పవన్ కు బీజేపీ ఆఫర్.. కలిసి నడిస్తే చిరంజీవికి రాజ్యసభ?

Publish Date:Jul 31, 2023

Advertisement

ఏపీ రాజకీయాలలో ఇప్పుడు విచిత్ర పరిస్థితి నెలకొంది. ప్రతిపక్ష పార్టీల మధ్య పొత్తుల వ్యవహారం ఏ తీరానికి చేరుతుందా అన్న స్పష్టత రాలేదు. జనసేన పార్టీ ఇప్పటికే బీజేపీకి మిత్రపక్షంగా ఉంది.  అదే సమయంలో  టీడీపీతో కూడా కలిసి వెళ్లాలని ఆలోచన చేస్తున్నది. ఇప్పటికే ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా తన వైఖరిని చాలాసార్లు ఓపెన్ గానే చెప్పేశారు. అయితే, బీజేపీ నుండి ఇప్పటికిప్పుడు టీడీపీతో కలిసి వెళ్లాలా అనే దానిపై ఇంకా సందిగ్దత కొనసాగుతున్నది. మరోవైపు టీడీపీ కూడా జనసేనతో అయితే ఒకే కానీ.. బీజేపీతో అవసరమా అన్నట్లుగా ముభావంగా ఉంది. అందుకే పవన్ కళ్యాణ్ బీజేపీకి రాంరాం చెప్పేసి టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్తారని కూడా పెద్దగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే  ఇటీవల పవన్ ఢిల్లీలో ఎన్డీఏ సమావేశానికి హాజరై బీజేపీతోనే ప్రయాణం అన్న స్పష్టత ఇచ్చేశారు. 

అదే సమయంలో  ఏపీలో  ప్రస్తుతం బీజేపీ కలిసి వస్తే సరే లేకుంటే తెలుగుదేశం-జనసేన కలిసి వెళ్తాయనే ప్రచారం   గట్టిగానే జరుగుతుంది. అందుకే బీజేపీ ముందుగానే మేల్కొని సరికొత్త ప్రతిపాదనలతో  రాజకీయం మొదలు పెట్టినట్లుగా  రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. టీడీపీని కాదని తనతో కలిసి ఉండేలా బీజేపీ పవన్ కళ్యాణ్ కు కొన్ని ఆఫర్లు ప్రకటించినట్టు తెలుస్తోంది.  తమతో జనసేన కలిసి నడిస్తే.. పవన్ సోదరుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు, మెగాస్టార్ చిరంజీవిని మరోసారి రాజ్యసభకు పంపిస్తామని బీజేపీ పవన్ కళ్యాణ్ కు అఫర్ చేసినట్లుగా సోషల్ మీడియాతో పాటు రాజకీయ వర్గాలలో   ప్రచారం జరుగుతున్నది.

చిరంజీవి గతంలో తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి తరువాత కాంగ్రెస్ తరఫున  ఒకసారి రాజ్యసభకు వెళ్లి మంత్రిగా కూడా పనిచేశారు. అయితే, ఈసారికి బీజేపీ ఆయనను  రాజ్యసభకు పంపే  ఆలోచన చేస్తున్నదని, అందుకు ఏపీలో జనసేన తమ పార్టీతో కలిసి నడవాలన్న కండీషన్ పెట్టిందని అంటున్నారు.

నిజానికి  తెలుగుదేశం పార్టీని కాదని జనసేన బీజేపీతో ఎన్నికలకు వెళ్తే ఆ రెండు పార్టీల కూటమి పెర్ఫార్మెన్స్ ప్లాప్ కాక తప్పదన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో బలంగా వ్యక్తం అవుతోంది. బీజేపీ ఏపీలో ఒక్క శాతం ఓట్లు దక్కించుకుంటే అదే బ్రహ్మాండం. ఇక జనసేనాని పవన్ కళ్యాణ్ తన హీరో ఇమేజ్ ను ఎంతవరకు ఓట్లుగా మలచుకోగలరన్నది ఆయన రాజకీయ ప్రవేశం చేసి ఇన్నేళ్లైనా ఎలాంటి క్లారిటీ లేకుండానే మిగిలిపోయింది.  

అదే టీడీపీతో కలిసి వెళ్తే పవన్ ఈసారి అసెంబ్లీలో అడుగుపెట్టడంతో పాటు ఎంతో కొంత మంది జనసేన పార్టీ అభ్యర్థులను కూడా గెలిపించుకోగలరని  పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తన సోదరుడికి రాజ్యసభ సభ్యత్వం అన్న ఒకే ఒక్క ఆఫర్ ను అంగీకరించి బీజేపీతోనే ప్రయాణిస్తారా అంటే నమ్మశక్యంగా లేదని పరిశీలకులు అంటున్నారు.  

మరోవైపు బీజేపీ ఏపీలో పాగా వేయడానికి ఎన్నాళ్ళుగానో ఆరాటపడుతున్నది. అందులో భాగంగానే పవన్ ద్వారా మెగా ఫ్యామిలీని గుప్పిట్లో పెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నదంటున్నారు. ఇప్పటికే నందమూరి కుటుంబం నుండి పురంధేశ్వరికి బీజేపీ రాష్ట్ర పగ్గాలు అప్పగించింది. గతంలో  అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ తో భేటీ అయి ఏవో చర్చలు జరిపారు. తమకు మద్దతు ఇవ్వాలని అమిత్ షా కోరగా జూనియర్ ఎన్టీఆర్   సున్నితం తిరస్కరించినట్లుఅప్పట్లో ప్రచారం జరిగింది.

ఇలా మొత్తంగా ఏదో ఒక మార్గాన ఏపీలో జెండా ఎగరేయాలని బీజేపీ తహతహలాడుతున్నది. అందులో భాగంగానే టీడీపీ నుండి పవన్ ను దూరం చేసి తద్వారా రెండు పార్టీలనూ బలహీనం చేయడం ద్వారా రాష్ట్రంలో తన పెత్తనానికి ఢోకా లేకుండా చూసుకోవాలన్నది బీజేపీ వ్యూహంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ నేతృత్వంలోని వైసీపీ బీజేపీ బంధిత పార్టీయే అంటూ వారు వివరిస్తున్నారు.  

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.