తెగ తాగేశారు...మద్యం విక్రయాల్లో ఆ జిల్లా రికార్డు!

Publish Date:Apr 5, 2026

Advertisement

 

కడప జిల్లా మద్యం బాంబులు తెగ తాగేశారు. జిల్లాను మద్యం మత్తులో ముంచేశారు. సర్కారు ఖజానాకు కాసుల వర్షం కురిపించారు. మమూడురోజుల క్రితం ముగిసిన గత ఏడాది ఆర్ధిక సంవత్సరంలో ఏకంగా వెయ్యి కోట్లకు పైగా గుట గుటా తాగేశారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వం నాణ్యమైన మద్యం అందిస్తున్నామని చెబుతున్న  ఈ మధ్యం విక్రయాలకు వేలా పాలా లేదు. తెల్లవారుజాము నుంచే విక్రయాలు సాగిస్తూ ఉండడం తో ఎప్పుడు కావాలంటే  అప్పుడు మందు దొరికే పరిస్థితి రోడ్లపై కనిపిస్తుంది. ఇందుకు తోడు బెల్ట్ షాపులు జిల్లా వ్యాప్తంగా వ్యాప్తి చెందడంతో కావలసిన వారికి కావల్సినంత మందు దొరుకుతుంది. దీంతో ముందు బాబులు మద్యం మత్తులో మునిగి జిల్లాను కూడా మత్తులో తడిపేశారు

*​ఖజానాకు కాసుల వర్షం 


​ఏడాదికి రూ. 1,155.77 కోట్ల ఆదాయం అంటే నెలకు సగటున రూ. 96.31 కోట్ల రూపాయలు మధ్యం తాగేశారు .కొత్త మద్యం విధానంతో నాణ్యమైన బ్రాండ్ల పేరుతో గత ప్రభుత్వంలో కనిపించని బ్రాండ్ లు అందుబాటులోకి రావడంతో విక్రయాలు మరింత పుంజుకున్నాయి. కేవలం మార్చి నెలలోనే రూ. 101.96 కోట్లు ఆదాయం రావడం గమనార్హం.

*కష్టం జీవుల వాటానే అధోకం

కోట్ల రూపాయల ఆదాయంలో 80 శాతం వాటా రెక్కాడితే గానీ డొక్కాడని పేదవాడిదేనని చెప్పవచ్చు.కొందరైతే 
​సాయంత్రం వేళ కూలీ డబ్బులతో నేరుగా మద్యం షాపులకే చేరుతున్నారు. దీంతో ఆ కుటుంబాలు చిన్నా భిన్నం అవుతున్నాయి.మద్యానికి బానిసలై వారి పిల్లలు భవిష్యత్తు పై ఈ ప్రభావం పడుతోంది. ​తండ్రి తాగుడుకు బానిస కావడంతో ఫీజులు కట్టలేక పిల్లలు చదువు మానేసి బాలకార్మికులుగా మారుతున్నారు. మితిమీరి మద్యం సేవించడం వల్ల వల్ల లివర్, కిడ్నీ వ్యాధులతో చిన్న వయసులోనే పురుషులు మరణిస్తున్నారు. దీంతో అనేక కుటుంబాల్లో మహిళలు అనాథలుగా, పిల్లలు దిక్కులేని వారిగా మారుతున్నారు.

*రూ,1155.77 కోట్ల విక్రయాలు

జిల్లాలో ఏర్పాటైన 139 మద్యం షాపుల ద్వారా 2025- 26 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు జరిగాయి. జిల్లాలోని 9 ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో 1155. 77 కోట్ల రూపాయల మద్యం విక్రయాలు జరగడం చూస్తే మందుబాబులు మద్యం తాగడానికి మాత్రం లోటు లేదనే చెప్పాలి. ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లవారిగా జరిగిన మద్యం అమ్మకాలు పరిశీలిస్తే బద్వేలు పోలీస్ స్టేషన్ పరిధిలో 128.85 కోట్ల రూపాయలు మద్యం విక్రయాలు జరిగాయి. 

