పిలిచిన పేరంటానికే రానివ్వలేదు

Publish Date:May 6, 2023

Advertisement

బీఆర్ఎస్ ప్రభుత్వం సచివాలయంలో తమకు నచ్చని వారికి  ఎంట్రీ ఇవ్వదల్చుకోలేదా? మొన్న ప్రారంభోత్సవంలో   తెలుగు మీడియాను గేట్ బయటకు గెంటేసిన కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వాళ ప్రజాస్వామ్య వ్యవస్థలో మరో పిల్లర్ ను అవమానించింది. బీఆర్ఎస్ మంత్రివర్గంలో కీలకంగా వ్యవహరిస్తున్న తలసాని ఆహ్వానం మేరకు సచివాలయానికి వచ్చిన  ఎమ్మెల్యే రాజాసింగ్ ను గేట్ బయటే ఆపేసి అవమానించింది  బీఆర్ఎస్ ప్రభుత్వం. 
తెలంగాణ ప్రభుత్వం భారీ ఖర్చుతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన నూతన సచివాలయంలో సామాన్యులతో పాటు ప్రజా ప్రతినిధులకు కూడా ఎంట్రీ లేదన్న విమర్శలు పెరిగిపోతున్నాయి. కొన్ని రోజుల కిందట ఎంపీ రేవంత్ రెడ్డిని సచివాలయంలోకి వెళ్లకుండా పోలీసులు మార్గమధ్యంలోనే అడ్డుకున్నారు. తాజాగా బీజేపీ బహిష్కృత నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ కు అలాంటి చేదు అనుభవమే ఎదురైంది. 

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో సచివాలయంలో గ్రేటర్ ప్రజాప్రతినిధులతో శనివారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే రాజాసింగ్‌కు కూడా ఆహ్వానం పంపారు. బుల్లెట్ పై వచ్చిన రాజా సింగ్ ను భద్రతా సిబ్బంది లోపలికి అనుమతించలేదు. మీటింగ్‌ అని చెప్పి తనను ఆహ్వానించి, లోపలికి అనుమతించకపోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఎమ్మెల్యేలు కూడా సచివాలయంలోనికి రాకూడదా అంటూ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్దిసేపు అక్కడే వేచి ఉండి, రాజాసింగ్ తిరిగొచ్చేశారు. అయితే, తాము ఆహ్వానం పంపినప్పటికీ రాజాసింగ్ గేటు వరకు వచ్చి వెళ్లిపోయారని మంత్రి తలసాని పేషీ ప్రకటించినట్టు తెలుస్తోంది.విద్వేష ప్రసంగ ఆరోపణపై ఎమ్మెల్యే రాజాసింగ్ ను బీజేపీ బహిష్కరించింది. ఇటీవలె తెలంగాణా బిజేపీ చీఫ్ బండి సంజయ్  ఇటీవలె రాజాసింగ్ కు బర్త్ డే విషెస్ చెప్పారు. అసెంబ్లీ పట్టుమని ఆరు నెలలు కూడా లేవు. రాజాసింగ్ కు బిజేపీ టికెట్ ఇస్తుందో ఇవ్వదో తెలియదు. బిజేపీ నుంచి  సస్పెండ్ అయిన రాజాసింగ్ ను పార్టీ ఆహ్వానించలేదు. రాజాసింగ్ అయోమయంలో పడిపోయారు. తన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ వేసుకుని పార్టీ టికెట్ కోసం టిడిపి తెలంగాణా చీఫ్ కాసాని ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. గోషామహల్ టికెట్ రాజాసింగ్ కే దక్కుతుందని ప్రచారం జరిగింది. అయితే కన్ ఫమ్ కాలేదు.  ఆశావహులు ఎక్కువగానే ఉన్నారు. బీఆర్ఎస్ గోషామహల్ అభ్యర్థి నందకిషోర్ వ్యాస్ పేరు బలంగా వినిపిస్తోంది.  ఇంతలో మంత్రి తలసాని  మీటింగ్ అంటే రాజాసింగ్ అదే బుల్లెట్ మీద సచివాలయానికి వచ్చేశారు. ఏ శక్తులు అడ్డుకున్నాయో రాజాసింగ్ ను సెక్యురిటీ సిబ్బంది ఆపేశారు. రాజాసింగ్  అంటే ఆషామాషీ వ్యక్తి కాదు.  నరేంద్రమోడీతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తి. జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. మరి రాజాసింగ్ పిలిచిన పేరంటానికి వచ్చినప్పటికీ అడ్డుకుని అవమానించారు. ఢిల్లీలో బీఆర్ఎస్  కేంద్ర కార్యాలయ ప్రారంభోత్సవానికి వచ్చిన మీడియాను బీఆర్ ఎస్ అడ్డుకుంది. అసలు వారిని గేట్ లోనికి కూడా రాకుండా అవమానించారు.  నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం. ఆహ్వానాన్నిమన్నించి వచ్చిన ప్రజాప్రతినిధికి వెల్ కమ్ చెప్పడం కూడా సంస్కారం. జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టిన బీఆర్ఎస్ కు సంస్కార క్లాసులు అవసరమేమో మరి. 

 

By
en-us Political News

  
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.