Publish Date:Apr 15, 2022
నెల్లూరు కోర్టులో దొంగలు పడ్డారు. మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి సంబంధించిన కీలక కేసు పత్రాలు అపహరించారు. విషయాన్ని గుర్తించిన కోర్టు సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగు చూసింది. ఈ కేసుకు సంబంధించిన పత్రాలు, స్టాంపులు, ఇతర పరికరాలున్న సంచి అపహరణకు గురైనట్లు కోర్టు బెంచి క్లర్కు స్థానిక చిన్నబజారు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నెల్లూరు కోర్టు సముదాయంలోని 4వ అదనపు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో ఈ కీలక కేసులో పత్రాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకుపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే, ప్రస్తుత వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి 2017లో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై పలు విమర్శలు చేశారు. సోమిరెడ్డికి విదేశాల్లో కోట్లాది రూపాయల విలువైన ఆస్తులున్నాయని ఆరోపించారు. అందుకు రుజువులుగా వివిధ పత్రాలు చూపించి, హవాలాకు పాల్పడ్డారని ఆరోపించారు. తప్పుడు పత్రాలు చూపించి తనపై బురద జల్లుతున్నారంటూ కాకాణి గోవర్ధన్ రెడ్డితో పాటు మరికొందరిపైన సోమిరెడ్డి నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కాకాణిపై పరువునష్టం దావా కూడా దాఖలు చేశారు. ఈ కేసు 1వ అదనపు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో విచారణలో ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి, కాకాణి బయటపెట్టిన పత్రాలు నకిలీవని గుర్తించి చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో కాకాణి గోవర్ధన్ రెడ్డిని ఏ 1గా, చిత్తూరు జిల్లాకు చెందిన పసుపులేటి చిరంజీవి అలియాస్ మణిమోహన్ ను ఏ 2గా పేర్కొన్నారు.
కోర్టు తాళాలు పగలగొట్టి ఎత్తుకెళ్లిన వాటిలో కొన్ని డాక్యుమెంట్లు కోర్టు ప్రాంగణంలోనే పడేశారు. పోలీసులు ఆ పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. వాటిని కాకాణి గోవర్ధన్ రెడ్డిపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గతంలో పెట్టిన ఫోర్జరీ కేసుకు సంబంధించిన పత్రాలుగా గుర్తించారు. ప్రస్తుతం పోలీసులకు లభ్యమైన పత్రాలు చిరంజీవికి చెందినవని గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ చోరీ విషయం కోర్టుతో పాటు కీలక కేసుతో సంబంధం ఉండటంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
కాగా.. కాకాణి మంత్రి అయి నెల్లూరు జిల్లాకు వచ్చే ముందు ఇలా జరగడంతో పలు అనుమానాలకు దారి తీసింది. కాకాణిని రాజకీయంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఎవరైనా చేయించారా అనే అనుమానాలు లేకపోలేదు. మాజీమంత్రి అనిల్‌కుమార్ పైనే డౌట్ వ్యక్తం చేస్తున్నారు. ఆయనే ఇలా చేయించి ఉంటారని ఆరోపిస్తున్నారు. కావాలనే కాకాణిని ఇరికించాలనే కోర్టులో దొంగతనం జరిగిందని అంటున్నారు. ఈ సమయంలో కాకాణి కావాలని ఇలాంటి పని చేయిస్తారా అనే సందేహం వ్యక్తం అవుతోంది. ఏదేమైనా పోలీసుల విచారణలో పూర్తి నిజాలు తెలియాలి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kakani-files-theft-in-nellore-court-39-134427.html
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద, పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.