వైసీపీలో విస్త‘రణం’.. అధినేత‌పై ధిక్క‌ర‌ణం!

Publish Date:Apr 15, 2022

Advertisement

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంత కాలం  ఏదైతే తన బలం అని చెప్పుకుంటూ  వచ్చిందో  అదే పెద్ద బలహీనత అని ఇటీవలి మంత్రి వర్గ విస్తరణ తేటతెల్లం చేసేసింది.  ఇంకెంత  మాత్రం  ఆ  పార్టీ  తన బలం గురించీ.. 151 మంది సభ్యుల బలగం గురించీ జబ్బలు చరుచుకునే అవకాశం లేదు.  పార్టీలో ఐక్యత అన్నది మంత్రి వర్గ  విస్తరణతో నీటి బుడగలా పేలిపోయింది. ఇంత కాలం జగన్ మాటే శిలా శాసనంగా అనుకుంటూ వచ్చిన వారందరికీ అది భ్రమే అని విస్తరణ అనంతర పరిణామాలు తేటతెల్లం చేసేశాయి. రాజుగారి దేవతా వస్త్రాల భ్రమలు పటాపంచలు చేసేశాయి. అసలింతకీ పార్టీలో ఒక్కసారిగా అసమ్మతి భగ్గుమనడానికి కారణం ఏమిటి? విస్తరణలో పదవులు దక్కకపోవడమేనా?.. లేదా పదవి ఊడిపోవడమేనా? పార్టీలో రగులుతున్న అసంతృప్తి జ్వాలలను గమనిస్తే.. అదొక్కటే కారణం కాదని తేలుతుంది. అధినేత జగన్ విశ్వసనీయత మసకబారడం కూడా ఒక కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

పార్టీలో అధినేతకు సన్నిహితులుగా పేరుపడ్డ వారు సైతం అసంతృప్తితో రగిలిపోతుండడానికి కారణం ఏమిటి? ఒక్క సారిగా పార్టీ అత్యంత  బలహీనంగా మారిపోయిందని అనిపించే పరిస్థితి ఎందుకొచ్చింది. పార్టీ వర్గాలయితే ఇందుకు అధినేత జగన్  దే పూర్తి బాధ్యత అనీ, ఈ పరిస్థితికి ఆయనే కారణమనీ అంతర్గత సంభాషణల్లో కుండ బద్దలు కొట్టేస్తున్నారు. 2019లో సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం చెప్పినట్లుగా రెండున్నరేళ్ల తరువాత  కేబినెట్ సహచరులందరినీ మార్చి కొత్త టీంను ఎన్నుకున్నట్లైతే పార్టీలో ఇంతటి స్థాయిలో అసంతృప్తి జ్వాలలు ఎగసిపడేవి కావని అంటున్నారు. 

అయితే ఈ మూడేళ్లుగా జగన్ తన కేబినెట్ సహచరుల పనితీరును ఎసెస్ చేసినట్లు ఎక్కడా కనిపించదు. వారు తమ శాఖపై పట్టు సాధించే అవకాశమూ  ఇవ్వలేదు. అసలు వారికి పని చేసే అవకాశమే లేకుండా చేశారు. ఆమాత్య పదవి కేవలం అలంకారమన్న చందంగా వారి పదవీయోగం సాగింది. ఈ  విషయాన్ని అంతర్గత సంభాషణల్లో పలువురు మంత్రులు అంగీకరించిన దాఖలాలు ఉన్నాయి.  ఏప్పుడో తప్ప మంత్రులకు తమ శాఖలకు సంబంధించి  విలేకరుల సమావేశాల్లో మాట్లాడే అవకాశమేరాలేదు. అంతా రాజకీయ సలహాదారు సజ్జలే కానిచ్చేసేవారు. ఇక వివిధ శాఖలకు సంబంధించిన  సమీక్షల వ్యవహారమంతా జగన్ స్వయంగా చేసేవారు. ఆయా సమీక్షా సమావేశాల్లో ఆయా శాఖల మంత్రుల పాత్ర ఉత్సవ విగ్రహాల కంటే కొంచం తక్కువే. 

దీంతో  కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో పదవులు కోల్పోయిన వారు అసలేం చేయనిచ్చారని, పని చేయలేదంటూ తప్పించారు? ఉన్న వాళ్లేం చేశారని పని తీరు బాగుందంటూ కొనసాగించారంటూ నిలదీస్తున్నారు. ఇక కొద్దో గొప్పో విలేకరుల సమావేశాల్లో విపక్షనేతనూ, విపక్ష నేత తనయుడినీ విమర్శల పేరు చెప్పి దూషణల పర్వానికి తెరలేపుతూ నిత్యం వార్తల్లో ఉన్న కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్,  కురసాల కన్నబాబు.. అలాగే ఉన్నంతలో  ప్రభుత్వ విధానాలకు మీడియాకు తెలియజేస్తూ వచ్చిన పేర్ని నానీ వంటి వారికీ పునర్వ్యవస్థీకరణలో వేటు పడింది. 

దీనిని బట్టి చూస్తేనే.. ఏలాంటి హేతు బద్ధతా లేకుండానే పనర్వ్యవస్థీకరణ తంతును జరిపించారని  భావించాల్సి వస్తున్నది. ఆ కారణంగానే ఉద్వాసనకు గురైన వారిలోనే.. ఆశించి భంగపడిన వారిలోనూ ఒక్కసారిగా ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. ధిక్కార స్వరం  సౌండ్ పెరిగింది. ఆ  సీరియస్ నెస్ ను ఆలస్యంగా గమనించిన పార్టీ అధినేత చేతులు కాలితేనేం.. ఆకులుపట్టుకుని నష్ట నివారణ చేద్దాం అన్న చందంగా చివరి నిముషం వరకూ కేబినెట్ సభ్యుల జాబితాలో మార్పులూ, చేర్పులూ చేస్తున్నట్లుగా బిల్డప్ ఇచ్చే ప్రయత్నాలు చేశారు. ఏం చేసినా జరగాల్సిన నష్టం జరగిపోయంది. బుజ్జగింపుల అనంతరం అసంతృప్తి చల్లారిందని ఎంతగా చెప్పుకుంటున్నా.. అదంతా నివురుగప్పిన నిప్పుచందమే.

By
en-us Political News

  
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.