వైఎస్ వివేకా హత్య వెనుక జగన్, భారతి: సునీల్ యాదవ్ సంచలన ఆరోపణ.. తనకు ప్రాణహాని ఉందని ఆందోళన.!

Publish Date:Sep 29, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిత్య సంచలనంగా మిగిలిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య ఉదంతం మరోసారి రాజకీయ దుమారం  ఈ హత్య కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నాటి ఘటనకు సంబంధించి పలువురు ప్రముఖుల ప్రమేయం,   ఈ కేసులో కొందరికి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ రాజకీయ లబ్ది చేకూరిందనే ఆరోపణలు సంచలనంగా మారాయి. .

ఘటన జరిగిన నాటి నుంచి దర్యాప్తు సరళి, కేసు దారి మళ్లిన వైనంపై వివిధ రాజకీయ పక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు గురైన సమయంలో స్థానిక పరిస్థితులు, తదనంతరం తెరపైకి వచ్చిన అంశాలు పలు అనుమానాలకు తావునిచ్చాయి. ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు. ఈ కేసు విషయంలో ఆమె అలుపెరుగని న్యాయపోరాటం చేశారు. చేస్తున్నారు. 

ఈ కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ విచారణలో  హత్య జరిగిన రోజు ఉదయం నుంచి జరిగిన పరిణామాలు, టెలిఫోన్ సంభాషణలు, గూగుల్ టేకౌట్ వివరాలు నేరస్థలంలో లభించిన భౌతిక సాక్ష్యాలు, అనుమానితుల కదలికలతో పకడ్బందీగా ముందుకు సాగింది.  

ఈ వ్యవహారంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతి రెడ్డి అలాగే ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిల పేర్లు ప్రముఖంగా ప్రస్తావనకు వస్తున్నాయి. హత్యకు గురైన తర్వాత  సమాచారం బయటకు పొక్కకుండా వారు వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. వివేకా కుమార్తె వైఎస్ సునీత తన తండ్రి మృతిపై న్యాయం కోరుతూ సాగిస్తున్న సుదీర్ఘ పోరాటానికి పలు రాజకీయ పార్టీల నుంచి మద్దతు లభిస్తోంది.   

ఇక తాజాగా ఈ కేసులో ఏ2గా ఉన్న యాదటి సునీల్ యాదవ్  సంచలన విషయాలను వెల్లడించారు. వివేకా హత్య ద్వారా లబ్ధి పొందిన వారు మాజీ సీఎం వైఎస్ జగన్, ఆయన సతీమణి వైఎస్ భారతి అని కుండబద్దలు కొట్టారు. వైఎస్ వివేకా హత్యకు గురి కాకుండా ఉంటే ఆయన నిస్సందేహంగా కడప ఎంపీ అయి ఉండేవారన్న సునీల్ యాదవ్.. దీనిని బట్టే ఈ హత్య వల్ల లబ్ధి పొందినది ఎవరన్నది సులభంగా అవగతమౌతుందన్నారు.

సోమవారం (సెప్టెంబర్ 28)  ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సునీల్ యాదవ్.. వైఎస్ వివేకా హత్య విషయంలో తెరముందు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డి ఉన్నా తెర వెనుక ఉన్నది కచ్చితంగా వైఎస్ జగన్, వైఎస్ భారతి అని విస్పష్టంగా చెప్పారు. వివేకాను హత్య చేయాల్సిన అవసరం తనకు ఇసుమంతైనా లేదన్న ఆయన.. వివేకా హత్యకు గురికాకుండా ఉండి ఉంటే.. ఆయన తనను యాదవ కార్పొరేషన్ చైర్మన్ ను చేసేవారని సునీల్ యాదవ్ చెప్పారు. 

