'చిరుకు బాలయ్యను విమర్శించే హక్కు లేదు'
Publish Date:Jan 10, 2012
Advertisement
హైదరాబాద్: పదవుల కోసం ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసు పార్టీలో విలీనం చేసిన చిరంజీవికి తమ పార్టీ నాయకుడు బాలకృష్ణను విమర్శించే నైతిక హక్కు లేదని తెలుగుదేశం నాయకుడు తలసాని శ్రీనివాస యాదవ్ వ్యాఖ్యానించారు.పదవుల కోసం చిరంజీవి కాంగ్రెసు నాయకుల వద్ద మోకరిల్లారని రని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. పదవుల కోసం చిరంజీవి ఆశయాలను తుంగలో తొక్కారని ఆయన విమర్శించారు. సామాజిక న్యాయం సాధిస్తానని చెప్పిన చిరంజీవి పదవి కోసమే దాన్ని వదిలేసి కాంగ్రెసులో కలిశారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి పదవి వస్తుందని ఆశపడి పార్టీని స్థాపించిన చిరంజీవి అది రాదని తెలిసిపోయి పదవుల కోసం కాంగ్రెసులో పార్టీని విలీనం చేశారని ఆయన అన్నారు. తనకు పదవి ఎప్పుడిస్తారో చెప్పాలని కాంగ్రెసు నాయకుల మోకాళ్ల వద్ద చిరంజీవి కూర్చున్నారని ఆయన అన్నారు. చిరంజీవికి బాలకృష్ణ గురించి గానీ తమ పార్టీ గురించి గానీ మాట్లాడే నైతిక హక్కు లేదని ఆయన అన్నారు. చిరంజీవికి పదవులే ముఖ్యమని ఆయన అన్నారు.
http://www.teluguone.com/news/content/prp-party-24-10819.html





