ఇటలీకి రాహుల్.. ఇండియాలో రచ్చ 

Publish Date:Dec 31, 2021

Advertisement

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఎక్కడ? ఒకప్పుడు ఇదొక పెద్ద ప్రశ్న. ఒకసారి కాదు అంతకంటే ఎక్కువసార్లే ఆయన ఎవరికీ చెప్పపెట్టకుండా విదేశాలకు వెళ్ళిపోవడం... ఎక్కడి కెళ్ళారు, ఎందుకు వెళ్ళారు అనేది ఎవరకీ తెలియకపోవడం, పార్టీ నాయకులు మీడియా ముందు కొంచెం చాలా ఇబ్బంది పడడం, అందరికీ తెలిసిన విషయమే. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో కూడా రాహుల్  గాంధీ కనిపించని సందర్భాలు చాలానే ఉన్నాయి.ఇప్పుడు మళ్ళీ అలాంటి సందర్భమే వచ్చింది. అయితే, ఇప్పుడు గతంలోలా ఎవరికీ చెప్పాపెట్టకుండా గాయబ్ కాలేదు . అందరికీ చెప్పే ఇటలీ వెళ్ళారు. ఇటలీ ఎందుకు వెళ్లారు అనేది వేరే చెప్పనక్కర లేదు. సంక్రాంతికో ఉగాదికో మనం మన అమ్మమ్మ ఊరుకు పోతాం కదా, ఆలాగే, ఆయన  న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం కావచ్చు, అమ్మమ్మ ఊరు (ఇటలీ) వెళ్ళారు. 

నిజానికి ఇది ఆయన వ్యక్తిగత పర్యటన. ప్రధాని మోడీ సంవత్సరంలో ఒక సారో రెండు సార్లో గుజరాత్ వెళ్లి అమ్మను చూస్తారు కదా .. ఇది కూడా అలాంటిదే. కానీ, ప్రస్తుత పరిస్థితి ఏంటి, దేశంలో ప్రస్తుతం కరోనా, ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతున్నాయి. దీంతో విదేశాలకు వెళ్లి, వచ్చే ప్రయాణికుల పట్ల ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉంటున్నాయి. ఇలాంటి సమయంలో ఆయన ఇటలీ ఎలా వెళతారని, బీజేపీ, పాయింట్ రైజ్ చేసింది, ఇది రాహుల్ జీ  వ్యక్తిగత పర్యటన, వ్యక్తిగత పర్యటనను రాద్ధాంతం చేయొద్దని కాంగ్రెస్‌ పార్టీ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. దీంతో ఇప్పుడు రాహుల్‌ పర్యటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఒమిక్రాన్‌ విజృంభిస్తున్న వేళ ఆయన విదేశాలకు వెళ్లడం బాధ్యతారాహిత్యమంటూ బీజేపీ విమర్శించింది. ఇదే అదనుగా గతంలో రాహుల్  గాంధి విదేశీ పర్యటనల హిస్టరీ మొత్తం బయటకు తెస్సింది. గతంలో కేంద్ర మంత్రి అమిత్‌షా పార్లమెంట్‌లో రాహుల్‌ గాంధీ పర్యటనకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. 2015 నుంచి 2019 వరకు రాహుల్‌ గాంధీ 247 సార్లు విదేశాలకు వెళ్లారని తెలిపారు. కనీసం ప్రోటోకాల్‌ పాటించకుండా ఆయన పర్యటనలు చేస్తున్నారని అమిత్‌షా విమర్శించారు. ఈ విషయాన్ని బీజేపీ నేతలు ఇప్పుడు గుర్తుచేస్తున్నారు.

మరో వంక  బీజేపీ తీరుపై కాంగ్రెస్‌ పార్టీ భగ్గుమంటోంది. రాహుల్‌ గాంధీ వ్యక్తిగత పర్యటన నిమిత్తం ఇటలీ వెళ్లారు. బీజీపే  ఆ పార్టీ మద్దతుదారులు ఈ విషయాన్నిసోషల్ మీడియాలో  రాద్దాంతం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు, అంటూ  ఏఐసీసీ ప్రతినిధి రణ్‌దీప్‌ సింగ్‌ సుర్జేవాలా అన్నారు. అదలా ఉంటే, రాహుల్ గాంధీ విదేశీ పర్యటన గురించి అంతగా రాద్ధాంతం చేస్తున్న బీజేపీ నాయకులు, కొవిడ్ నిబంధనలను  పాటిస్తున్నారా, అని కాంగ్రెస్ అనుకూల సోషల్ మీడియాలో ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రధాని మోడ్ పాల్గొన్న బహరీ బహిరణ సభలను ఫోటోలను జోడించి ... మరీ ట్రోల్ చేస్తున్నాయి.  నిజమే ప్రధాని నరేంద్ర మోడీ నిన్న (గురువారం) ఉత్తఖండ్’లో భా బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ రోజు అయోధ్యలో హోమ్ మంత్రి అంతకంటే పెద్ద బహిరంగ సభలో పాల్గొన్నారు. నిజానికి, నిన్న ఈరోజు అని కాదు, బీజేపీ నాయకులు కొవిడ్ నిబంధనలను గాలికి వదిలేసి భారీ బహిరంగ సభలు నిర్వహించని రోజు లేదు. సో.. కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించి నందుకు ఎవరి మీదనైనా చర్యలు తీసుకోవాలంటే ముందుగా ప్రధమ సేవకుడు (పీఎం) మీద ఆ తర్వాత హోమ్ మంత్రి అమిత్ షా మీద తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు ..సోషల్ మీడియా సూటిగా ప్రశ్నిస్తోంది.. నిజమే కదా ..

By
en-us Political News

  
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
 నామినేషన్ల ఉపసంహరణ గడువు  ముగిసే నాటికి  రాష్ట్ర వ్యాప్తంగా  77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.  ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు.  గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో   మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.