కర్ణాటక కాంగ్రెస్ లో అసమ్మతి సెగలు!

Publish Date:Jul 31, 2023

Advertisement

ముఖ్యమంత్రి సిద్దరామయ్య కాదన వచ్చును,  ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్ అదేదో ..జోక్ అన్నట్లు కొట్టెయ వచ్చును, కానీ, కర్ణాటక కాంగ్రెస్ లో అసంతృప్తి రగులుతోంది... ఇది నిజం. అయితే, ఎమ్మెల్యేల అసంతృప్తి ఇప్పటికిప్పుడు భగ్గుమనే పరిస్థతి లేదు. ముఖ్యమంత్రి దృష్టిని ఆకర్షించేందుకు, కాదంటే, నియోజక వర్గ ప్రజల్లో చులకన కా కూడదన్న ఆలోచనతో , పత్రికలలో ప్రచారం కోసం  అసంతృప్తి రూట్ ఆశ్రయించి ఉంటే ఉండవచ్చును.

అయినా మంత్రులకు ఎమ్మెల్యేలకు మధ్య దూరం పెరుగుతోంది అనేది నిజమని కాంగ్రెస్ నేతలు సైతం అంగీకరిస్తున్నారు. సెగ లేనిదే పొగరాదు ..స్వయంగా ముఖ్యమంత్రి సిఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేల అసంతృప్తి ప్రస్తావన చేశారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చిని పరిశీలకులు అంటున్నారు. 

 ముఖ్యమంత్రి సిద్దరామయ్య సీఎల్పీ సమావేశంలోనే మంత్రులకు క్లాసు తీసుకున్నారు. మంత్రుల పట్ల  ఎమ్మెల్యేల ఆగ్రహాన్ని, ఎమ్మెల్యేల ఫిర్యాదులను మంత్రుల ముందుంచి ... ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కుని గెలిచిన ఎమ్మెల్యేలు, నిండా రెండు నెలలు అయినా నిండకుండానే ఎందుకు నొప్పులు పడుతున్నారో, ఎందుకంత ఇబ్బంది పడుతున్నారో తెలుసుకోవాలంటూ మంత్రులను సిద్ధరామయ్య మందలించారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలే మీడియాకు ఉప్పందిస్తునారు. 

ప్రజల నమ్మకాల మేరకు పని చేయలేకపోతున్నామని, మా నియోజకవర్గ పనులపై ఇంఛార్జ్ మంత్రులు స్పందించడం లేదని, నిధులు మంజూరు చేయడం లేదని ఆరోపిస్తూ సీనియర్ నేత బీఆర్ పాటిల్ సహా 10 మంది ఎమ్మెల్యేలు సంతకాలతో కూడిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఆప్పట్లో  అది ఫేక్ లేఖగా కాంగ్రెస్ నేతలు కొట్టి పారేశారు.   తాజాగా మరో ఎమ్మెల్యే తన ఆవేదన వెళ్లగక్కతూ సీఎం సిద్ధరామయ్యకు అదే తరహలో లేఖ రాశారు. ఎమ్మెల్యేలుగా నియోజకవర్గాల్లో ఎలాంటి పనులు చేయలేకపోతున్నానని... తనను కనీసం ఏదో ఒక మంత్రికి పీఏగానో, ఓఎస్డీగానో నియమించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు మరో ఎమ్మెల్యే లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది.

ఈ లేఖను వారో వీరో ఎవరో కాకుండా సీఎల్పీ సమావేశంలో స్వయంగా సిద్ధరామయ్య బయటపెట్టారు. ప్రభుత్వం ఏర్పాటైన రెండు నెలల్లోనే ఎమ్మెల్యేలు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసుకోవాలంటూ మంత్రులను సిద్ధరామయ్య మందలించారు. కాగా ముఖ్యమంత్రి స్వయంగా ఎమ్మెల్యేల అసంతృప్తిని వారి ఎదుటే బయట పెట్టడంతో సిఎల్పీ సమావేశంలో మరి కొందరు ఎమ్మెల్యేలు కూడా మంత్రులు అందుబాటులోకి రావడం లేదని ఫిర్యాదు చేశారని సీనియర్‌ ఎమ్మెల్యే ఒకరు తెలిపారు. అయితే, తమ ఫిర్యాదుల్లో ఎమ్మెల్యేలు ఎవరూ ఏ మంత్రిని కూడా ప్రత్యేకంగా ప్రస్తావించలేదని ఆయన పేర్కొన్నారు.
అదలా ఉంటే, పాటిల్ లేఖపై సంతకాలు చేసినట్లు చెపుతున్న ఒకరిద్దరు ఎమ్మెల్యేలు    ముఖ్యమంత్రి  దృష్టిని ఆకర్షించేందుకే లేఖ రాశామని చెప్పగా.. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వారిని మందలించారు. అటువంటి వ్యూహాలకు పాల్పడకుండా నేరుగా ఫిర్యాదులను తన వద్ద ప్రస్తావించాలని ఆయన వారిని కోరినట్లు చెపుతున్నారు.

ఈ నేపధ్యంలోనే చన్నగిరి ఎమ్మెల్యే తన అభ్యర్థనపై ఎటువంటి స్పందన రాలేదని, కాబట్టి తనను ఓఎస్‌డీ లేదా ఏ మంత్రికి వ్యక్తిగత కార్యదర్శిగా నియమించాలని సీఎంను అభ్యర్థించారు. అయితే, తర్వాత ఈ లేఖ ఓ జోక్ అంటూ కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి.అయితే ఎమ్మెల్యేల అసంతృప్తికి కారణం ఏమంటే..ఎన్నికల సమయంలో ఇచ్చిన ఐదు గ్యారంటీల అమలు ఆనుకున్న విధంగా సాగకపోవడతో ప్రజలు ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారు, అందుకే ఎమ్మెల్యేలలో అసంతృప్తి అగ్గి రాజుకుందని అంటున్నారు.అయితే. ఈ మొతం వ్యవహారానికి కొసమెరుపు ఏమంటే,  నిధుల కొరతను కారణంగా చూపించి ఈ ఏడాదికి హామీల అమలు విషయంలో  సర్దుకుపోవాలని, ఉప ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు శివకుమార్ చేతులేత్తశారు.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.