హమ్మయ్య అప్పులకు ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్.. తెలంగాణకు ఊరట
Publish Date:Jun 3, 2022
Advertisement
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని దిక్కు తోచక అల్లాడుతున్న తెలంగాణకు ఆర్బీఐ తీపి కబురు చెప్పింది. బాండ్ల విక్రయాల ద్వారా నాలు వేల కోట్ల రూపాయల రుణ సమీకరణకు ఆర్బీఐ ఆమోదముద్ర వేసింది. రాష్ట్రాభివృద్ధి రుణాలకు అనుమతిస్తూనే ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం పరిధికి లోబడే రుణ సమీకరణ చేసుకోవాలని ఆర్బీఐ షరతు విధించింది. ఇలాంటి అనుమతులనే ఏపీకి మహారాష్ట్రకు తమిళనాడుకు కూడా ఇచ్చింది. తెలంగాణకు 13ఏళ్ల కాలపరిమితితో రూ.4 వేల కోట్ల రుణాల సమీకరణకు ఆమోదం తెలిపింది. జూన్ 7న ఉదయం 10.30గంటల నుంచి 11.30గంటల మధ్య బాండ్ల వేలం నిర్వహించి రూ.4 వేల కోట్ల నిధుల సమీకరణకు తెలంగాణకు ఆర్బీఐ షెడ్యూల్ జారీ చేసింది. ఏ రాష్ట్రమైనా తన జీఎస్‌డీపీలో 35శాతం మేర అప్పు తీసుకునేందుకు వీలుంది. ఆ మేరకు 42,728 కోట్ల అప్పులకు అవకాశం ఉంది. అయితే అయితే వివిధ ప్రభుత్వరంగ సంస్థల కార్యకలాపాలకు గతంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న రూ.లక్షా 30 వేల కోట్ల అప్పులను రాష్ట్ర ప్రభుత్వ అప్పులుగానే పరిగణిస్తామని కేంద్రం షరతు విధించింది. దీంతో 17 కార్పొరేషన్లకు చెందిన ఆదాయ వ్యయాలు, వాటి అప్పుల వివరాలను కేంద్రానికి తెలంగాణ సమర్పించింది. వీటి చెల్లింపులను రాష్ట్ర బడ్జెట్ నుంచే నిధులు కేటాయిస్తున్న నేపథ్యంలో వాటిని రాష్ట్ర అప్పులగానే కేంద్రం పేర్కొని గడచిన రెండు నెలల రుణ సేకరణను ఆర్బీఐ నిలిపివేసిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో సర్కార్ ముమ్మరంగా కేంద్రంతో సంప్రదింపులు జరిపి రుణ సేకరణ, ప్రస్తుత అవసరాలు, ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం, తెలంగాణ జీఎస్‌డీపీ వంటి అంశాలను వెల్లడించడంతో తెలంగాణ సర్కార్‌పై రుణసమీకరణ ఆంక్షలను తాత్కాలికంగా ఉపసంహరించుకుంది.ఆర్బీఐ తాజా నిర్ణయంతో తెలంగాణ సర్కార్‌కు కొండంత ఊరట లభించినట్లైంది.
http://www.teluguone.com/news/content/rbi-allows-telangana-to-take-loabs-through-bands-auxtion-25-136997.html





