అండర్ గ్రౌండ్ కు ఎంపీ సంతోష్? కేసీఆర్ సూచన మేరకేనా?

Publish Date:Nov 22, 2022

Advertisement

ఢిల్లీ లిక్కర్ స్కాం తెరాసలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎప్పుడు ఎవరిని ఈడీ విచారణకు పిలుస్తుందా అన్న గుబులు తెరాస ముఖ్య నేతలలో మొదలైంది. ఈ స్కాం బయట పడినప్పటి నుంచీ పెద్దగా ఎక్కడా బయట కనిపంచకుండా తిరుగుతున్న తెరాస ఎంపీ సంతోష్ ఇప్పుడు పూర్తిగా అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఈడీ నజర్ సంతోష్ మీద ఉందని విశ్వసనీయంగా తెలిసిన సమాచారంతో ముఖ్యమంత్రి కేసీఆర్ సలహా మేరకే సంతోష్ అండర్ గ్రౌండ్ లోకి వెళ్లారని తెలుస్తోంది. ఈ కుంభకోణంలో తెరాస అధినేత కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితపై ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి విదితమే. ఢిల్లీ మద్యం కుంభకోణం బయటపడగానే దాని మూలాలు తెలంగాణలోనే ఉన్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.

ఆ ఆరోపణలకు అనుగుణంగానే ఆ కుంభకోణం కేసు తీగ లాగితే మూలాలు తెలంగాణలో బయటపడ్డాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కవిత, ఆయన సమీప బంధువు రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ సహా తెరాస అధినాయకత్వానికి సన్నిహితులకు ఈ కుంభకోణంలో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ కేసు విచారిస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)   హైదరాబాద్’లో పలుచోట్ల తనిఖీలు జరిపింది. కొందరికి నోటీసులు జారీ చేసింది. కొందరిని అరెస్టు చేసింది. కవిత, సంతోష్ సహా మరి కొందరు ముఖ్యులకు సన్నిహితులైన వారికి కూడా అరెస్టు చేసింది.  కాగా ఈ స్కాం కు సంబంధించి తెలంగాణలొ   తెరాస అగ్రనేతలకు సన్నిహితుడైన బోయనపల్లి అభిషేక్  అరెస్టు అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ అరెస్టుతో కవిత, సంతోష్ రావులకు ఢిల్లీ లిక్కర్ స్కాంలో లింకులున్నాయన్న ఆరోపణలకు బలం చేకూరినట్లైంది.

ఈ నేపథ్యంలోనే  నలుగురు తెలంగాణ ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్ కు, ఇటీవలి కేసీఆర్ పది రోజుల హస్తిన పర్యటనకు లింకు ఉందా? ఈ రెండింటి వెనుకా ఉన్నది ఢిల్లీ లిక్కర్ స్కామేనా? ఆ స్కామ్ నుంచి తన బిడ్డ కవితను, సమీప బంధువు సంతోష్ ను బయటపడేయాలన్న కేసీఆర్ ప్రయత్నాలు విఫలం కావడమే కొనుగోలు డ్రామాకు కారణమా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. కేసీఆర్ ఇటీవల హఠాత్తుగా చెప్పాపెట్టకుండా హస్తిన వెళ్లి అక్కడ పది రోజుల బస చేసి అక్కడ చేసిందేమిటన్న విషయంపై సస్పెన్స్ విడిపోయిందంటున్నారు.

ఆయన హస్తిన పర్యటన తిమ్మిని బిమ్మిని చేసైనా సరే ఢిల్లీ లిక్కర్ స్కాం నుంచి తన బిడ్డ కవితను, సంతోష్ ను బయటపడేయడాని ఆయన చేయని ప్రయత్నం లేదని అంటున్నారు.  తన హస్తిన పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను కలవడానికి కేసీఆర్ చేసిన ప్రయత్నం కూడా ఫలించలేదనీ, కేసీఆర్ కు అప్పాయింట్ మెంట్ ఇచ్చేందుకు కూడా అమిత్ షా ఇష్టపడలేదని అంటున్నారు. దీంతో దిక్కు తోచని కేసీఆర్  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి గవర్నర్ నరసింహన్ ను తన దూతగా అమిత్ షా వద్దకు పంపారని,   అయితే నరసింహన్ ప్రతిపాదన వినగానే అమిత్ షా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారనీ,  ఆల్ మోస్ట్ గెటౌట్ అంటూ అవమానించారనీ చెబుతున్నారు.  అదంతా పక్కన పెడితే ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో సంతోష్ కు సమన్లు జారీ అయ్యే అవకాశాలున్నాయని, ఈడీ నెక్స్ట్ టార్గెట్ సంతోషేనని కేసీఆర్ కు విశ్వసనీయంగా తెలియడంతోనే కేసీఆర్ సంతోష్ ను కొద్ది రోజుల పాటు అజ్ణాతంలోకి వెళ్లాల్సిందిగా సూచించినట్లు తెలుస్తోంది.

ఆయన సూచన మేరకే సంతోష్ అండర్ గ్రౌండ్ కు వెళ్లారంటున్నారు. ప్రస్తుతం సంతోష్ తన సెల్ ఫోన్ కూడా స్విచ్చాఫ్ చేసేసి ఎవరికీ అందుబాటులో లేకుండా అండర్ గ్రౌండ్ కు వెళ్లి పోయారంటున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టయిన వారి కస్టడీని పొడగించడంతోనే కేసీఆర్ సంతోష్ ను అజ్ణాతంలోకి వెళ్లాల్సిందిగా సలహా ఇచ్చినట్లు చెబుతున్నారు.అలాగే తన కుమార్తె కవితను కూడా బీఆర్ఎస్ నేషనల్, ఇంటర్నేషనల్ మీడియా సలహాదారు పేరు చెప్పి హస్తినకే పరిమితం చేశారని అంటున్నారు. 

By
en-us Political News

  
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్‌ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్‌ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.