బోరవెల్లి చారిత్రక అన్నవాళ్లు పరిరక్షించుకోవాలి.. ఈమని శివనాగిరెడ్డి

Publish Date:Mar 7, 2026

Advertisement

జోగులాంబ గద్వాల జిల్లా మానోపాడు మండలం  బోరవెళ్లి లోని  చారిత్రక ఆనవాళ్లను కాపాడుకోవాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్  సీఈవో డాక్టర్  ఈమని శివనాగిరెడ్డి అన్నారు. మానోపాడుకు సరిగ్గా పది కిలోమీటర్ల దూరంలో ఉన్న బోరవెళ్లి  ప్రముఖ పత్రికా సంపాదకుడు, పరిశోధకుడు, పండితుడుగా, రచయిత సురవరం ప్రతాపరెడ్డి స్వగ్రామం కూడా.

ఆ గ్రామంలో బాదామి చాళుక్యుల కాలం నాటి చండి, చాముండి విగ్రహాలు,  చోళులు  కాలపు గణపతి విగ్రహం, వీరభద్రాలయం పక్కన ఉన్న కళ్యాణ చాళుక్యుల కాలం నాటి నాగదేవత శిల్పాలు, మరో బురుజు పక్కన ఉన్న కాకతీవీరుల వీరుల శిల్పాలను డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి  పరిశీలించారు. వాటి ప్రాముఖ్యతను, ప్రాసస్థ్యాన్నీ గ్రామస్తులకు వివరించారు. 

 గ్రామ మధ్యలో నున్న బోరవెల్లి సంస్థానం వారు  17వ శతాబ్దిలో విజయనగర వాస్తు శైలిలో నిర్మించిన చెన్నకేశవాలయం, గర్భాలయం, అర్దమండపం, మహా మండపం, మూడు  వైపులా ప్రవేశ మండపాలు, ఆలయ అధిష్టానం, గోడలు, కప్పుల పైనున్న విష్ణు దశావతారాలు, నాట్యగత్తెలు, కాళియమర్దన, భైరవుడు, వెంకటేశ్వర స్వామి విగ్రహాలు,   ఏనుగులు, సింహాలు, యాలి శిల్పాలను పరిశీలించారు.  వీరభద్రుని గుడికి కొంచెం దూరంలో గల దిగుడు బావి, నిజాం నవాబులు నిర్మించిన  కందకంతో కూడిన కోట గోడ, బురుజులు, అసఫ్ జాహి లను,  అక్కడే ఉన్న రెండు ఫిరంగులు పరశీలించి అలనాటి రక్షణ వ్యవస్థ పటిష్ఠతను గ్రామస్థులకు వివరించారు.  

దాదాపు 1200 సంవత్సరాల వారసత్వానికి అద్దం పడుతున్న బోరవెల్లి చారిత్రక ఆనవాళ్లను కాపాడి భవిష్యత్ తరాలకు అందించాలని శివనాగిరెడ్డి గ్రామస్తులకు పిలుపునిచ్చారు.  ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రిచంద్రా రెడ్డి, సురవరం గిరిధర్ రెడ్డి, అఖిలభారత పాత దేవాలయాల పునరుద్ధరణ ట్రస్ట్ అధ్యక్షుడు, ఆర్కే జైన్, తెలంగాణ ప్రాజెక్టు కన్సల్టెంట్ ఎండి శ్రీనివాస్ బండ తదితరులు పాల్గొన్నారు. 

