హిందూ ముస్లిం భాయ్ భాయ్.. మోహన్ భగవత్ నోట మత సామరస్యం మాట

Publish Date:Jun 3, 2022

Advertisement

ఓడలు బళ్లు అవుతాయి, బళ్లు ఓడలవుతాయి అన్నది నానుడి.  ఇప్పుడు ఆర్ఎస్ఎస్ లో కనిపిస్తున్న పరివర్తన లేదా మార్పు సరిగ్గా అలాంటిదేనని చెప్పవచ్చు. ఆర్ఎస్ఎస్ అంటే ఆర్ఎస్ఎస్ అంటే ఒకప్పుడు హిందూ మతోన్మాదాన్ని రెచ్చగొడుతుందని, దేశంలో మత సామరస్యానికి భగం కలిగించేలా హిందువులను రెచ్చగొట్టేలా ప్రసంగాలూ, కార్యక్రమాలు చేస్తుంటారని భావించే వారు.

కానీ తాజాగా మోహన్ భగవ్ మాటలు వింటే.. ఆర్ఎస్ఎస్   దేశంలో మత సామరస్యం కోరుకుంటోందనీ, హిందూ ముస్లిం భాయ్ భాయ్ అన్న నినాదాన్ని భుజానికెత్తుకుంటోందనీ అవగతమౌతుంది. ఆలస్యంగానైనా సరే జ్ణానోదయం అయితే మంచిదే. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ లోబాబ్రీమసీదు విషయంలో తమ ఆందోళన ప్రజాభీష్టం మేరకేనని చెబుతూనే.. దేశంలో అన్ని మసీదులనూ వ్యతిరేకిస్తూ ఉద్యమం చేయడానికి సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. మసీదుల్లో జరిగేదీ ప్రార్థనేనని, శివలింగం కోసం మసీదుల్లో అన్వేషించడానికి ఆర్ఎస్ ఎస్ వ్యతిరేకమనీ అన్నారు. అయినా చరిత్రను మార్చడానికి మనమెవరం అని కూడా అన్నారు. గత ఎనిమిదేళ్ల బీజేపీ పాలనలో పెచ్చరిల్లిన విద్వేషభావం దేశంలో సామరస్యాన్ని దెబ్బతీస్తుందని ప్రజాస్వామిక వాదులు ఆందోళన చెందుతున్న సమయంలో బీజేపీకి సైద్ధాంతిక పునాది వంటి ఆర్ఎస్ఎస్ లో ఇటువంటి పరివర్తన కచ్చితంగా ఆహ్వానించదగ్గదే.

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మసీదులను తవ్వుదాం అంటూ చేసిన వ్యాఖ్యలను నేరుగా ఖండించకపోయినా..ప్రతి మసీదులోనూ శివలింగాన్ని వెతకాల్సిన అవసరమేమిటన్న మోహన్ భగవత్ ప్రశ్న బండి సంజయ్ వ్యాఖ్యలకు కౌంటర్ గానే పరిగణించాల్సి ఉంటుంది. రాజకీయ పబ్బం కోసం పార్టీల నేతలు దేశంలో విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యవహరించడం తగదన్న హెచ్చరికలాంటి సూచనా మోహన్ భగవత్ మాటల్లో ఉంది.  పక్కా రాజకీయం కోసం బీజేపీ వెంపర్లాడుతుంటే. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా విద్వేష పూరిత ప్రసంగాలతో రెచ్చిపోతున్న బండి సంజయ్ కు ఆర్ఎస్ఎస్ చీఫ్ వ్యాఖ్యలు చెంపపెట్టు లాంటివనడంలో సందేహం లేదు.  

రాష్ట్రంలోని మసీదులన్నిటినీ తవ్వుదా.. శివలింగాలు మాకు, శవాలు దొరికితే మీకు అంటూ ముస్లింలను ఉద్దేశించి బండి చేసిన వ్యాఖ్యలకు  మోహన్ భగవత్ గట్టి కౌంటర్ ఇచ్చినట్లైంది.   నాగపూర్ లో జరిగిన ఆర్ఎస్ఎస్ శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమంలో మాట్లాడిన ఆయన నేరుగా బండి పేరును, బండి వ్యాఖ్యలను ప్రస్తావించకపోయినా జ్ణానవాపి మసీదు వివాదంపై స్పందిస్తూ దేశంలోని ప్రతి మసీదులోనూ శివలింగం కోసం వెతకాల్సిన పనేమిటని ప్రశ్నించారు. జ్ణానవాపి  మసీదు వివాదంలో విశ్వాసాలకు సంబంధించిన అంశాలపై కోర్టు నిర్ణయానికే వదిలేయాలన్నారు.

ఎక్కడో ఒక మసీదులో శివలింగం ఉందని అన్ని మసీదుల్లోనూ ఎందుకు వెతకాలి? దీని కోసం మరో ఉద్యమం చేపట్టేందుకు ఆర్ఎస్ఎస్ రెడీగా లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశంలో హిందువులు కానీ ముస్లింలు కానీ ఆ వివాదాన్ని సృష్టించలేదని, ఆహ్వానించలేదనీ  జ్ణానవాపి మసీదులో శివలింగం లభ్యం కావడంపై మోహన్ భగవత్ అన్నారు. జ్ణానవాపి కోసం మరో ఉద్యమానికి ఆర్ఎస్ఎస్ వ్యతిరేకమన్నారు. అయోధ్య విషయం వేరనీ, అక్కడ రామమందిరం ప్రజాభీష్టం కనుక అందుకోసం ఉద్యమించామన్నారు. జ్ణానవాపి మసీదు విషయంలో ప్రజలు ఆందోళనలు, ఉద్యమాలూ కోరుకోవడం లేదని మోహన్ భగవత్ అన్నారు.హిందూ ముస్లిం భాయ్ భాయ్ అన్నదే తమ సిద్ధాంతమంటూ.. నేటి ముస్లింల పూర్వీకులు హిందువులేననీ, మసీదుల్లో జరిగేవి కూడా ప్రార్ధనలేని మోహన్ భగవత్ అన్నారు.

By
en-us Political News

  
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
G.D. Naidu, known as the “Edison of India,” was an Indian inventor, industrialist and pioneer of innovation. This article explores his remarkable life, curiosity, self-learning, experimentation and practical approach to technology, and the lessons his journey offers to Millennials, Gen Z and Gen Alpha.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
G.D. Naidu జీవితంలో నుంచి Millennials, Gen Z, Gen Alpha నేటి తరాలు ఏం నేర్చుకోవాలి? ఆయన Curiosity, Self-Learning, Innovation, Technology, Learning by Doing, Experimentation మరియు India కోసం కొత్తగా ఆలోచించే విధానం గురించి తెలుసుకోవడానికి ఈ కథనం చదవండి.
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.