Publish Date:Jul 18, 2026
లో కల్తీల నిరోధానికి సమగ్ర చట్టాలు ఉన్న దేశాలను సందర్శించి అక్కడి విధానాలను అధ్యయనం చేయాలని సీఎం అధికారులకు సూచించారు. ఆయా అధ్యయనాల ఆధారంగా ఒక సమగ్రమైన నివేదికను తయారు చేయాలన్నారు.
Publish Date:Jul 18, 2026
భూముల్లో రైతులు సాగు చేస్తున్న పంటలకు ఎలాంటి నష్టం కలగకుండా పనులు చేపడతామని రైతులకు హామీ ఇచ్చారు.
Publish Date:Jul 18, 2026
ఒక్కొక్కరిగా ఐదుగురు మునిగిపో తుండగా చూసిన స్థాని కులు వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాలింపు చర్యల్లో ఐదుగురు జాలర్ల మృతదేహాలను వెలికి తీశారు.
Publish Date:Jul 18, 2026
నెల్లూరు కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న రావణ్‌ను పోలీసులు గన్నవరం కోర్టులో వర్చువల్ విధానంలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా న్యాయస్థానంలో ఇరుపక్షాల లాయర్ల మధ్య సుదీర్ఘ వాదనలు జరిగాయి. నిందితుడిపై ఉన్న తీవ్రమైన ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతున్నందున అతని రిమాండ్‌ను పొడిగించాలని ప్రభుత్వ పక్ష న్యాయవాదులు కోరారు.
Publish Date:Jul 18, 2026
సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన నిరాహార దీక్షను పోలీసులు బలవంతంగా భగ్నం చేయడాన్ని నిరసిస్తూ కర్ణాటక రాజధాని బెంగళూరులోని విద్యార్థులు ప్రత్యక్ష పోరాటానికి రెడీ అయ్యారు. సోనమ్ వాంగ్‌చుక్ పోరాటానికి మద్దతుగా తాము కూడా నిరశన దీక్ష చేపట్టనున్నట్లు బెంగళూరు యూనివర్సిటీ విద్యార్థులు ప్రకటించారు.
Publish Date:Jul 18, 2026
నీతి ఆయోగ్ ఈ ర్యాంకింగ్స్‌ను కేవలం ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా కాకుండా.. గత కొన్ని ఏళ్ల పారిశ్రామిక విధానాల ఆధారంగా లెక్కించింది. గత ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతి విషయంలో జరిగిన గందరగోళం, పారిశ్రామిక విధానాల్లో స్థిరత్వం లేకపోవడం, గతంలో ప్రారంభమైన ప్రాజెక్టులను నిలిపివేయడం వంటి చర్యలు రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీశాయి. పక్క రాష్ట్రాల్లో లాగా పాలసీ కంటిన్యూటీ లేకపోవడం పెట్టుబడిదారుల్లో అపనమ్మకాన్ని కలిగించిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Publish Date:Jul 18, 2026
నడిరోడ్డుపై ఆమె దుస్తులు చించేసి, వివస్త్రను చేసి అవమానించారు. బాధితురాలు ఎంతగా వేడుకున్నా కనికరించకుండా పిడిగుద్దుల వర్షం కురిపించారు. స్థానిక మహిళలు అడ్డుకుని బాధితురాలికి దుస్తులు అందించారు. ఈ దారుణానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Publish Date:Jul 18, 2026
తన భర్త పవన్ కల్యాణ్‌కు ఇటీవల భుజానికి శస్త్రచికిత్స జరిగిన నేపథ్యంలో ఆయన ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని, స్వామివారి కృపాకటాక్షాలు ఉండాలని కోరుకుంటూ అన్నా లెజినోవా కాలినడకన తిరుమల చేరుకుని తిరమలేశుడిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె తన కుమారుడు మార్క్ శంకర్ పవన్ కల్యాణ్ పేరిట అన్నప్రసాదం ట్రస్టుకు 17 లక్షల రూపాయల విరాళాన్ని అందజేశారు.
Publish Date:Jul 18, 2026
వైసీపీ హయాంలో ముంబైకి చెందిన నటి కాదంబరి జెత్వానీ, తల్లిదండ్రులపై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో ఫోర్జరీ, అక్రమ వసూళ్ల ఆరోపణలతో అక్రమంగా కేసు నమోదు చేశారనేది ప్రధాన ఆరోపణ. వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదు ఆధారంగా.. కేవలం 24 గంటల వ్యవధిలోనే ముంబై వెళ్లిన ఏపీ పోలీసులు ఆమెను, ఆమె తల్లిదండ్రులను అరెస్టు చేసి విజయవాడకు తరలించారు.
Publish Date:Jul 18, 2026
కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు, యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందంటూ, వాటిని ఎండగట్టడమే ప్రధాన లక్ష్యంగా ఈ యువ సంగ్రామ సభకు బీఆర్‌ఎస్ సిద్ధమైంది. ఈ సభకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు పది వేల మందికి పైగా యువకులు, నిరుద్యోగులు, విద్యార్థులు పార్టీ కార్యకర్తలు హాజరవుతారని బీఆర్ఎస్ అంచనా వేసింది.
Publish Date:Jul 18, 2026
రాజకీయ నాయకులు వస్తారు.. వెళ్తారు. పార్టీలు మారతాయి, జెండాలు మారతాయి, జనం, నేల మాత్రం శాశ్వతం. అందుకే.. అందుకే ఈ రోజు ప్రపంచాన్ని ఒకటే అడుగుతున్నాం. పులివెందులను ఒక వ్యక్తి కళ్లతో చూడకండి. పులివెందులను ఒక కుటుంబం చరిత్రతో కొలవకండి.
Publish Date:Jul 18, 2026
ఈ దాడుల్లో ప్రాంగణంలో పెంచుతున్నపాతిక గంజాయి మొక్కలు బయటపడ్డాయి. అంతేకాకుండా, విక్రయానికి సిద్ధంగా ఉంచినట్లు అనుమానిస్తున్న ఎండు గంజాయిని కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకు న్నారు.
Publish Date:Jul 18, 2026
1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని భారత్ తాత్కాలికంగా పక్కన పెట్టడంతో సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ఆరున్నర దశాబ్దాల క్రితం క్రితం కుదిరిన ఈ ఒప్పందాన్ని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్చాలని, ఆధునీకరించాలని న్యూఢిల్లీ గట్టిగా డిమాండ్ చేస్తోంది. ఒప్పందంలో మార్పులు జరిగే వరకు పాకిస్తాన్‌కు ముందస్తు సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదని భావిస్తున్న ఇండియా.. తన సార్వభౌమత్వ పరిధిలోని పనులను వేగవంతం చేసింది.