మంత్రి ఈశ్వరప్ప రాజీనామా.. ఎన్నికల ముందు ఎదురుదెబ్బ..

Publish Date:Apr 15, 2022

Advertisement

మరో సంవత్సర కాలంలో అసెంబ్లీ ఎన్నికలకు వెళుతున్న కర్ణాటకలో, అధికార బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్న కర్ణాటక పచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి కెఎస్ ఈశ్వరప్ప, వత్తిళ్లకు తలొగ్గి,మంత్రి పదవికి రాజీనామా చేశారు. నిజానికి, నిన్న మొన్నటి దాకా, హిజాబ్, హలాల్ చుట్టూ తిరిగిన  రాష్ట్ర రాజకీయం, గత నలుగు రోజులుగా, బీజేపీ ప్రభుత్వం అవినీతి చుట్టూ తిరుగుతోంది. కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఆత్మహత్యతో వెలుగులోకి వచ్చిన, రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివ్రుద్ది శాఖ మంత్రి కెఎస్ ఈశ్వరప్ప అవినీతి భాగోతం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. కొద్దిరోజుల క్రితం మంత్రి ఈశ్వరప్ప బిల్లుల చెల్లింపుకు 40 శాతం కమిషన్ డిమాండ్ చేస్తున్నారని ఆరోపించిన కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఉడిపీలోని ఓ హోటల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నారు. 

కాంట్రాక్టర్ ఆత్మహత్యకు సంబంధించి పోలీసు కేసు నమోదైంది. ప్రథమ సమాచార నివేదిక ప్ర‌కారం మంత్రి ఒత్తిడి కార‌ణంగా కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. గ్రామీణాభివృద్ధి,పంచాయత్ రాజ్ శాఖలో చేసిన రూ. 4 కోట్ల విలువైన పనులకు బిల్లును క్లియర్ చేయడానికి మంత్రి సహచరులు 40 శాతం కమీషన్ డిమాండ్ చేశారని పాటిల్ ఆరోపించారు. తన మరణానికి ఈశ్వరప్పే కారణమని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. సూసైడ్ నోట్‌లో అదారంగా పోలీసుల ఆయన ఫై కేసు నమోదు చేశారు. దీంతో దుమారం చెలరేగింది. కాంగ్రెస్ పార్టీ, ఈశ్వరప్ప రాజేనామా చేయాలని, ఆయన మీద హత్యా నేరం కింద కేసు పెట్టి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తోంది. పీసీసీ చీఫ్, డికే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య  నాయకత్వంలో కాంగ్రెస్ ప్రతినిధి బృందం గవర్నర్’ ను కలిసి వినతి పత్రం అందజేసింది. 

అయితే ఈశ్వరప్ప మాత్రం చివరి వరకు రాజీనామా చేసే సవాలే లేదంటువచ్చారు. సూసైడ్ నోట్’ బోగస్ అని కొట్టివేశారు. వాట్సాప్’లో సంతకలేకుండా వచ్చిన బోగస్ సూసైడ్ నోట్ ఆధారంగా, చేసే ఆరోపణలకు విలువలేదని అన్నారు.కానీ, ఆత్మహత్యచేసుకున్న కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఆత్యక్రియల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడంతో రాజీనామ చేస్తున్నట్లు ప్రకటించారు. 

అంతకు ముందు ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మే, కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఆత్మహత్యకు సంబంధించి ప్రాధమిక విచారణ పూర్తయ్యే వరకు, మంత్రి ఈశ్వరప్పపై ఎలాంటి చర్య తీసుకునేది లేదని స్పష్టం చేశారు. మరోవంక  బీజీపే అధిష్టానం ఈశ్వరప్ప పై వేటు వేసే విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తోంది. వేటు వేస్తే ఏమిటి? వేయకపొతే ఏమిటి? అని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. కాగా,ఈ మొత్తం వ్యవహారం, బీజీపీ సీనియర్ నాయుడు,మజీ ముఖ్యమంత్రి యడియూరప్ప కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వంలో నడుస్తోందని, బీజేపీలోని ఒక వర్గం ఆరోపిస్తోంది.  

అదలా ఉంటే, కర్ణాటక ప్రభుత్వంలో ఒక్క పంచాయతీ రాజ్ శాఖలోనే, కాదు, అన్ని శాఖల్లో అవినీతి రాజ్యమేలుతోందని, కర్ణాటక కాంట్రాక్టర్స్ అసోసియేషన్, అధ్యక్షుడు కెంపెన్న బాంబు పేల్చారు. బిల్లులు క్లియర్ చేసుకునేందుకు, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు 15నుంచి 40 శాతం కమిషన్ డిమాండ్ చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. మరో వరం రోజుల్లో, బీజేపే ప్రభుత్వ అవినీతి చిత్త మొత్తం విప్పుతానని, అయన చెప్పుకొచ్చారు.  అంతేకాదు,ఇందుకు సంబందించి తమ అసోసియేషన్ ప్రధాని కార్యాలయానికి కూడ ఫిర్యదు చేసిందని, అయినా అటు నుంచి సమాధానం లేదని ఆయన అన్నారు. అయితే కెంపెన్న ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మె’కు మాత్రం క్లీన్ చిట్ ఇచ్చారు. కానీ, ముఖ్యమంత్రిని కలిసేందుకు చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదని, అయినా సంతోష్ పాటిల్ ఆత్మహత్య బీజేపీకి కనువిప్పు కావాలని అన్నారు.

అదలా ఉంటే, మాజీ ముఖ్యమత్రి యడియూరప్ప, కావాలని మంత్రి ఈశ్వరప్పను బద్నాం చేసేందుకు, పార్టీలో తమ ప్రాబల్యం పెంచుకునేందుకు, కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్’ను బలిపశువుని చేశారని, మాజీ మంత్రి రమేష్ జార్కిహోలి ఆరోపించారు. అయితే, చివరకు మాత్రి ఈశ్వరప్ప రాజీనామా చేయక తప్పలేదు. అయితే ఈ ఎపిసోడ్ ప్రధానంగా బీజేపీలో అంతర్గతకుమ్ములాటలు , మరీ ముఖ్యంగా యడ్డీ ఫాక్టర్ ఎఫెక్ట్’కు అద్దం పట్టిందని, అదే విధంగా  బీజేపీ అవినీతి భాగోతం బయటకు వచ్చిందని పరిశీలకులు అంటున్నారు.

By
en-us Political News

  
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.