ప్రతి కాల్ వెనుక ఒక ప్రాణం... ప్రతి స్పందన వెనుక 108
Publish Date:Jun 7, 2026
Advertisement
గోల్డెన్ అవర్లో గోల్డెన్ సర్వీస్.. 108 అంబులెన్స్ ల రూపు రేఖలు మార్చేసిన కూటమి ప్రభుత్వం.. ఏపీలో కూటమి పాలనలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతున్నట్టే 108 అంబులెన్స్ సర్వీసులూ లక్షలాదిమందికి ప్రాణదాతగా నిలుస్తూ సమర్థతను చాటుకుంటున్నాయి. ప్రతి నిమిషం ప్రాణ రక్షణే లక్ష్యంగా అత్యవసర సేవలు అందిస్తున్నాయి. భవ్య హెల్త్ కేర్ ఆధ్వర్యంలో అంబులెన్స్ లకు టెక్నాలజీ జోడించి బాధితులను గోల్డెన్ అవర్ లో ఆస్పత్రులకు చేర్చాయి. 2025 జూన్ నుంచి 2026 మే వరకు ఏడాది కాలంలో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 7,78,799 అత్యవసర కేసులకు స్పందించి వేలాది కుటుంబాల్లో ఆశాజ్యోతిని వెలిగించాయి. ప్రాణాపాయ స్థితిలో దేవుడిలా 108 సాయం ఈ ఏడాది కాలంలో 1,13,764 మంది రోడ్డు ప్రమాద బాధితులకు 108 సిబ్బంది గోల్డెన్ అవర్లో అత్యవసర వైద్య సహాయం అందించారు. అలాగే 1,05,786 మంది గర్భిణీలను సురక్షితంగా ఆసుపత్రులకు తరలించి తల్లి-శిశు ఆరోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషించారు. 97,118 శ్వాసకోశ సమస్యల కేసుల్లో తక్షణ వైద్య సహాయం అందించి ప్రాణాలను కాపాడారు. అదేవిధంగా 49,342 వాహనేతర గాయాల కేసులు, 45,951 గుండెజబ్బుల కేసులు, 40,553 స్పృహ తప్పిన కేసులు, 34,532 కడుపునొప్పి కేసులు, 32,858 విషప్రయోగ కేసులు, 29,485 ఫిట్స్ కేసులు, 27,455 తీవ్ర జ్వరం కేసులు, 20,278 పక్షవాతం కేసులు, 15,441 దాడుల కేసులు, 14,088 జంతువుల కాటు కేసులు, 14,007 నవజాత శిశువుల అత్యవసర కేసులతో పాటు మరో 1,38,141 ఇతర అత్యవసర కేసుల్లోనూ 108 సిబ్బంది అంకితభావంతో సేవలందించి తమ చిత్తశుద్ధిని చాటుకున్నాయి. ఈ మొత్తం సేవల్లో 2,53,022 కేసులు ఒక ఆసుపత్రి నుండి మరొక ఆసుపత్రికి తరలించిన అంతర్గత బదిలీలు (IFT) కాగా, 5,25,777 కేసులు నేరుగా ప్రమాద స్థలాలు మరియు అత్యవసర ప్రాంతాల నుండి ఆసుపత్రులకు తరలించిన నాన్-IFT కేసులుగా నమోదయ్యాయి. గుండె పోటు వంటి ఎమర్జెన్సీ కేసుల్లో ప్రాణాధారంగా 108 ప్రాణాపాయ పరిస్థితుల్లో ప్రతి నిమిషం కీలకంగా మారే గుండెజబ్బుల అత్యవసర కేసుల్లో 108 అంబులెన్స్ 108 సిబ్బంది దేవుడిలా మారి, సకాలంలో సర్వీస్ అందిస్తూ ఎందరికో పునర్జన్మను ప్రసాదిస్తున్నారు. ఏడాదిలో 45,951 గుండెజబ్బుల కేసులకు స్పందించి సకాలంలో వైద్య సహాయం అందించారు. దీంతో పాటు ఛాతినొప్పి, శ్వాసకోశ ఇబ్బందులు వంటి అత్యవసర పరిస్థితుల్లో 108 సిబ్బంది వేగంగా సంఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక చికిత్స అందించి సమీప ఆసుపత్రులకు తరలించారు. అత్యాధునిక వైద్య పరికరాలు, శిక్షణ పొందిన EMTలు మరియు సమర్థవంతమైన అంబులెన్స్ నిర్వహణతో వేలాది ప్రాణాలను కాపాడడంలో 108 సేవలు కీలక పాత్ర పోషించాయి. ఆపద సమయంలో రోగికి వైద్య సహాయం అందే వరకు EMTలు అందించే సేవలు ప్రాణరక్షణలో కీలకంగా మారుతున్నాయి. వారి సమయస్ఫూర్తి, నైపుణ్యం, సేవాభావం వల్ల వేలాది మంది ప్రాణాలు నిలబడుతున్నాయి. ఎమర్జెన్సీ రోగుల పాలిట సంజీవనిగా సేవలు ఈ సందర్భంగా భవ్య హెల్త్ కేర్ మీడియా కోఆర్డినేటర్ మాట్లాడుతూ...ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికీ సరైన సమయంలో అత్యవసర వైద్య సహాయం అందించడమే మా ప్రధాన లక్ష్యం. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఆధునిక సాంకేతికత, నిరంతర నిఘా వ్యవస్థలు మరియు నైపుణ్యం కలిగిన సిబ్బందితో 108 సేవలను మరింత బలోపేతం చేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా మరింత సమర్థవంతమైన సేవలు అందించి ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామన తెలిపారు. 108 సేవల పనితీరుపై సర్వత్రా హర్షం ప్రమాదాలు, గుండెపోటు, ప్రసవాలు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో సమయానికి చేరుకుని వైద్య సహాయం అందించడం ద్వారా 108 సేవలు ప్రజారోగ్యానికి భరోసా కల్పిస్తున్నాయి. అత్యవసర సమయాల్లో వేగంగా స్పందిస్తూ ప్రాణాలను కాపాడుతున్న 108 అంబులెన్స్ సేవలపై బాధితులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు 24 గంటలూ అందుబాటులో ఉండే 108 సేవలు అనేక కుటుంబాలకు ఆపద్బాంధవంగా నిలుస్తున్నాయని ప్రజలు అభినందిస్తున్నారు. అత్యవసర సమయంలో ఒక్క ఫోన్ కాల్తో స్పందించి బాధితులను సురక్షితంగా ఆసుపత్రులకు తరలిస్తున్న సిబ్బంది సేవాభావాన్ని కొనియాడుతున్నారు.
http://www.teluguone.com/news/content/108-ambulance-service-in-ap-36-222164.html





