ఏఐ ఉద్యోగాల కోత కాదు.. అవకాశాల సృష్టి!

Publish Date:Jun 7, 2026

Advertisement

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఒకటే చర్చ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ రాకతో   ఉద్యోగాలు ఊడిపోతాయని, భవిష్యత్తులో  అన్ని పనులూ ఏఐ  చేసేసి మనుషులను రోడ్డున పడేస్తుందన్నదే ఆ చర్చ. అదే  ఆందోళన సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఇప్పటికే పలు కంపెనీటు రిట్రెంచ్ మెంట్ ఆరంభించేశాయి. అయితే ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే.. మరో వైపు చూస్తే..    ఏఐ అనేది ఉద్యోగాలను మింగేసే భూతం కాదు.. సరికొత్త ఉద్యోగ విప్లవానికి నాంది పలికే ఒక అవకాశాల సృష్టి.  

గతంలో కంప్యూటర్లు కొత్తగా వచ్చినప్పుడు కూడా ఇలాంటి భయాలే వ్యక్తమయ్యాయి.  కంప్యూటర్లు వస్తే అకౌంటెంట్లు, క్లర్కుల ఉద్యోగాలు పోతాయని అంతా భావించారు.   కానీ వాస్తవంగా జరిగిందేమిటి?   కంప్యూటర్ల వల్ల పాత ఉద్యోగ పద్ధతులు మారాయి తప్ప ఉద్యోగాలు తగ్గలేదు.. సరికదా మరిన్ని అవకాశాలు వచ్చాయి.   సాఫ్ట్‌వేర్ అనే రంగం తెరమీదకు వచ్చింది.   కోట్లాది మందికి సరికొత్త ఉపాధి లభించింది. 

అంత కంటే ముందు జేసీబీ విషయంలోనూ ఇలాంటి భయాలే ఉత్పన్నమయ్యాయి.  జేసీబీని చూసి అంతా.. పది మంది చేసే పనిని జేసీబీ చేసేస్తుంది. ఇక పనులు ఉండవు అంటూ అప్పట్లో జనాలలో తీవ్ర ఆందోళన వ్యక్తం అయ్యింది. అయితే వాస్తవంగా జరిగిందేంటి? కొత్త ఉపాధి అవకాశాలు పుట్టుకొచ్చాయి. ఔను.. జేసీబీని నడపడానికి ఒకడు, మరమ్మతు చేయడానికి ఒకడు, ఆయిల్ తేవడానికొకడు, రోడ్డు డిజైన్ చేయడానికి ఇంజినీ, రోడ్డు వేసిన తరువాత దానిమీద వాహనాలు పెరిగాయి. పెట్రోల్ బంకులు పెరిగాయి, వాటి రిపేర్ కోసం మెకానిక్ లు ఇలా జెసీబీ రాక పది మంది పనులు పోగొడితే.. కొత్తగా 100 మందికి ఉపాధి కల్పించింది. 

అలాగే కంప్యూటర్ల విషయంలో కూడా.. కంప్యూటర్లు వచ్చినప్పుడు టైపిస్టులు ఉద్యోగాలు పోతాయని బెంబేలెత్తిపోయారు. అయితే వాస్తవంగా జరిగిందేంటి?..  కంప్యూటర్ ఆపరేటర్, హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు, ప్రింటర్లు వాటిని ఆపరేట్ చేయడానికి, రిపేర్ చేయడానికి వందల మందికి అవకాశాలు వచ్చాయి. ఆ తరువాత  ప్రపంచ ఐటీ రంగాన్ని శాసించే స్థాయికి ఇండియా చేరుకుంది.  
ఇప్పుడు అలాగే ఏఐ వచ్చింది. ఐటీ ఉద్యోగులు ఉద్యోగాలు పోతాయని బెంబేలెత్తుతున్నారు. కానీ చరిత్రను గమనిస్తే టెక్నాలజీ మారిన ప్రతి సందర్భంలోనూ ఇలాంటి ఆందోళనలే వ్యక్త మయ్యాయి. కానీ కొత్త టెక్నాలజీ వచ్చిన ప్రతిసారీ పని రూపం మారిందే తప్ప పని పోలేదు. ఏఐ కూడా అంతే.. భయ పడాల్సిన అవసరం లేదు. రిక్షా పోయి, ఆటో వచ్చింది. బైక్ టాక్సీ వచ్చింది. కొత్త ఉపాధి అవకాశాలకు తలుపులు తెరిచింది.  

