చిరుకు పురస్కారం.. బీజేపీ వ్యూహమేనా?

Publish Date:Nov 22, 2022

Advertisement

మెగాస్టార్ చిరంజీవి.. నటుడిగా ఆయనకు పురస్కారాలు దక్కడం ఎవరూ అభ్యంతర పెట్టరు. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఆయనను వరించడం ఆయన నటనా కిరిటంలో మరో కలికితురాయి అనడంలో సందేహం లేదు.

కానీ ఆ తరువాత మోడీ ఇత్యాదుల అభినందనలతోనే కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఈ పురస్కారం విషయంలో కూడా రాజకీయ లెక్కలు వేసుకుందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఎందుకంటే ప్రతి ఏటా ఇచ్చే ఒక అవార్డు చిరంజీవికి దక్కడం వల్ల ఆయనకు కొత్తగా ఒరిగేదేమీ ఉండదు. ఆయన నటనా వైదుష్యానికి ఇలాంటి పురస్కారాలతో మెరుగులు అద్దినట్లు కావు.

పద్మ విభూషన్ చిరంజీవి నటుడిగా తన ప్రతిభ, ఘనత ఏమిటన్నది ఇప్పటికే రుజువు చేసుకున్నారు. అయితే చిరంజీవికి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ పురస్కారం తరువాత బీజేపీ నేతలు చేస్తున్న హంగామా, హడావుడే.. దీని వెనుక ఆ పార్టీ ఏదైనా రాజకీయ ప్రయోజనం ఆశిస్తోందా అన్న అనుమానాలకు తావిస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా చిరంజీవిని అభినందిస్తూ ట్వీట్ చేశారు. ఏపీ బీజేపీ కూడా అభినందనలు తెలిపింది.

ఈ పురస్కారం ద్వారా చిరంజీవిని ‘తమ’ వాడు చేసేసుకున్నామని బీజేపీ బిల్డప్ ఇవ్వడానికి ప్రయత్నిస్తోందా అనిపించక మానదు. ఇక ఒక్క సారి వెనక్కు వెళ్లి చూస్తే.. అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు మోడీ భీమవరం వచ్చినప్పుడు ప్రత్యేకంగా చిరంజీవిని ఆహ్వానించి.. ఆయనతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇక చిరంజీవి సోదరుడు, జనసేనాని పవన్ కల్యాణ్ ఇప్పటికే బీజేపీ తో  మైత్రిలో ఉన్నారు.  

ఈ నేపథ్యంలోనే చిరంజీవిని బీజేపీ ప్రత్యేక ప్రాముఖ్యతతో చూస్తోందని అంటున్నారు. చిరంజీవి కూడా ఇటీవలి కాలంలో తాను రాజకీయ ప్రవేశం చేస్తున్నట్లుగా చెప్పకపోయినా.. రాజకీయ ఆసక్తి మాత్రం కనబరుస్తున్నారు. తన కంటే రాజకీయాలలో తన సోదరుడు మెరుగ్గా రాణిస్తారనీ, ఆయన గొప్ప స్థానానికి వెళతారనీ ఇటీవలే చెప్పారు.  భీమవరంలో జరిగిన అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణలో మోడీ చిరంజీవికి ఇచ్చిన ప్రాధాన్యత ప్రత్యేకంగా ఉంది. చిరంజీవి తనకు ఎంతో ఆప్తమిత్రుడన్నట్లుగా మీడీ తీరు ప్రస్ఫుటమైంది. తర్వాత కూడా ఈ పాజిటివ్ ఫీలింగ్ ఉండేలా బీజేపీ వ్యవహరిస్తోంది.   చిరంజీవి మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినా రాకపోయినా ఆయన కరిష్మాను బీజేపీ పూర్తిగా ఉపయోగించుకునేందకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఒక వైపు చిరంజీవి సోదరుడు పవన్ కల్యాణ్ పార్టీ జనసేనతో పొత్తులో ఉండి కూడా.. సినీ గ్లామర్ మరింత ఎక్కువగా వచ్చే ఎన్నికలలో తమకు లబ్ధి చేకూర్చేందుకు వీలుగా అందరివాడు చిరంజీవిని తమ వాడుగా ప్రొజెక్ట్ చేసుకోవాలని బీజేపీ యోచిస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

మొత్తం మీద ఏపీ రాజకీయాలలో పవన్ కల్యాణ్ ఒక్కడే కాకుండా చిరంజీవిని కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా తమకు అనుకూలంగా ఉపయోగించుకోవాలని బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందని చెబుతున్నారు. మరి ఆ వ్యూహాలు ఫలిస్తాయా? లేదా అన్నది రానున్న రోజులలో తేలుతుంది. ప్రస్తుతానికైతే రాజకీయాలకు దూరంగా ఉన్నానంటూనే చిరంజీవి పవన్ కల్యాణ్ రాజకీయ భవిష్యత్ భేషుగ్గా ఉంటుందంటూ జోస్యాలు చెబుతున్నారు. 

By
en-us Political News

  
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్‌ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్‌ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.