తెలుగు రాష్ట్రాలలో ఈ వారం అంతా వానలే వానలు!

Publish Date:Jun 23, 2026

Advertisement

మృగశిర కార్తెలో కూడా ముఖం చాటేసిన వరుణులు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలపై కరుణ చూపుతున్నాడు.  గత కొన్ని రోజులుగా భానుడి భగభగలకు, ఉక్కపోత కు తల్లడిల్లిపోతున్న తెలుగు రాష్ట్రాలకు   భారత వాతావరణ శాఖ  తాజాగా  చల్లని కబురు అందించింది. నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయనీ,  వీటి ప్రభావంతో ఈ నెల 20 వరకూ తెలుగు రాష్ట్రాల్లో  ఈ నెల 30వ వరకూ విస్తారంగా వర్షాలు కురుస్తాయని  పేర్కొంది.  

ఈ వర్షాల రాకతో ఎండల తీవ్రత ఒక్కసారిగా తగ్గి, రాబోయే రోజుల్లో  ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోయే అవకాశం ఉందని తెలిపింది.అమరావతి, హైదరాబాద్ వాతావరణ కేంద్రాల సమాచారం మేరకు.. రానున్న వారం రోజులూ.. తెలుగు రాష్ట్రాలలోని దాదాపు అన్ని ప్రాంతాలలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయి.    కొన్ని జిల్లాల్లో   ఉరుములు, మెరుపులతో కూడిన అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.  

ఆంధ్రప్రదేశ్ లో   బుధవారం (జూన్ 24)  శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలలో పలు చోట్ల  భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.  ఇక ఈ నెల  జూన్ 29, 30 తేదీలలో ఈ జిల్లాల్లో వర్షాల తీవ్రత మరింత తీవ్రంగా ఉంటుంది. అలాగే..  కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు  జిల్లాలలో ప్రారంభంలో మోస్తరు వర్షాలు కురుస్తాయి.  రాయలసీమ ప్రాంతంలో  ఈ వారం చివరిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.   

అలాగే  తెలంగాణలో కూడా బుధవారం (జూన్ 24)  ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ  జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్  జారీ చేసింది.  వారం చివరి నాటికి ఈ వర్షాలు రాజధాని హైదరాబాద్, రంగారెడ్డితో పాటు రాష్ట్రంలోని దక్షిణ జిల్లాలకు  పూర్తిగా విస్తరిస్తాయి.  

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలు తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
హైదరాబాదు నగర పరిసరాల్లో ఆర్మీకి చెందిన భూములపై అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ రక్షణ శాఖ అధికారులు హైడ్రా కమిషనర్‌ను ఆశ్రయించారు.
భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో ప్రక్షాళన, విముక్తి, భద్రత అనే మూడు అంశాలపై కూటమి ప్రభుత్వం దృష్టి సారిస్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు.
ఈ జనరేషన్‌కి ఎమోషనల్ కంట్రోల్ లేకపోవడమే నేరాలకు కారణమా..!
టెక్ మహీంద్రా కంపెనీ ముందు ధర్నాకు దిగిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి..
ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో సీఐడీ దాఖలు చేసిన ఛార్జిషీట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో తీవ్ర చలననాన్ని రేపింది.
వరంగల్‌లో మీడియా రిపోర్టర్లతో నిర్వహించిన చిట్‌చాట్ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు.
తన అనుచరులు, స్థానికులతో కలసి ప్రత్యేక వేదికపై కూర్చుని ఈ మౌన నిరసన చేపట్టారు. ఏలాంటి ఉపన్యాసాలు, నినాదాలు లేకుండా కేవలం మౌనంతోనే ఆయన నిరసన వ్యక్తం చేశారు. దేశ రాజథానిలో వేలాది మంది విద్యార్థులు రోడ్లపైకి వచ్చి గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నా కేంద్రం స్పందించకపోవడం దారుణమని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం చేతులు మారిన ప్రతీసారీ రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల అంశం మళ్లీ రాజకీయ తెరపైకి వస్తుంది.
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన ప్రాపర్టీని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వేలం వేయడాన్ని సమర్థిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ బండ్ల గణేష్ దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి విదితమే. అయితే బండ్ల గణేష్ పిటిషన్ ను డిస్మిస్ చేసిన సుప్రీం కోర్టు హైకోర్టు తీర్పును సమర్ధించింది.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఢిల్లీ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో తాజాగా అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.