By
en-us Political News

  
కడప జిల్లా మద్యం బాంబులు తెగ తాగేశారు. జిల్లాను మద్యం మత్తులో ముంచేశారు.
పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో సంచలనం సృష్టించిన చౌడేశ్వరి పరువు హత్య కేసులో పోలీసు యంత్రాంగం దిద్దుబాటు చర్యలకు దిగింది.
హైదరాబాద్ తారామతి రిసార్ట్‌లో ఈగల్ ఫోర్స్ దాడులు.. ఆరుగురికి డ్రగ్ పాజిటివ్
ఇటీవలి పరిణామాలు సంప్రదాయ పోరాటాల నుండి ఇరాన్ యొక్క వ్యూహాత్మక సైనిక మౌలిక సదుపాయాలను, ముఖ్యంగా దాని క్షిపణి మరియు అణు సామర్థ్యాలను లక్ష్యంగా చేసుకుని దెబ్బతీయడం వైపు దృష్టి మళ్లుతున్నట్లు సూచిస్తున్నాయి.
ప్రస్తుతం దేవీపట్నం మండలంలోని నేలకోట కొండ ప్రాంతాన్ని ఈ పులి తన ఆవాసంగా మార్చుకున్నట్లు అధికారులు గుర్తించారు. గత నాలుగు రోజులుగా ఈ పరిసరాల్లోనే పులి తిరుగుతున్నట్లు స్థానికులు గుర్తించారు. పశువుల కాపరులు, కొండపైకి వెళ్లే గ్రామస్థులు పులిని నేరుగా చూడటంతో విషయం వెలుగులోకి వచ్చింది. రామదుర్గం కొండపై పులి కదలికలను కొందరు సెల్ ఫోన్లలో చిత్రీకరించారు కూడా.
రిసార్ట్‌లో జాక్ అండ్ జాన్సన్ పేరిట నిర్వహిస్తున్న ఓ ఈవెంట్‌లో విచ్చలవిడిగా మాదకద్రవ్యాల వాడకం జరుగుతున్నట్లు అధికారులకువిశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు ఈగల్ బృందం, హైదరాబాద్ సిటీ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్సీఎస్ సమాచారం ప్రకారం, ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.7గా నమోదైంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని హుకుంపేట మండలం జోగులపుట్టు గ్రామాన్ని భూకంప కేంద్రంగా గుర్తించారు. భూ అంతర్భాగంలో సుమారు 10 కిలోమీటర్ల లోతులో ఈ ప్రకంపనలు సంభవించాయి.
జానీ అనే వ్యక్తి రేడియో టవర్ ఎక్కి ముఖ్యమంత్రితో మాట్లాడే వరకు దిగనే దిగను అంటు హల్ చల్ చేశాడు. జానీ ఆటో నడుపుకుంటూ జీవనోపాధి కొనసాగి స్తున్నాడు. గ్యాస్ సమస్య కారణంగా ఆటో సరిగా నడపలేకపోతున్నానని దీంతో తాను తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటు న్నానొ ఆవేదన వ్యక్తం చేశాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన సీజన్ ఆరంభ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును తన క్లాసిక్ ఇన్నింగ్స్ తో గెలిపించాడు. అయితే కోహ్లీపై ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా భారీగా ట్రోలింగ్ జరుగుతోంది. లండన్‌లో నివాసం ఏర్పరుచుకున్న విరాట్ కోహ్లీ ఆర్సీబీ తరఫున ఐదో విదేశీ ఆటగాడని కొందరు కామెంట్లు చేస్తున్నారు.
స్లో ఓవర్ రేట్ కారణంగా కెప్టెన్ శ్రేయ్యస్ అయ్యర్‌‌తో పాటు పంజాబ్ ఆటగాళ్లపై జరిమానా పడింది. అది రెండో సారి కావడంతో శ్రేయస్‌పై ఐపీఎల్ కమిటీ ఏకంగా రూ.24 లక్షల ఫైన్ విధించింది. ప్లేయర్లకు రూ.6లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో పాతిక శాతం జరిమానా విధిస్తూ మ్యాచ్ రిఫరీ నిర్ణయం తీసుకున్నారు.
యుద్ధం వల్ల ఇరాన్ ప్రత్యక్ష నరకాన్ని, భారీ నష్టాన్ని చవిచూస్తోంది. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల వల్ల ఇరాన్ ఇంధన కేంద్రాలు, సైనిక స్థావరాలు.. దారుణంగా దెబ్బతింటున్నాయి. ఇరాన్ కరెన్సీ- రియాల్ విలువ దారుణంగా పడిపోయింది. ద్రవ్యోల్బణం 40శాతం దాటిపోయింది, దీనివల్ల సామాన్యులకు నిత్యావసర వస్తువులు అందనంత భారమయ్యాయి.
నాటోపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు భారతదేశానికి ఒక ముఖ్యమైన అవకాశాన్ని కల్పిస్తున్నాయి.
అమెరికా సైనిక కార్యకలాపాలకు సాంకేతిక సహకారం అందిస్తున్నాయంటూ.. ఇరాన్ ఇప్పుడు టెక్‌ దిగ్గజాలైన అమెజాన్, ఒరాకిల్ వంటి సంస్థల డేటా సెంటర్లపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. బహ్రెయిన్‌లోని అమెజాన్ డేటా సెంటర్‌తో పాటు దుబాయ్‌లోని ఒరాకిల్ కేంద్రాలపై ఇరాన్ దాడులు చేసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.