దొంగవేబిల్లులతో ఎర్రచందనం స్మగ్లింగు

Publish Date:Jul 11, 2012

Advertisement

జొన్నల లోడుకు వేబిల్లు రాయించి ఎర్రచందనం స్మగ్లింగు చేస్తున్న తీరు నేరప్రపంచంలోనే ఓ వినూత్న పోకడగా భావించాలి. స్మగ్లింగు చేసే ముఠా ఏమో తమిళనాడుదైతే లారీ డ్రైవర్‌ మాత్రం పంజాబీ కావటం కూడా గమనార్హం. ఇంతకీ ఈ లోడు దొరకటానికి కారణం గంట క్రితమే చెకింగ్‌ అయ్యాక మళ్లీ చెకింగేమిటని లారీ డ్రైవర్‌ తనిఖీ చేయకుండా వేగంగా కదిలిపోవటమే. ఈ సమాధానమే ఒక చిత్రంగా ఉందని అనుమానించి వెంబడిస్తే లారీని ఇంకా వేగంగా డ్రైవర్‌ నడపటం, ఎస్సై దాన్ని వెంబడిస్తూనే తమ శాఖ ఉన్నతాథికార్ల ద్వారా సహాయం తీసుకోవటం, ఓ ఛేజింగ్‌ తరువాత ఆయన తన సిబ్బందితో లారీని ఆపటం ఓ మాస్‌చిత్రంలోని ఘటనలను కూడా తలపిస్తున్నాయి. ఈ ఘటనకు గుంటూరు జిల్లా వేదికైంది. ముందస్తుగా ఎర్రచందనం లోడు స్మగ్లింగు గుంటూరు జిల్లా మీదుగా జరుగుతోందని పోలీసులకు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు గుంటూరు జిల్లా నకరికల్లు వద్ద ఇన్‌ఛార్జి ఎస్‌ఐ మల్లిఖార్జునరావు తన సిబ్బంది సాయంతో తనిఖీలు చేపట్టారు.

 

 

ఈ లోపు చెన్నయ్‌ నుంచి ఢల్లీకి వెళుతున్న లారీ ఒకదాన్ని ఆపమని సిబ్బందికి ఇన్‌ఛార్జి ఎస్‌ఐ ఆదేశాలిచ్చారు. వారు ఆపగానే డ్రైవర్‌ గంట క్రితమే చెక్‌ చేసి మళ్లీ చెకింగ్‌ అంటారేమిటని ఎదురు ప్రశ్నించి ఆపినట్లే ఆపి లారీని ముందుకు దూకించారు. దీంతో ఆ లారీ డ్రైవర్‌ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉందని ఆపమని కోరుతూ వెనుకనే పోలీసులు ఛేజింగ్‌ మొదలుపెట్టారు. దీంతో లారీ డ్రైవర్‌ వేగాన్ని పెంచాడు. అకస్మాత్తుగా వేగం పెంచడం అనుమానం బలపడటానికి కారణమైంది. వెంటనే ఇన్‌ఛార్జి ఎస్‌ఐ, తమ సిఐ బిలాలుద్దీన్‌కు సమాచారం అందించారు. ఆయన కూడా రాజుపాలెం ఎస్‌ఐను ఎదురు పంపించారు. ఈలోపు లారీని ఛేజింగ్‌ చేసిన ఇన్‌ఛార్జి ఎస్‌ఐ లారీకి అడ్డంగా తమవాహనం ఉంచి డ్రైవర్‌ సర్వేందర్‌సింగ్‌, క్లీనర్‌ను వేబిల్లులు చూపమన్నారు. దానిలో జొన్నల లోడు వేబిల్లులున్నాయి. లారీలో పరిశీలిస్తే పైరెండు వరుసలు జొన్నలలోడు కింద ఎర్రచందనం దుంగలు దాదాపు కోటిరూపాయలకు పైబడినది కనపడ్డాయి. దీంతో డ్రైవర్‌, క్లీనర్‌లతో పాటు తమిళనాడుకు చెందిన కుదూర్‌, కృష్ణలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
 

By
en-us Political News

  
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.
జీవితాంతం కలిసుంటామని మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన దంపతుల మధ్య వివాహేతర సంబంధం చిచ్చు పెట్టింది.
గతంలో హైదరాబాద్ నగరం తక్కువ ధరలో మెరుగైన మౌలిక వసతులతో కూడిన నివాసాలను అందించే ప్రాంతంగా ప్రత్యేక గుర్తింపు ఉండేది. కానీ ఇటీవల ప్రైమింగ్ వ్యూహాలు,  విలాసవంతమైన ప్రాజెక్టులపై రియల్టర్లు, బిల్డర్లు అతిగా దృష్టి సారించడం వల్ల ధరలు విపరీతంగా పెరిగి.. ఇళ్లు కొనుగోలు అంటేనే సాధారణ, మధ్య తరగతి, వేతన జీవులు వణికిపోయే పరిస్థితి ఏర్పడింది
వనదేవతలు పూజలందుకునే గుడిని గుర్తుతెలియని వ్యక్తులు కూల్చివేయడం పట్ల భక్తులు,  గిరిజనులు  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దసరా పండుగను తన స్వగ్రామమైన కొండారెడ్డిపల్లిలో కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకున్నారు.
అడవిలో స్వేచ్ఛగా తిరుగుతూ ప్రకృతి అందాలను పెంచే మూగజీవాలపై తుపాకీ గురిపెట్టారు.
తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన సౌలభ్యం, శాంతిభద్రతల పటిష్టత దిశగా ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది.
రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా ముంచుకొస్తున్న వాతావరణ మార్పులు, అసాధారణ వాతావరణ పరిస్థితులపై తెలంగాణ ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది.
1,000 మందికి పైగా టార్గెట్‌.. నిందితుడు అరెస్టు.!
తాజాగా వెలువడిన ఆర్థిక ఫలితాల ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మెట్రో సంస్థ భారీ మొత్తంలో లోటును చవిచూడాల్సి వచ్చింది. ప్రయాణాల ద్వారా వచ్చే ఆదాయం కంటే, రోజువారీ నిర్వహణ, ఫైనాన్స్ ఖర్చులే అధికంగా ఉండటంతో  లోటు 405 కోట్ల రూపాయలు దాటేసింది. 
తీరొక్క పూలతో కళకళలాడుతున్న మార్కెట్లు.!
భద్రాచలంలో పౌరసరఫరాల శాఖకు చెందిన ఓ అధికారి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది.
సద్ధుల బతుకమ్మ వేడుకలను పురస్కరించుకుని హైదరాబాద్‌ నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించనున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.