అలాగే జమ్మలమడుగులో 84.57 కోట్లు, కడప లో 312. 37 కోట్లు ,ముద్దనూరు లో 47.76 కోట్లు ,మైదుకూరులో 112.23 కోట్ల రూపాయల మద్యం విక్రయాలు జరిగాయి. ప్రొద్దుటూరు పోలీసు స్టేషన్ పరిధిలో రూ,202.72 కోట్లు, పులివెందులలో 138.77 కోట్లు, సిద్ధవటంలో 36.79, కోట్లు , ఎర్రగుంట్ల లో91.71 కోట్ల రూపాయలు మద్యం విక్రయాలు జరిగాయి. తొమ్మిది పోలీస్ స్టేషన్లో పరిధిలో 1155.77 కోట్ల రూపాయల మధ్య విక్రయాలు కరువు కడపన  రికార్డు సృష్టించాయి

*మొదటి స్థానంలో కడప

మద్యం సేవించడంలో కడపలో మందుబాబులు మొదటి స్థానంలో ఉన్నారు. కడప ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 312.37 కోట్ల రూపాయలు మద్యం తాగేశారు .రెండో స్థానంలో ప్రొద్దుటూరు లో 202. 72 కోట్ల రూపాయలు మద్యం విక్రయాలు జరిగాయి. మూడో స్థానంలో 138.77 కోట్లతో పులివెందుల ఉంది .నాలుగో స్థానంలో బద్వేలు లో 128 .85 కోట్ల రూపాయల మద్యం సేవించారు. మొత్తంగా ఏడాదికి 1155.77 కోట్ల రూపాయలు మద్యం తాగారంటే కడప కు ఏస్థాయిలో మత్తెక్కించారో ఊహించ వచ్చు.

*ఒక్క నెలలో 11.66 లక్షల బీర్లు గుట గుట 

వేసవి తాపం తీరేలా చిల్డ్ చిల్డ గా గుట గుట బీర్లు తాగేశారు. గత నెల లో ముదిరిన ఎండలు బీర్లకు బలే గిరాకీ తెచ్చాయి. ఈ మర్చ నెలలో జిల్లాలో 97424 కేసులు అంటే 1168088 బీర్లు తాగేశారు. ఫిబ్రవరి వారిలో 66965 కేసుల బీర్లు‌ అమ్మకాలు జరిగితే మార్చి లో అంతకు మించి 32759 బీర్లు అదనంగా అమ్మకాలు జరిగాయి.

​నియోజకవర్గాల వారీగా 'మత్తు' లెక్కలు (మార్చి నెల గణాంకాలు):
​జిల్లాలోని ప్రధాన కేంద్రాల్లో మద్యం విక్రయాల సరళిని పరిశీలిస్తే, పట్టణ ప్రాంతాల్లో వినియోగం అత్యధికంగా ఉంది. ఒక్క మార్చి నెలలోనే 101 కోట్ల రూపాయలు వ్యాపారం జరిగింది.ఏప్రిల్ ఒకటి నుండి మొదలైన 2026- 27 ఆర్థిక సంవత్సరంలో మరెంత స్థాయిలో మద్యం మత్తు కడప ను ముంచెత్తిందో చూడాలి.
 

