ఉభయ తెలుగు రాష్ట్రాలకూ వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. భానుడి భగభగలతో అల్లాడిపోతున్న తెలుగు రాష్ట్రాలలో రానున్న ఐదు రోజులూ విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఎండలు, ఉక్కపోతతో సతమతమవుతున్నప్రజలకు ఈ వర్షాలు ఉపశమనం కలిగిస్తాయి. రానున్న 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.
పశ్చిమ ఉత్తరప్రదేశ్ మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో మధ్యప్రదేశ్ నుండి విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా ఉత్తర తమిళనాడు వరకు కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో ఏపీ తెలంగాణలలో ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
ఇప్పటికే ఏపీలో పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురు గాలుల ధాటికి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. రాబోయే 24 గంటల్లో నైరుతి మరియు ఆగ్నేయ అరేబియా సముద్ర ప్రాంతాలు, లక్షద్వీప్ దీవులు, కేరళతో పాటు పొరుగు రాష్ట్రమైన తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు వేగంగా విస్తరించనున్నాయి. ఇవి క్రమంగా ఏపీ వైపు కదలనుండటంతో రానున్న రోజుల్లో ఎండల తీవ్రత గణనీయంగా తగ్గనుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/rains-in-telugustates-36-221734.html
తెలంగాణవ్యాప్తంగా వేసవి సెలవులను ఎంజాయ్ చేస్తున్న విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు రాష్ట్ర విద్యాశాఖ ఒక అతి ముఖ్యమైన శుభవార్తను అందించింది.
ఏపీలో కూటమి పాలనలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతున్నట్టే 108 అంబులెన్స్ సర్వీసులూ లక్షలాదిమందికి ప్రాణదాతగా నిలుస్తూ సమర్థతను చాటుకుంటున్నాయి.
సినీ రంగంలో నటుడిగా, అద్భుతమైన కొరియోగ్రాఫర్‌గా, విలక్షణ దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాఘవ లారెన్స్ చుట్టూ ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
భాష్యం విద్యాసంస్థల చైర్మన్‌గా సుపరిచితులైన భాష్యం రామకృష్ణ.
ఒడిశా రాష్ట్రంలో వెలుగుచూసిన ఒక ప్రభుత్వ ఇంజనీర్ అవినీతి ఉదంతం ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.
కూకట్‌పల్లి మంజీరా మాల్‌లోని కింగ్ & క్వీన్స్ పబ్ రాత్రి సాధారణంగా హడావుడిగా ఉండే ప్రదేశమే.
గతంలో కంప్యూటర్లు కొత్తగా వచ్చినప్పుడు కూడా ఇలాంటి భయాలే వ్యక్తమయ్యాయి. కంప్యూటర్లు వస్తే అకౌంటెంట్లు, క్లర్కుల ఉద్యోగాలు పోతాయని అంతా భావించారు. కానీ వాస్తవంగా జరిగిందేమిటి? కంప్యూటర్ల వల్ల పాత ఉద్యోగ పద్ధతులు మారాయి తప్ప ఉద్యోగాలు తగ్గలేదు.. సరికదా మరిన్ని అవకాశాలు వచ్చాయి. సాఫ్ట్‌వేర్ అనే రంగం తెరమీదకు వచ్చింది. కోట్లాది మందికి సరికొత్త ఉపాధి లభించింది.
గచ్చిబౌలిలోని ఓ ఎలైట్ కోలివింగ్‌లో ఒక యువతి తన జీవితానికి చివరి అధ్యాయం రాసుకున్నది.
బీఆర్‌ఎస్ నేత సురేష్ రెడ్డి ఇంట్లో భారీ చోరి జరగడం తో హైదరాబాద్ సనత్ నగర్ జెడ్ కాలనీ ఇప్పుడు ఒక్క సారిగా చర్చల కేంద్రంగా మారింది.
ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ తన రష్యా పర్యటనను యథావిధిగా కొనసాగించాలని సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. డ్రోన్ల దాడుల వార్త వెలువడే సమయానికి ఆయన మాస్కో నుండి సెయింట్ పీటర్స్‌బర్గ్‌కు ప్రయాణిస్తున్నారు. అక్కడ నెలకొన్న భద్రతా ఏర్పాట్లు, తాజా పరిస్థితులపై ఉన్నతాధికారులతో సమీక్షించిన అనంతరం, లోకేష్ తన షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు చేయకూడదని నిశ్చయించుకున్నారు.
మలేషియా దేశంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి.
మధ్యతరగతి, సామాన్య కుటుంబాలపై మరోసారి చమురు భారం పడింది.
తమిళనాట బీజేపీకి ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి కె.అన్నామలై మూడు రోజుల క్రితం రాజీనామా చేశారు.