దేశాన్ని ఏలతామన్న కేసీఆర్..మౌనమేలనోయీ?

Publish Date:Jul 23, 2023

Advertisement

దేశ పరిస్థితులు చూసిన తర్వాత మార్పు కోసం ఇక కొట్లాడాల్సిందేనని నిర్ణయించుకున్నా.. 75 ఏండ్ల స్వాతంత్య దేశంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి.. ఎందరో నేతలు ఎన్నో మాటలు చెప్పారు.. కానీ మార్పు లేదు.. అందుకే దేశంలో భారీ మార్పు తేవాల్సిన అవసరం ఉందని నిర్ణయించుకున్నా.. ఎన్నాళ్లో ఎదురు చూశాం ఎవరైనా వస్తారేమోనని.. కానీ రాలే. ఇక ఇప్పుడు సమయం వచ్చింది.. అందుకే నేను వచ్చా.. ఎన్నికల్లో గెలవాల్సింది నేతలు కాదు.. ప్రజలు. ప్రజలను గెలిపించాలనే టీఆర్ఎస్ ను.. బీఆర్ఎస్ గా మార్చా. ఇదీ మహారాష్ట్ర నాందేడ్ లో నిర్వహించిన బీఆర్ఎస్ తొలి సభలో   తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాట్లాడిన మాటలు.

ఒక్క మాటలో చెప్పాలంటే.. ఇన్నాళ్లు దేశాన్ని పాలించిన వాళ్లంతా చేతగాని వాళ్ళు, వాళ్ళు చెప్పినవన్నీ ఫాల్తూ మాటలే.. మాయ చేసి మతలబు చేసి ప్రజలను పీడించుకు తింటున్నారు.. అందుకే తెలంగాణ మాదిరి దేశాన్ని కూడా సస్యశ్యామలం చేయాలనే తాను జాతీయ రాజకీయాలలోకి అడుగుపెట్టాను. కేసీఆర్ నాందేడ్ సభలో నాడు మాట్లాడిన మాటల సారాంశమిదే.  దీని కోసం దేశమంతా కాళ్లకు చక్రాలు కట్టుకొని తిరుగుతానని.. దేశంలో అన్ని పార్టీల‌నూ ఏకం చేస్తాన‌ని.. తద్వారా జాతీయ‌ రాజకీయాలలో చ‌క్రం తిప్పుతాన‌ని సీఎం, అందుకే నడుంబిగించాననీ కేసీఆర్‌ చెప్పారు.

చెప్పినట్లే ఒకసారి క‌ర్ణాట‌క‌, మరోసారి త‌మిళ‌నాడు, ఇంకోసారి బిహార్‌, యూపీ వంటి రాష్ట్రాల‌కు వెళ్లి.. అక్క‌డి ప్రాంతీయ పార్టీల‌తో చ‌ర్చ‌లు జ‌రిపి.. వారితో చేతులు క‌లిపి అందరినీ ఏకం చేస్తున్నానని సిగ్నల్స్ ఇచ్చారు. ఎక్కడకి వెళ్లినా ప్ర‌ధాని మోడీపై ఒంటికాలిపై లేచిన కేసీఆర్.. అప్పుడప్పుడూ కాంగ్రెస్ మీద కూడా కారాలూ మిరియాలూ నూరుతూ వచ్చారు. దేశ జీడీపీ నుంచి చైనా ఆగ‌డాల వ‌ర‌కు.. అభివృద్ధి నుంచి అప్పుల వ‌ర‌కు బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలపై తీవ్రంగా విమర్శలు చేశారు. అసలు మనల్ని పాలించేందుకు వీళ్ళెవరూ.. వాళ్ళెవరూ.. మనల్ని మనమే పాలించుకుందాం.. బీజేపీ, కాంగ్రెస్ లేని భారత ప్రభుత్వాన్ని నిర్మిద్దామని మైకులు పగిలేలా ప్రసంగాలు చేశారు.  సీన్ కట్ చేస్తే.. ఇప్పుడు బీజేపీ ఆధ్వర్యంలో ఎన్డీయే, కాంగ్రెస్ ఆధ్వర్యంలో  ‘ఇండియా’ ఏర్పాటయ్యాయి. 28 రాజకీయాల పార్టీలతో ఇండియా, 36 రాజకీయ పార్టీలతో ఎన్డీయే సమావేశాలు కూడా జరిగిపోయాయి. ఈ రెండు గ్రూపులలోనే కేసీఆర్ కలిసి వచ్చిన పార్టీలు కూడా ఉన్నాయి. ఈ రెండు కూటములు పోగా దేశవ్యాప్తంగా మిగిలింది ఏడెనిమిది పార్టీలు మాత్రమే. ఇందులో కూడా కొన్ని ఎన్నికల నాటికి ఏదో ఒక కూటమికి చేరనున్నాయి. అలా మొత్తంగా చూస్తే కేసీఆర్ ఒంటరైపోయారు.