By
en-us Political News

  
కృత్రిమ మేధ (AI) దుర్వినియోగం, ముఖ్యంగా డీప్‌ఫేక్ వీడియోల సృష్టి మరియు వ్యాప్తిపై గుజరాత్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
కూట‌మి ప్ర‌భుత్వం కృషితో క్రీడావికాసం సాధ్య‌మ‌వుతోంద‌ని మంత్రి నారా లోకేష్ అన్నారు.
రాజ్యాంగం అమలులోకి వచ్చిన సమయంలో ఉన్న సామాజిక పరిస్థితులు వేరు, ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు వేరని వారు వాదిస్తున్నారు. కులాన్ని మాత్రమే ప్రాతిపదికగా తీసుకోవడం వల్ల, అగ్రవర్ణాల్లోని నిరుపేదలకు అన్యాయం జరుగుతోందన్న ఆవేదన వారి వాదనలో వ్యక్తమవుతోంది. ఆర్థిక అసమానతల అంశంపై చర్చ తీవ్రమవుతున్న తరుణంలో.. కులం కంటే ఆర్థిక స్థితే ముఖ్యం అనే నినాదం బలంగా వినిపిస్తోంది.
ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ వరుస విజయాలతో ఫామ్‌లోకి వచ్చినప్పటికీ, జట్టు ఫీల్డింగ్ ప్రమాణాలు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి.
మీసేవ కార్యాలయాల్లో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక సోదాలు చేపట్టారు.
అథ్లెటిక్స్ ప్రపంచంలో పరుగు అంటేనే గుర్తొచ్చే పేరు ఉసేన్ బోల్ట్. ఆయన సృష్టించిన రికార్డులు దశాబ్ద కాలంగా ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాయి.
ఇరాన్ తో అమెరికా యుద్ధం అన్నది ఒక పెద్ద వ్యూహంలో చిన్న ఆటవిడుపు మాత్రమే అంటున్నారు అంతర్జాతీయ వ్యూహకర్తలు. ప్రస్తుతం జరుగుతున్నవన్నీ, ఒక భారీ వ్యూహంలో భాగమైన చిన్న చిన్న ఘర్షణలు మాత్రమేనని విశ్లేషిస్తున్నారు. అసలు సిసలు యుద్ధం అగ్రరాజ్యం అమెరికాకు, వేగంగా పురోగమిస్తూ.. అమెరికా ఆధిపత్యానికి గండి కొడుతున్న చైనాకు మధ్య జరుగుతోంది.
రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి 90రోజుల కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
వెనిజులాలో రాజకీయ మార్పులు అక్కడి నుంచి చమురు సరఫరా అంతరాయం. ఇరాన్ లో ఘర్షణలు, చమురు ఎగుమతులు దెబ్బతినడం. రష్యాపై ఆంక్షలు, సరఫరా పరిమితి, సౌదీ ఉత్పత్తి తగ్గుదల, ధరలు పెరుగుదల. వీటి ఫలితంగా.. చైనా రోజువారీ చమురు దిగుమతుల్లో 20 శాతం తగ్గుదల. ఇది చైనా ఆర్థిక ఇంజిన్ కు పెద్ద దెబ్బ.
కాకినాడ పోలీసులు ప్రత్యేక బృందాలతో అతని ఫోన్ లొకేషన్‌ను ట్రేస్ చేసి మంగళవారం తన తండ్రితో కలిసి ఒక పార్కులో ఉన్న సమయంలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణ కోసం కాకినాడకు తరలించినట్టు తెలుస్తోంది.
రోహిత్ , రితేష్ బ్యాంక్ ఖాతా నుంచి కేదార్‌కు రూ.25 లక్షలు బదిలీ అయినట్టు గుర్తించారు. ఈ భారీ లావాదేవీపై విచారణ జరిపినప్పుడు.. కేదార్‌తో ఉన్న సంబంధాలపై రోహిత్ రెడ్డి, రితేష్ ఇచ్చిన సమాధానాలు ఒకదాని కొకటి పొంతన లేకుండా ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు.
ఈ కేసులో కీలక వ్యక్తిగా ఉన్న మధు అప్రూవర్‌గా మారి వెల్లడించిన విషయాలు సంచలనంగా మారాయి. మంగ్లీకి ఈ వ్యవహా రంతో ఎలాంటి సంబంధం లేదని మధు స్పష్టంగా పేర్కొన్నాడు. అసలు మోసం చేసిన వ్యక్తి హిమాకాంత్ రెడ్డి అని మధు ఆరోపించారు. కంపెనీలో పెట్టిన దాదాపు రూ.20 కోట్లు హిమాకాంత్ రెడ్డి తీసుకున్నాడని మధు ఆరోపించారు.
ఐపీఎల్ వంటి అగ్రశ్రేణి వేదికపై ఒక్క రాత్రిలో స్టార్లుగా మారే ఆటగాళ్ల వెనుక ఎన్నో కన్నీటి గాథలు, కఠిన శ్రమ దాగి ఉంటాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.