అవి విష వృక్షాలు.. ప్రాణాలకు ముప్పు!

Publish Date:Mar 31, 2025

Advertisement

వరసగా పదేళ్ళ పాటు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాల్లో హరిత హారం కార్యక్రమం ఒకటి. బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ప్రాజెక్టులకు ఎంత  ప్రాధాన్యత ఇచ్చిందో, హరిత హారం ప్రాజెక్టుకు  కూడా అంతే  ప్రాధాన్యత ఇచ్చింది. రాష్ట్రంలో పచ్చదనాన్నిపెంచాలనే లక్ష్యంతో 2015 లో ముఖ్యమంత్రి కల్వకుట్ల చంద్రశేఖర రావు స్వహస్తాలతో  చిలుకూరు బాలాజీ సన్నిధిలో ప్రారంభించిన హరిత హరం పథకాన్ని  బీఆర్ఎస్ ప్రభుత్వం చివరి వరకూ కొనసాగించింది.  ప్రతి సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా టార్గెట్స్  ఫిక్స్  చేసుకుని మరీ కోట్లలో మొక్కలు నాటారు. వేల కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చయ్యింది. 

అవును  అధికారిక లెక్కల ప్రకారమే  2023 జూన్ నాటికి తెలంగాణ హరితహారం కార్యక్రమానికి ప్రభుత్వం రూ. 10,822 కోట్లు ఖర్చు చేసింది. మొత్తం 273.33 కోట్ల మొక్కలు నాటింది. అయితే  ముఖ్యమంత్రి మానస పుత్రికగా  ప్రచారం చేసుకున్న  హరిత హారం ప్రాజక్ట్  ఆశించిన లక్ష్యం నెరవేరిందా? అంటే అనుమానమే అన్న సమాధానమే వస్తున్నది.   అయితే  ప్రభుత్వ లెక్కల ప్రకారం పదేళ్ళ కాలంలో  13,657 ఎకరాల విస్తీర్ణంలో 19,472 పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు జరిగింది. 6,298 ఎకరాల విస్తీర్ణంలో 2,011 బృహత్‌ ప్రకృతి వనాలు ఏర్పాటయ్యాయి. 1,00,691 కిలో మీటర్ల మేర రాష్ట్రం అంతటా రహదారి వనాలు విస్తరించాయి.  ఈ లెక్కలు చక్కగా ఉన్నాయి. అందుకే, అప్పుడే కాదు.. ఇప్పటికీ బీఆర్ఎస్  తెలంగాణ హరిత హారాన్ని తమ పదేళ్ళ పాలన సాధించిన విజయ హారం గా పేర్కొంటున్నారు.

రెండు మూడు రోజుల క్రితం ముగిసిన తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాల్లోనూ, మాజీ మంత్రి  బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తమ ప్రభుత్వ హయాంలో 200 కోట్ల మొక్కలు నాటామని దీనివల్ల రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం 7 శాతం పెరిగిందని చెప్పారు. అయితే ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది  అన్నట్లుగా  ప్రశాంత రెడ్డి ప్రసంగం పూర్తి కాకముందే   స్పీకర్ గడ్డం ప్రసాద్ హరిత హారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కల్లో ప్రజలకు పక్షులు, ఇతర జీవరాసులకు హాని కలిగించే కోనోకార్పస్ చెట్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయని వాటిని తక్షణమే తొలగించాలని ప్రభుత్వానికి సూచించారు. ఈ చెట్లు  వృక్ష ధర్మానికి విరుద్ధంగా, ఆక్సిజన్  గ్రహించి, కార్బన్ డయాక్సైడ్ ను విడుదల చేస్తాయని, వాతావరణాన్ని విష పూరితం చేస్తున్నాయని స్పీకర్ వివరించారు. ఈ కారణంగా  పక్షులు, ఇతర జీవుల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయని  వివరించారు. 

అదలా ఉంటే,  తాజాగా హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం సమీపంలో 400 ఎకరాల భూమిని వేలం వేయాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపధ్యంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, హరిత విధ్వంసంలో కాంగ్రెస్ ప్రభుత్వం, గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో పోటీ పడుతోందని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం కోసం భారాస 25 లక్షల చెట్లను నరికి వేయడంతో పాటుగా, హరితహారం ముసుగులో కోనోకార్పస్‌ను విష వృక్షాలను కానుకగా ఇస్తే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం సమీపంలో ‘కంచ గచ్చిబౌలిలో ఏకంగా 400 ఎకరాల భూమిని టీజీఐఐసీ ద్వారా వేలం వేసి  పర్యావరణానికి పాతర వేస్తోందని అరోపించారు. ప్రభుత్వం వేలం వేయాలనుకుంటున్న భూమిని ఆనుకుని చాలా వృక్ష జాతులు, పక్షిజాతులతో సహా నెమళ్లు, వలస పక్షులు, జింకలు, అడవి పందులు, కొండ చిలువలు, నక్షత్ర తాబేళ్లు వంటి వైవిధ్యభరితమైన జీవజాతులు ఉన్నాయని బండి సంజయ్  చెబుతున్నారు. 
సంజయ్ ఆరోపణల విషయం ఎలా ఉన్నా..  స్పీకర్ సూచనను   ప్రభుతం సీరియస్  తీసుకుని కోనోకార్పస్‌  విష వృక్షాల నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని ప్రజలు, పర్యావరణ శాస్త్ర వేత్తలు, ప్రకృతి ప్రేమికులు కోరుకుంటున్నారు.