దీంతో దేశాన్ని ఏలతానన్న నోరు   అసలు పెగలడం లేదు. మోడీని గద్దె దించుతానన్న శపథం   కాళేశ్వరంలో కలిపేశారా అన్న అనుమానాలు సొంత పార్టీ శ్రేణుల నుంచే వ్యక్తమౌతున్నాయి. దేశంలో మార్పు సంగతెలా ఉన్నా.. రాష్ట్రంలో రోజురోజుకీ బలీయంగా మారుతున్న కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు మారకుండా చూసుకోవడమే ఇప్పుడు కేసీఆర్ వంతైంది. 

దేశాన్ని ఏలతానని బయల్దేరిన కేసీఆర్ ఇప్పుడు అసలు దేశంలో జరిగే వాటిని కూడా పట్టించుకోవడం మానేసినట్లుగా కనిపిస్తుంది. మ‌ణిపూర్ వంటి చిన్న రాష్ట్రం త‌గ‌ల‌బ‌డిపోతున్నదని, గిరిజ‌నుల‌పై దారుణ మార‌ణాలు జ‌రుగుతున్నాయ‌ని దేశం మొత్తం గ‌గ్గోలు పెడుతున్నా.. కేసీఆర్ ఎక్క‌డా స్పందించలేదు. దేశంలో రాజకీయంగా ఇంత జరుగుతున్నా కేసీఆర్ ఎక్కడా పెదవి విప్పడం లేదు. నిన్నగాక మొన్న మహారాష్ట్రకి భారీ కాన్వాయ్ తో వెళ్లిన కేసీఆర్, ఆ తర్వాత మరే ఇతర రాష్ట్రం గురించి మాట్లాడడం లేదు. పొరుగున తెలుగు రాష్ట్రమైన ఏపీలో పాగా వేస్తామని పలికిన ప్రగల్భాలు ఇప్పుడు మొత్తానికి మర్చేపోయినట్లు ఉన్నారు.  

By
en-us Political News

  
జమ్మూకశ్మీర్‌‌లోని కతువా జిల్లాలో అత్యంత విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది.
హైదరాబాద్‌ నగరంలోని నిమ్స్‌ అదనపు మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నోరి లక్ష్మీ భాస్కర్‌పై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దర్యాప్తును ముమ్మరం చేసింది.
హైదరాబాద్‌లోని టెక్ హబ్ మాదాపూర్‌లో జరిగిన ఒక సంచలన ఘటన కలకలం రేపింది.
దేశవ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక కీలక ప్రకటన చేసింది
డేటింగ్ యాప్ ద్వారా పరిచయం.. పబ్‌కు తీసుకెళ్లి రూ.29 వేల బిల్లు.!
హైదరాబాద్ నగరంలోని ఎస్‌ఆర్‌ నగర్ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపిన ఒక విషాదకర ఘటనలో యువతి ప్రాణాలు కోల్పోయింది.
అరుణాచల్ ప్రదేశ్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేసేందుకు కొలీజియం కీలక నిర్ణయం తీసుకుంది.
సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రి ప్రాంగణంలో ఓ మానసిక రోగి హల్‌చల్‌ చేయడంతో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
దేశ రాజకీయాల్లో ప్రాంతీయ అసమానతలు, ఉత్తరాది ప్రాబల్యంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి తన గళాన్ని గట్టిగా వినిపించారు.
జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత యువ షూటర్, తెలంగాణ ముద్దుబిడ్డ ఈషా సింగ్ అద్భుత ప్రతిభ కనబరిచారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.