ఈ సందర్భంగా ఆయన తన ప్రాణానికి ముప్పు ఉందన్న ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ జగన్  నుంచి తనకు ముప్పు ఉందనీ, తనకు రక్షణ కల్పించాలని కోరారు. ఇప్పటికే తనపై మూడు సార్లు హత్య ప్రయత్నం జరిగిందని చెప్పిన సునీల్ యాదవ్.. ఈ కేసులో కీలక సాక్షులు అనుమానాస్పద స్థితిలో మరణించిన సంగతిని గుర్తు చేస్తూ తనకు రక్షణ కల్పించాలని ఏపీ, తెలంగాణ సీఎంలకు విజ్ణప్తి చేశారు. 

[YS Vivekananda Reddy Murder Case, YS Jagan Mohan Reddy, YS Bharathi, YS Avinash Reddy, AP Politics, A2 Sunil Ydaev, Sensational, Reveal, Telugu One]

By
en-us Political News

  
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఆ సమయంలో తాను కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండగా, గ్యానేష్ కుమార్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారిగా సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రయాణ సమయంలో తన రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి  ఆరా తీసిన జ్ణానేష్ కుమార్‌.. ఆ సందర్భంలోనే బీజేపీ తరఫున పతనం తిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు. 
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
ప్పటి వరకూ మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటూ వచ్చిన పారదర్శకత ప్రశ్నార్థకమైంది.  రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయన్న వాదనకు బలం చేకూరింది. అంత వరకూ విపక్షాలు చేసే విమర్శలను సునాయాసంగా తిప్పికొట్టి పై చేయి సాధించిన మోడీ సర్కార్ నీటి విషయంలో సమాధానం చెప్పుకోలేక తడబడింది. వెనకడుగు వేసింది. 
ఎంతటి సంక్షోభాన్నైనా సంయమనం కోల్పోకుండా అధిగమించడం, ఆ సంక్షోభాన్నే అవకాశంగా మలచుకుని ముందుకు సాగడం ఆయన నైజం. ఎంతటి క్షిష్టమైన సమస్యనైనా  పరిష్కరించగలిగే నేర్పు, ఎంతటి సంక్షోభాన్నైనా తట్టుకునిముందుకు సాగే సామర్ధ్యం కారణంగానే ఆయనకు పొలిటికల్ సర్కిల్స్ లొ  క్రైసిస్ మ్యాన్ అన్న గుర్తింపు వచ్చింది. 
వ్యవసాయ రంగానికి పెద్దపీఠ వేసేలా చంద్రబాబు  35 వేలకోట్ల రూపాయల అంచనాతో  సాగునీటి రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 36 సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా..  దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో  ఇరిగేషన్ అండ్ వాటర్ క్యాలెండర్ ను అందుబాటులోకి తెచ్చారు.
ఎన్నికలు రిగ్గింగ్ అవుతున్నాయని తెలిసినా, ప్రతిపక్షాలు మళ్లీ అవే ఎన్నికల్లో పాల్గొంటూ ఆ పద్ధతికి చట్టబద్ధత ఎందుకు కల్పిస్తున్నాయని ప్రశ్నించి సంచలనం సృష్టించారు.  ఓట్లు చోరీకి గురవుతున్నా, ఎమ్మెల్యేలు, ఎంపీలు కొనుగోలుకు గురవుతున్నా, పార్టీలు చీలిపోతున్నా కేవలం ఉనికి కోసమే పోరాడుతున్నారా అని నిలదీశారు.
వైసీపీకి చెందిన పలువురు నాయకులు జనసేన పార్టీలో చేరారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో   నైతికత, విలువలు పలుచన అయిపోతున్నాయి.   ఏ పార్టీ నుంచి గెలిచామనే అంశంతో సంబంధం లేకుండా, వ్యక్తిగత ప్రయోజనాలు, అధికార కాంక్ష,  రాజకీయ లబ్ధికి మాత్రమే పెద్ద పీట వేస్తున్న నేతలే ఎక్కువగా కనిపిస్తున్నారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.