By
en-us Political News

  
బంగారం ప్రియులకు ఇది షాకింగ్ న్యూస్. ఇక పసిడి కోనుగోలు చేయాలంటే సామాన్య ప్రజలకు మరింత కష్టతరం అవుతోంది. రోజురోజుకి గోల్డ్ రేటు అకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా బంగారం ధరకి మరోసారి రెక్కలు వచ్చాయి. 10 గ్రాముల బంగారం ధర పన్నులతో కలిసి అక్షరాల లక్ష రూపాయిలను తాకింది. దేశంలో బంగారం ధర ఈ స్థాయిని అందుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. సోమవారం ఉదయం రూ.98,350 ఉన్న24 క్యారెట్ల గోల్డ్ తులం రేటు సాయంత్రం 5.30 గంటల సమయానికి రూ.1,00,016కు చేరింది. శుక్రవారం ముగింపుతో పోలిస్తే దాదాపు రూ.2వేలు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు 3,393 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అమెరికా- చైనాల మధ్య వాణిజ్యం విషయంలో సయోధ్య కుదిరేంతవరకు ఇదే పరిస్థితి కొనసాగొచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరావు వైసీపీకి రాజీనామా చేసి జనసేన గూటికి చేరారు. ఆయన చేరిక అప్పట్లో వివాదాస్పదంగా మారింది. ఆయన జనసేన చేరికను తెలుగుదేశం గట్టిగా వ్యతిరేకించింది. బాలినేని చేరిక సందర్కభంగా ఒంగోలులో పలు చోట్ల ఆయన అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కొందరు ధ్వంసం చేశారు. ఇక అటు జనసేనలో కూడా అప్పట్లో ఆయన చేరిక పట్ల వ్యతిరేకత వ్యక్తమైంది. వైసీపీ అధినేత జగన్ కు బంధువు కావడం, ఆయన చేరికతో వైసీపీ నుంచి పలువురు ఆయన అనుచరులు కూడా వచ్చి చేరే అవకాశాలు ఉండటంతోనే అప్పట్లో బాలినేనిని తెలుగుదేశం, జనసేనలు వ్యతిరేకించాయి.
ఆవిర్భావం నుంచి తెలుగుదేశం కార్యకర్తల పార్టీయే. ఎన్ని సంక్షోభాలు ఎదురైనా పార్టీకి అండగా కార్యకర్తలు నిలబడి పార్టీని నిలబెట్టుకున్న పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం మాత్రమే. అదే విధంగా తెలుగుదేశం పార్టీ కూడా తొలి నుంచీ కార్యకర్తల సంక్షుమానికే పెద్ద పీట వేస్తూ వస్తున్నది అనడంలో సందేహం లేదు.
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీపై డ్రోన్ ఎగురవేసినందుకు కేటీఆర్‌తో పాటు మరికొంతమందిపై మహాదేవ్‌పూర్‌ పీఎస్‌లో నమోదైన కేసును హైకోర్టు కొట్టివేసింది. అనుమతి లేకుండా ప్రాజెక్టును సందర్శించడంతో పాటు డ్రోన్ ఎగురవేశారని ఇరిగేషన్ అధికారి ఫిర్యాదు మేరకు పలు సెక్షన్లు కింద మహాదేవ్‌పూర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. మేడిగడ్డ బ్యారేజీ నిషిద్ధ ప్రాంతమేమీ కాదని కేటీఆర్ న్యాయవాది టీవీ రమణారావు అన్నారు. రాజకీయ కక్ష్యల కారణంగానే కేసు నమోదు చేశారని ఆయన కోర్టుకు తెలిపారు. డ్రోన్ ఎగురవేయడం డ్యాం భద్రతకే ప్రమాదమన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇరువైపులా వాదనలు ముగిసియి. మరోవైపు ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉట్నూరు పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్ఐఆర్‌ను న్యాయస్థానం కొట్టివేసింది.
హైదరాబాద్‌లో మత్తు ఇంజెక్షన్ తీసుకుని ఇంటర్ విద్యార్థి మృతి చెందాడు. బాలానగర్‌లో ముగ్గురు ఇంటర్మీడియట్ విద్యార్థులు మత్తు కోసం మెడికల్ డ్రగ్స్ తీసుకున్నారు. ఇంజెక్షన్ తో పాటు ట్యాబ్లెట్లు కూడా ఒకేసారి తీసుకున్నారు. దీంతో డోస్ ఎక్కువైంది. ఈ క్రమంలో ఓ అబ్దుల్ నాసర్ అనే విద్యార్థి మృతి చెందాడు. మరో ఇద్దరు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. హైదరాబాద్‌లో కొందరు యువకులు మత్తు ఇంజెక్షన్‌లు, మరియు డ్రగ్స్ సొంతగా వినియోగించడమే కాకుండా ఇతరులకు అమ్ముతున్నారని పోలీసులు తెలిపారు. రాష్ట్రంలో డ్రగ్స్ వినియోగిస్తున్న, సరఫరా చేస్తున్న వారిలో ఎక్కువగా విద్యార్థులే ఉంటున్నారని ఇటీవల గణాంకాలు వెల్లడించిన విషయం తెలిసిందే
తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించి ఉద్యోగం సంపాదించిన వ్యవహారంలో మాజీ ప్రొబెషనరీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్‌పై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసుపై తాజాగా విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు మే 2వ తేదీన ఢిల్లీ పోలీసుల ముందు విచారణకు హాజరుకావాలని ఆమెను ఆదేశించింది. జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్‌ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ఈ కేసు తదుపరి విచారణను మే 21వ తేదీకి వాయిదా వేసింది.
విజయవాడ జిల్లా జైల్లో గత రెండు నెలలుగా రిమాండ్‌ ఖైదీగా ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి హైకోర్టులో మరో సారి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసుకున్న బెయిలు పిటిషన్ ను కోర్టు వారం రోజులకు వాయిదా వేసింది.
తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ హైకోర్టులో రూ.25 లక్షల డీడీ అందజేశారు. జర్మనీ పౌరసత్వం ఉండి చెన్నమనేని ఎమ్మెల్యేగా పోటీ చేశారు. గతంలో ఆది శ్రీనివాస్‌ తెలంగాణ హైకోర్టు లో పిటిషన్‌ దాఖలు చేశారు. జర్మనీ పౌరసత్వం కలిగి ఉండి తప్పుడు పత్రాలతో ఎన్నికల్లో పోటీ చేశారని.. ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ అంశంపై కోర్టులో ఆది శ్రీనివాస్‌ సుదీర్ఘ కాలం పోరాడారు. పలు దఫాలుగా విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. చెన్నమనేని రమేశ్‌కు జర్మనీ పౌరసత్వం ఉన్నట్లు గతేడాది డిసెంబర్‌లో తేల్చింది.
తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జన్మదినం సందర్భంగా ఊహించని ప్రత్యర్థులు విషెస్ చెప్పడం ఆసక్తి రేపుతోంది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ దగ్గర నుంచి ఏపీ మాజీ సీఎం జగన్ సహా పలువురు చంద్రబాబుకి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని వైసీపీ అధినేత జగన్ ఆకాంక్షించారు.
కేథలిక్ మత గురువు పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వాటికన్ సిటీలో తన నివాసంలో సోమవారం (ఏప్రిల్ 21) ఉదయం కన్నుమూశారు. వాటికన్ కామెరెంగో కార్డినల్ కెవిన్ ఫెర్రెల్ ఈ విషయాన్నిధృవీకరించారు.
బీజేపీకి ప్రాతినిథ్యం వ‌హించే స్వామి.. చంద్ర‌బాబు, ప‌వ‌న్.. త‌మ కూట‌మిలో భాగ‌స్వామ్యం అన్న క‌నీస జ్ణానం కూడా లేకుండానే కామెంట్లు ఎందుకు చేస్తుంటారో అర్ధం కాదు.. తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించ‌డం మాత్ర‌మే కాకుండా.. ఆపై కేసులు కూడా వేస్తుంటారు.
మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డిలను పెను ప్రమాదం తప్పింది. నిజామాబాద్ లో నిర్వహిస్తున్న రైతు మహోత్సవ వేడుకలలో పాల్గొనేందుకు హెలికాప్టర్ లో ఈ ముగ్గురు మంత్రులూ వెళ్లారు.
నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌గాంధీ పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చార్జిషీట్‌ దాఖలు చేసింది. నిజానికి ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్లో సోనియా, రాహుల్ గాంధీలతో పాటుగా, శ్యామ్ పిట్రోడా, ఆస్కార్ ఫెర్నాండెజ్ పేర్లు కూడా ఉన్నాయి. అయినా ఫోకస్ అంతా ఈ ఇద్దరిపైనే తప్ప మిగిలిన ఇద్దరినీ ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.