ఇప్పుడు ఏఐ విషయంలోనూ అంతే.. ఏఐ తెలివైనదే.. కానీ మనిషికీ, మనిషి శ్రమకు ఎంత మాత్రం ప్రత్యామ్నాయం కాదు. ఏఐ 99శాతం పనిని సరిగ్గా చేస్తుంది. కానీ ఆ మిగిలిన ఒక శాతం ఎక్కడ మిస్ అయ్యింది అని కనిపెట్టడానికి అసరమైనది మానవ మేధ మాత్రమే. అంటే ఏఐ ఏం చేయాలో మనిషే చెప్పాలి. ఏఐ చేయలేని దానికి చేయాల్సిందీ మనిషే..  అంటే..  సృజనాత్మకత, నిజమైన అనుభవం, మానవ సంబంధాలు, నైతిక నిర్ణయాలు ఇలాంటివి ఏఐ చేయలేదు. ఎందుకంటే.. వీటికి పుస్తకాల నుంచి నేర్చుకున్న విజ్ణానం సరిపోతు.. ఇవి జీవితం నుంచి నేర్చుకోవలసినవి.  

ఇప్పుడు ఇక చెప్పొచ్చేదేంటంటే.. మానవ మెదడు ఏ కొత్త విషయాన్ని తొందరగా అంగీకరించదు. . అది  జేసీబీ అయినా, కంప్యూటర్ అయినా, తాజాగా ఏఐ అయినా. అయితే..  చరిత్ర చూసిన కంటికి భయం తక్కువగా ఉంటుంది. భూమి మీద మనిషి పుట్టిన దగ్గర నుండి పనిచేస్తున్నాడు. పని రూపం మారింది — పని పోలేదు. పనిచేసే వాడికి ఎప్పుడూ పని ఉంటుంది. అది ఏ యుగంలోనైనా సరే. ఏ సాంకేతికత వచ్చాన సరే. ఏఐ మన ఉపాధి పోగొట్టడానికి కాదు.. కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించుకోవడానికి. ఏఐ అన్నది మనం ఉపయోగించుకోవడానికి ఒక టూల్.  దానిని సరిగ్గా ఉపయోగించుకుంటే ఉద్యోగాలలో కోత.. కాదు అవకాశాలు వెల్లువలా వచ్చి పడతాయి. 

By
en-us Political News

  
భాష్యం విద్యాసంస్థల చైర్మన్‌గా సుపరిచితులైన భాష్యం రామకృష్ణ.
ఒడిశా రాష్ట్రంలో వెలుగుచూసిన ఒక ప్రభుత్వ ఇంజనీర్ అవినీతి ఉదంతం ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.
కూకట్‌పల్లి మంజీరా మాల్‌లోని కింగ్ & క్వీన్స్ పబ్ రాత్రి సాధారణంగా హడావుడిగా ఉండే ప్రదేశమే.
గచ్చిబౌలిలోని ఓ ఎలైట్ కోలివింగ్‌లో ఒక యువతి తన జీవితానికి చివరి అధ్యాయం రాసుకున్నది.
బీఆర్‌ఎస్ నేత సురేష్ రెడ్డి ఇంట్లో భారీ చోరి జరగడం తో హైదరాబాద్ సనత్ నగర్ జెడ్ కాలనీ ఇప్పుడు ఒక్క సారిగా చర్చల కేంద్రంగా మారింది.
ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ తన రష్యా పర్యటనను యథావిధిగా కొనసాగించాలని సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. డ్రోన్ల దాడుల వార్త వెలువడే సమయానికి ఆయన మాస్కో నుండి సెయింట్ పీటర్స్‌బర్గ్‌కు ప్రయాణిస్తున్నారు. అక్కడ నెలకొన్న భద్రతా ఏర్పాట్లు, తాజా పరిస్థితులపై ఉన్నతాధికారులతో సమీక్షించిన అనంతరం, లోకేష్ తన షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు చేయకూడదని నిశ్చయించుకున్నారు.
మలేషియా దేశంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి.
మధ్యతరగతి, సామాన్య కుటుంబాలపై మరోసారి చమురు భారం పడింది.
తమిళనాట బీజేపీకి ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి కె.అన్నామలై మూడు రోజుల క్రితం రాజీనామా చేశారు.
రంగారెడ్డి జిల్లా కోహెడలో నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి, వ్యవసాయం, సంక్షేమ పథకాలపై విస్తృతంగా మాట్లాడారు.
అమెరికాలోని న్యూయార్క్ సిటీలోలో తెలుగు యువకుడు కుంచా అన్షుల్ దారుణ హత్యకు గురైనాడు.
తెలంగాణ భవన్‌లో ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో మరో పెను సంచలనం చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.