయనకు నోటీసులు వచ్చాయా? లేదా అన్నసంగతి పక్కన పెడితే.. చీకోటి ప్రవీణ్ తో తలసానికి సన్నిహిత సంబంధాలున్నాయని ఈడీ గట్టిగా నమ్ముతోంది. అంతెందుకు చీకోటి ప్రవీణ్ క్యాసినో కేసులో మంత్రి తలసాని చుట్టూ ఉచ్చు బిగుస్తోందని తెరాస వర్గాలలోనే చర్చ జరుగుతోంది. అయితే తలసానికి నేరుగా ఈ కేసులో సంబధాలు ఉన్నట్లు రుజువు అయ్యే అవకాశాలు లేవన్న చర్చా సాగుతోంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న తలసాని ఆర్థిక వ్యవహారాలన్నీ తన సన్నిహితుల పేరు మీదే ఉంటాయనీ అంటున్నారు. ఆ కారణంగానే ఇప్పటి వరకూ తలసానికి ఈడీ నోటీసులు జారీ చేయలేదని చెబుతున్నారు. కానీ క్యాసినో కేసులో తలసాని సన్నిహితులకు ఉచ్చు బిగిసిందనే పరిశీలకులు కూడా విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు ఈడీ నోటీసులు జారీ చేసి విచారణ సాగిస్తున్న వారంద గురించీ చీకోటి ప్రవీణ్ విచారణలో వెల్లడించిన వివరాల ఆధారంగానే ఈడీ ప్రశ్నిస్తోందని అంటున్నారు. చీకోటి ప్రవీణ్   కస్టమర్ల ఖాతాలను బయటకు తీసి.. వారి ఆర్థిక లావాదేవీలపైనే విచారణ కేంద్రీకృతమై ఉండటంతో ఈడీ నోటీసులు అందుకున్న వారంతా ఆందోళనలో ఉన్నారంటున్నారు.

By
en-us Political News

  
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్‌ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్‌ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.