ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అల్లు అర్జున్ కు భారీ ఊరట లభించింది. ఎన్నికల సమయంలో ఆయనపై నమోదైన కేసును ఏపీ హైకోర్టు క్వాష్ చేసింది. ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ నంద్యాల వెళ్లి ఆ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శిల్పా రవిచంద్ర కిషోర్ కు మద్దతు పలికిన సంగతి తెలిసిందే.
ఆ సందర్భంగా వేల సంఖ్యలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అక్కడకు చేరుకున్నారు. ఎన్నికల నిబంధనలు అమలులో ఉన్న సమయంలో ముందస్తు అనుమతి లేకుండా అల్లు అర్జున్ ర్యాలీ నిర్వహించారంటూ ఎన్నికల రిటర్నింగ్ అధికారి చేసిన ఫిర్యాదు మేరకు నంద్యాల పోలీసులు అల్లు అర్జున్, శిల్పా రవిచంద్ర కిషోర్ పై కేసు నమోదు చేశారు.
ఆ కేసును కొట్టివేయాలంటూ అల్లు అర్జున్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఆ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన ఏపీ హైకోర్టు ఇరు పక్షాల వాదనా విన్న తరువాత బుధవారం (నవంబర్ 6) తీర్పు వెలువరించింది. అల్లు అర్జున్ పై కేసును క్వాష్ చేస్తూ తీర్పు ఇచ్చింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/quash-case-on-allu-arjun-39-187952.html
ఎపిలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. వైఎస్ ఆర్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులైన బీద మస్తాన్ రావ్ ఈ నెల 9న (సోమవారం) తెలుగుదేశం గూటికి చేరుతున్నారు.
త్వరలో జరగబోయే రాజ్యసభ ఉప ఎన్నికలకు గానూ బిజెపి ముగ్గురు అభ్యర్థులను ప్రకటించింది. వారిలో ఎపి నుంచి మాజీ రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య, హర్యానా నుంచి రేఖా శర్మ, ఒడిశా నుంచి సుజిత్ కుమార్ పేర్లను ప్రకటించింది.
తెలంగాణ తల్లి విగ్రహావిష్కరానికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ నెల 9న (సోమవారం సాయంత్రం ఆరు గంటలకు సచివాలయ ఆవరణలో ఈ వేడుక ప్రారంభం కానుంది.
వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జర్నలిస్టులకు భూ కేటాయింపులు గత నెల 25 వ తేదీన సుప్రీం ధర్మాసనం రద్దు చేసిన నేపథ్యంలో జవహార్ హౌసింగ్ సొసైటీ మరో మారు కోర్టు ఆత్మరక్షణలో పడిపోయింది
ఈ నెల 9వ తేదీన తెలంగాణ సచివాలయ ప్రాంగణంలో తలపెట్టిన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు మాజీ ముఖ్యమంత్రి కెసీఆర్ కు ఆహ్వానం అందింది. మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం మాజీ ముఖ్యమంత్రిని ఎర్రవెల్లి ఫాం హౌజ్ లో కల్సుకున్నారు.
తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై బిఆర్ఎస్ హైకోర్టు గడపదొక్కింది. ఆ పార్టీ నాయకుడు, జర్నలిస్ట్ జూలూరి గౌరిశంకర్ హైకోర్టులో పిల్ వేశారు. ఈ నెల 9వ తేదీన సచివాలయం వద్ద తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు రేవంత్ సర్కార్ చెప్పింది.
ఎపిలో రేషన్ బియ్యం మాఫియా గుట్టు రట్టు చేసిన కూటమి ప్రభుత్వం దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. బియ్యం అక్రమ రవాణాపై సిట్ ఏర్పాటు చేసింది. వినీత్ బ్రిజ్ లాల్ నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో సిట్ ఏర్పాటయ్యింది
వైఎస్సార్ కాంగ్రెస్ రాజ్య సభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి కుమారుడు వైవి విక్రాంత్ రెడ్డి శుక్రవారం ఎపి హైకోర్టునాశ్రయించారు. డిసెంబర్ రెండో తేదీన మంగళగిరిలో సిఐడి కేసు నమోదు చేసిన నేపథ్యంలో వైవి సుబ్బారెడ్డి మీద ఎ1గా కేసు నమోదైంది.
జాఫర్ బయ్ అర్ధాంగికి కలలో పాములు వస్తున్నాయి. నాకు ఎవరో చేతబడి చేస్తున్నారు అందుకే కలలో పాములు వస్తున్నాయి అని అనుమానం వ్యక్తం చేసింది కుబ్రాబేగం. పరిష్కారం కోసం భార్య భర్తలు ఇరువురు మౌలానా దగ్గరికి వచ్చారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న భాస్కర్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారి చేసింది. తెలంగాణ హైకోర్టు భాస్కర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ వైఎస్ సునీత సుప్రీం గడపతొక్కారు. భాస్కర్ రెడ్డికి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సునీత పిటిషన్ దాఖలు చేశారు.
మహిళలపై పెరుగుతున్న హింసకు వ్యతిరేకంగా ఉద్యమించాలని విజయవాడ అబెస్ట్రికల్, గైనకాలజీ సొసైటీ(వోగ్స్ ) నిర్ణయించింది. నవంబర్ 25 నాడు మహిళలపై జరుగుతున్నహింసకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవాన్ని జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి(ఐరాస) పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.ఐరాస పిలుపు మేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నవంబర్ 25 మహిళల హింస నిర్మూలనాదినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి.
స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పివి సింధు పెళ్లి పీటలెక్కబోతున్నారు. హైదరాబాద్ కు చెందిన బిజినెస్ మ్యాన్ వెంకట దత్త సాయితో పివీ సింధు పెళ్లి నిశ్చయమైంది.
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం మహరాష్ట్రకు చేరుకున్నారు. సాయంత్రం ముంబైలో మహరాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు