ఆంధ్రప్రదేశ్ లో బుధవారం (జనవరి 7) తెల్లవారు జామున ఓ ప్రైవేటు బస్సు దగ్ధమైంది. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు ఫ్లైఓవర్ బ్రిడ్జిపై జరిగింది. ఖమ్మం నుండి విశాఖపట్నం వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
బస్సు కొవ్వూరు ఫ్లైఓవర్‌పైకి చేరుకున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మంటలను గుర్తించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బస్సును నిలిపివేసి ప్రయాణీకులను కిందకు దింపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. సంఘటన జరిగిన సమయంలో బస్సులో ఆరుగురు ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారు. వీరంతా సురక్షితంగా బయటపడ్డారు.
సమాచారం అందుకున్న స్థానిక అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అనంతరం ప్రయాణికులను వేరే బస్సులో గమ్యస్థానాలకు తరలించారు. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధమైంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/private-travel-bus-burnt-36-212125.html
పులికాట్ సరస్సు వద్ద సందర్శకులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. పర్యాటక అభివృద్ధి లక్ష్యంతో ఈ ఫ్లెమింగో ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
అనంతపురం జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ కలకలం రేపింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తును మరింత వేగవంతం చేసింది.
హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో అర్ధరాత్రి వేళ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
టీడీపీ ఎంపీల పనితీరు శాతంలో ఎంత పెరుగుదల ఉందో తెలీదు.
హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఆయన చేసిన వ్యాఖ్యలపై ఓ మహిళ మండి పడ్డారు. తనకు అనుమతిస్తే యూట్యూబర్ అన్వేష్ ను భరతమాత కాళ్ల దగ్గరకు తీసుకొచ్చి పడేస్తానంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతున్నాయి.
వైసీపీ మీడియా ప్రతినిధులతో పాటు తిరుపతిలోని వైసీపీ నేతలే ఈ కుట్రను అమలు చేసినట్టు పోలీసులకు ఆధారాలు లభించాయి. ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు కమాండ్ కంట్రోల్ తో పాటు, వివిధ ప్రదేశాలలో సిసి కెమెరాలు పరిశీలించారు.
విశాఖపట్నం స్టీల్ ప్టాంట్ ప్రైవేటీకరణ జరగదని మంత్రి నారా లోకేశ్ పునరుద్ఘాటించారు.
తెలంగాణలో 20 మంది ఐపీఎస్‌లు బదిలీలు అయ్యారు.
హైదరాబాద్‌లో జరుగుతున్న ఆహార కల్తీపై కఠిన చర్యలు తప్పవని సీపీ సజ్జనార్ హెచ్చరించారు.
జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు దిల్‍సుఖ్‍నగర్‌లో రోడ్డెక్కారు.
హైదరాబాద్ నగరంలోని సిలికాన్ సిటీగా పేరొందిన గచ్చిబౌలి ప్రాంతం మరోసారి మత్తు మాయాజాలానికి వేదికగా మారింది.
రెడ్డెప్పగారి మాధవీ రెడ్డి.. కడప ఎమ్మెల్యే గా గెలిచిన రోజు నుంచి జిల్లా రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుఉన్నారు