వోటర్ల దగ్గరికే పోలింగ్ కేంద్రం

Publish Date:May 6, 2023

Advertisement

ఎన్నికలు సమీపిస్తుంటే ఆయా ప్రాంతాల్లో ఉన్న రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు వోటర్లను ప్రలోభ పెట్టడానికి పోలింగ్ సెంటర్ల వద్దకు తీసుకెళ్లి వోటు వేయించుకున్న సందర్భాలు అనేకం.  ఇటువంటివి రిపీట్ కాకుండా ఎన్నికల కమిషన్ మరో సంస్కరణ చేపట్టింది. 

ఈ నెల 10వ తేదీన కర్ణాటకలో పోలింగ్ ఉంది. ఈ నేపథ్యంలో ఓటు హక్కు కలిగినవారంతా తప్పనిసరిగా ఓటు వేయడానికి వీలుగా ఎన్నికల కమిషన్‌ చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. భారతదేశం లాంటి ప్రజాస్వామ్య దేశంలో ఇది ప్రశంసనీయ విషయం. వలస కార్మికులతో ప్రతివారూ తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నది ఎన్నికల కమిషన్‌ నియమంగా మారిన నేపథ్యంలో ఈ దిశగా ఇప్పటికే కర్ణాటక ఎన్నికల సందర్భంగా కొన్ని చర్యలు తీసుకోవడం మొదలైంది. సాధారణంగా వృద్ధులు, దివ్యాంగులు పోలింగ్‌ కేంద్రానికి రాలేకపోతున్నప్పుడు వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరుగుతోంది. అయితే, ఇప్పుడు పోలింగ్‌ కేంద్రమే వారున్న ప్రదేశానికి వెళ్లేటట్టుగా ఎన్నికల కమిషన్‌ చర్యలు తీసుకుంటోంది. త్వరలో జరగబోయే కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో ఈ పద్ధతిని ప్రయోగాత్మంగా అమలు చేయాలని ఇది భావిస్తోంది. ఇది నిజంగా వృద్ధులకు, దివ్యాంగులకు ఒక వరం లాంటిదని చెప్పవచ్చు. దేశంలోనే మొట్టమొదటిసారిగా అమలవుతున్న ఈ ప్రక్రియకు ఎన్నికల కమిషన్‌ ‘ఓట్‌ ఫ్రమ్‌ హోమ్‌’ అని పేరుపెట్టింది.
ఈ ఓట్‌ ఫ్రమ్‌ హోమ్‌ పద్ధతికి ఇప్పటికే 99,529 మందిఓటర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇందులో 80,250 మంది (80 ఏళ్లు పైబడినవారు) వృద్ధులు కాగా, 19,279 మంది దివ్యాంగులు. ఈ ఓట్‌ ఫ్రమ్‌ హోమ్‌ ప్రారంభమయి అయిదు రోజులు దాటుతోంది. పేర్లను నమోదు చేసుకోవడంకోసం, ఓటర్ల ఇంటికి పోలింగ్‌ కేంద్రాన్ని చేరవేయడం కోసం 2,542 బృందాలు, 2706 రూట్లలో తిరుగుతుంటాయి. ఎన్నికల కమిషన్‌ అతి చిన్న వివరాలను, సౌకర్యాలను కూడా పరిగణనలోకి తీసుకుంది. ప్రతి బృందంలో ఒక ప్రిసైడింగ్‌ అధికారి, ఒక సహాయకుడు, ఒక సూక్ష్మ పరిశీలకుడు, ఒక కాన్‌స్టేబుల్‌, పోలింగ్‌ ఏజెంట్లు ఉంటారు. అంటే ప్రతి ఓటర్‌కు ఇదొక మినీ పోలింగ్‌ కేంద్రం అన్న మాట. బ్యాలెట్‌ బాక్స్‌లో ఓటరు ఓటు వేసేవరకూ ఈ మొత్తం ఓటింగ్‌ ప్రక్రియను వీడియో రికార్డింగ్‌ చేయడం జరుగుతుంది. దేశానికి స్వాతంత్య్రం రావడం దగ్గర నుంచి ఒక పూర్తి స్థాయి ప్రజాస్వామ్య వ్యవస్థగా ఎదిగే వరకూ చోటు చేసుకున్న ప్రతి పరిణామాన్ని పరిశీలించిన వృద్ధ ఓటర్లు సాధారణంగా ఓటు వేయకుండా ఉండే ప్రసక్తి లేదు. తప్పనిసరిగా ఓటు వేయాలని వారు ఒక నియమంగా పెట్టుకుంటారు. ఈ వృద్ధ ఓటర్లు ఎంతో నిష్ఠగా, శ్రద్ధగా ఓటు వేయడం ఓటు వేయడానికి బద్ధకించే యువ ఓటర్లకు స్ఫూర్తిదాయకంగా ఉంటుందనడంలో సందేహం లేదు.


