ఉద్రిక్తతకు దారి తీసిన ఘటన ఒకటి హైదరాబాద్‌లో శనివారం (ఏప్రిల్ 4) ఉదయం జరిగింది. ఎల్‌బీ నగర్ సమీపంలోని చింతల్‌కుంట ప్రాంతంలో ఉన్న ప్రసార భారతి రేడియో టవర్‌పై ఓ వ్యక్తి ఎక్కి నానా రచ్చ రచ్చ చేశాడు. అది చూసిన స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురై వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. జానీ అనే వ్యక్తి రేడియో టవర్ ఎక్కి ముఖ్యమంత్రితో మాట్లాడే వరకు దిగనే దిగను అంటు హల్ చల్ చేశాడు. జానీ ఆటో నడుపుకుంటూ జీవనోపాధి కొనసాగి స్తున్నాడు. గ్యాస్ సమస్య కారణంగా ఆటో సరిగా నడపలేకపోతున్నానని దీంతో తాను తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటు న్నానొ ఆవేదన వ్యక్తం చేశాడు.
ఈ సమస్యపై నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో మాట్లా డాలని కోరాడు. అందుకే తాను టవర్ ఎక్కినట్లుగా పోలీసులకు తెలిపాడు . టవర్ ఎక్కే ముందు తన ఆటోను కింద పార్క్ చేసి పైకి ఎక్కినట్టుగా పోలీసులు గుర్తించారు.టవర్‌పైకి ఎక్కిన అనంతరం అతను డయల్-100కు కాల్ చేసి తన పరిస్థితిని తెలియ జేసినట్టు అధికారులు చెబుతున్నారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే వనస్థలిపురం పోలీసులు, హైడ్రా సిబ్బంది, అగ్నిమాపక దళాలు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపుచేసి ఆటో డ్రైవర్ జానీతో సంప్రదింపులు జరిపారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/auto-driver-climbs-36-216682.html
సైబర్ క్రైమ్ బృందం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నెట్‌వర్క్ నిఘా, ఐఎంఈఐ ట్రేసింగ్ వంటి పద్ధతులను వినియోగించి ఈ ఫోన్లను గుర్తించి స్వాధీనం చేసుకుంది.
గోదాములో ఉన్న ప్లాస్టిక్ డెకరేషన్ వస్తువులు, ఫ్లెక్సీలు, థర్మాకోల్ సామాగ్రి పెద్ద మొత్తంలో ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతూ కొద్దిసేపటికే గోదాం పక్కనే ఉన్న నివాస గృహానికి కూడా వ్యాపించడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది.
మొజ్తబా ఖమేనీ.. కుటుంబంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అత్యంత విషాదకరంగా, గందరగోళంగా ఉన్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఉన్న సమాచారాన్ని బట్టీ చూస్తే.. ఫిబ్రవరి 28న జరిగిన దాడిలో.. ఇరాన్ సీనియర్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ.. చనిపోయిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఇరాన్ సుప్రీం లీడర్ గా ఖమేనీ కుమారుడు మోజ్తబా ఖమేనీ ఉన్నారు. అయితే ఆయన ప్రస్తుతం కోమ్ నగరంలోని ఒక ఆస్పత్రిలో అపస్మారక స్థితిలో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది.
ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో బుధవారం (ఏప్రిల్ 8) రాష్ట్ర సచివాలయంలో భేటీ అయ్యింది. ఈ సందర్భంగా ఆ బృందం అమరావతి నిర్మాణ ప్రగతిని ప్రశంసించింది.
జాబిల్లి యాత్రలో ఐఫోన్ల సందడి.. అంతరిక్షంలో ఆపిల్ స్మార్ట్‌ఫోన్ల ప్రయోగం సక్సెస్!
అస్సాం ముఖ్యమంత్రి హిమాంత బిస్వా శర్మ భార్యపై కాంగ్రెస్ నేత పవన్ ఖేరా చేసిన వివాదాస్పద వ్యాఖ్యల
రేణుక, మంద కృష్ణ ఇద్దరూ ఫైర్ బ్రాండ్లు కులం మెచ్చిన సామాజిక వీరులు
సోషల్ మీడియా వేదికలో అభ్యంతరకరంగా, దూషణాత్మకంగా వ్యాఖ్యలు పోస్టు చేసిన వ్యక్తిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.
హైదరాబాద్ నగరంలో బుధవారం సాయంత్రం జలవిహార్ వద్ద ఉన్న నీటి సరఫరా ఆర్వో ప్లాంట్‌లో అకస్మాత్తుగా పేలుడు సంభవించింది.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త అందించింది.
మాములుగా దక్షిణాదిలో అత్యంత సంపన్న పొలిటీషియన్లలో విజయ్ కూడా ఒకరు.
20వ శతాబ్దం మధ్య నుంచి 21వ శతాబ్దం వరకు ప్రపంచ రాజకీయాల్లో ఒక నిరంతర ప్రభావశక్తిగా నిలిచింది అమెరికా.
ఇప్పుడు అమరావతికి చట్టబద్ధత విషయంలో కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ మౌనంగానే ఉండిపోయి ప్రేక్షకపాత్ర పోషిస్తున్నది. ఎందుకంటే.. అమరావతిని రాజధానిగా జగన్ వ్యతిరేకిస్తున్నారు కనుక. సపోజ్ ఫర్ సపోజ్ రేపు ఆయన అధికారంలోకి వస్తే అమరావతికి మద్దతుగా మాట్లాడిన వారిపై ప్రతీకార చర్యలకు దిగుతారన్న భయమే అందుకు కారణంగా కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.