మొత్తం మీద ఓటర్లెవరూ ఓటు వేయకుండా ఉండకూడదనే పట్టుదలతో ఉన్న ఎన్నికల కమిషన్‌, వృద్ధులకు, దివ్యాంగులకు ఓటు హక్కు వినియోగానికి అవకాశం కల్పించడంతో తన నిర్ణయాన్ని కార్యరూపంలో పెట్టడం ప్రారంభించింది. ఇక దేశంలో 80 ఏళ్లు పైబడిన వృద్ధుల సంఖ్య 12.15 లక్షల వరకూ ఉంటుంది.ఇందులో శతాధిక వృద్ధుల సంఖ్య 16,973.ఇందులో దాదాపు లక్షల మందికి కర్ణాటక శాసన సభ ఎన్నికల సందర్భంగా ఓటు హక్కు వినియోగానికి అవకాశం కల్పిస్తోంది. మొత్తం 5.55 లక్షల మంది దివ్యాంగ ఓటర్లలో అతి తక్కువ శాతం మందికి మాత్రమే ఓట్‌ ఫ్రమ్‌ హోమ్‌ సౌకర్యాన్ని కల్పించడం జరుగుతున్నప్పటికీ, ఈ వినూత్న ఆలోచన పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చడానికి కొంత కాలం పడుతుందనే వాస్తవాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.దీనివల్ల ప్రజల్లో చైతన్యం, అవగాహన పెరిగే అవకాశం ఉందని కూడా ఎన్నికల కమిషన్‌ భావిస్తోంది.
ఇక మారుమూల గ్రామాలలో ఉన్నవారు సైతం ఓటు హక్కు వినియోగించుకోవాలన్న సదుద్దేశంతో ఎన్నికల కమిషన్‌ టెక్నాలజీ సహాయంతో రిమోట్‌ ఓటింగ్‌ మెషీన్స్‌ను ప్రవేశపెట్టే ఆలోచనలో ఉంది. సమీప భవిష్యత్తులో ఈ ఆలోచన కూడాతప్పకుండా కార్యరూపందాలుస్తుంది. ఎటువంటి లోపాలూ లేకుండా ఈ పద్ధతి కూడా అమలయ్యే పక్షంలో ఇది రాజకీయ దృశ్యాన్నే సమూలంగా మార్చేస్తుందనడంలో సందేహం లేదు. మారుమూల ప్రాంతాలకు వెళ్లగలగడం, వారిని గురించిన వివరాలు సేకరించడం, వారిని రహస్యంగా ఓటు వేసేలా చేయడం వంటివి దేశ రాజకీయ, సామాజిక వ్యవస్థలను మార్చడానికి ఉపకరిస్తాయి. దేశంలో ప్రతివారూ ఓటేయడానికి ఎన్నికల కమిషన్‌ చర్యలు చేపడితే ఇది దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత పరిపుష్ఠం చేస్తుంది.

By
en-us Political News

  
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.