ప్రణబ్ బడ్జెట్..లగ్జరీ మరింత ప్రియం

Publish Date:Mar 16, 2012

Advertisement

న్యూఢిల్లీ: ఎక్సైజ్ డ్యూటీని 22 శాతం నుంచి 24 శాతానికి పెంచుతున్నట్టు ఆర్దికశాఖా మంత్రి ప్రణబ్ ముఖర్జీ ప్రకటించారు. దీంతో కార్లు, ఎలక్ట్రానిక్ ఉపకరణాల ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇకపై లగ్జరీ వస్తువులు, హోటల్లో భోజనం, విందు-వినోదాలు, విమానాల్లో ప్రయాణాలు మరింత ప్రియమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు సర్వీస్ టాక్స్‌ను పెంచడంద్వారా 19 వేల కోట్లరూపాయల ఆదాయాన్ని ప్రభుత్వం సమకూర్చనుంది. ఈ మేరకు సేవాపన్నును 10 నుంచి 12 శాతానికి పెంచారు. ఫలితంగా మొబైల్ బిల్లుల ధరలు కూడా పెరగనున్నాయి.

ఉద్యోగులను ఊరిస్తున్న ఆదాయ పన్ను పరిమితి పెంపుపై ప్రణబ్ బడ్జెట్‌లో ప్రస్తావించారు. పన్ను పరిమితిని 2 లక్షల రూపాయలకు పెంచుతున్నట్టు ఆయన చెప్పారు. రూ.2 లక్షల నండి రూ.5 లక్షల వరకు ఆదాయంపై పది శాతం పన్ను, రూ.5 లక్షల నుండి రూ.పది లక్షల వరకు ఆదాయంపై 20 శాతం పన్ను, పది లక్షలకు పైబడి ఆదాయంపై 30 శాతం పన్ను విధించనున్నట్లు ఆయన తెలిపారు. ఎస్‌బి ఖాతాలో రూ.10వేల ఖాతాపై పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఎస్‌బి ఖాతాలపై పదివేలమదుపుపై పన్ను మినహాయింపును ఆయన ప్రకటించారు. వృద్ధులకు, మహిళలకు గరిష్ట ఆదాయం పన్ను పరిమితిని రూ. 2 లక్షలుగా నిర్ధారించారు. పరిశ్రమలకు పన్ను మినహాయింపు కోసం టర్నోవర్ పరిమితి కోటి రూపాయలకు పెంచారు. కార్పొరేట్ పన్ను యధాతథంగా ఉంచారు. రూ. 2 లక్షల బంగారం కొనుగోళ్లపై తక్షణ టిడిఎస్ ఉంటుందని చెప్పారు. సినీ రంగానికి సేవా పన్ను మినహాయించారు. సర్వీస్ టాక్స్, సెంట్రల్ ఎక్స్జైజ్‌కు కామన్ కోడ్ అమలు చేస్తామని చెప్పారు. సేవా పన్ను పరిధి నుంచి విద్య, ప్రభుత్వ సేవలు, వినోదం వంటి 17 సేవలను మినహాయించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు ఆయన ప్రత్యేక నిధులు కేటాయించారు. కేరళ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి వంద కోట్ల రూపాయలు సమకూర్చనున్నట్లు ఆయన తెలిపారు. అలాగే హైదరాబాదులోని ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి వంద కోట్ల రూపాయల నిధిని సమకూరుస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ కేటాయిస్తున్నట్టు ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ చెప్పారు. అలాగే, గుంటూరుతోపాటు ప్రకాశం జిల్లాలోనూ చేనేత సముదాయాలు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. బడ్జెట్‌లోని ఇతర విషయాలు ప్రస్తావిస్తూ విమాన ఇంధనాన్ని ఇకపై నేరుగా విదేశాల నుంచి కొనుగోలు చేసేందుకు నిర్ణయించామని పేర్కొన్నారు. రిటైల్ ఇన్వెస్టర్లకు 50 వేల రూపాయల పన్ను మినహాయింపు కల్పిస్తున్నామన్నారు.

తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న విమానయాన సంస్థ కింగ్‌ఫిషర్‌కు ఆర్థిక మంత్రి ప్రణబ్ బడ్జెట్ ప్రసంగంద్వారా తీపి కబురు అందించారు. ఈ ఏడాది విమానయాన రంగంలో 100 కోట్ల డాలర్ల వరకు విదేశీ రుణాన్ని తీసుకునేందుకు అనుమతి ఇవ్వనున్నట్టు ఆయన తెలిపారు.

దేశంలో విద్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రాముఖ్యత ఇస్తోందని ప్రణబ్ అన్నారు. ఈ క్రమంలో సర్వశిక్షా అభియాన్ పథకానికి 25,555 కోట్ల రూపాయలు, ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయానికి 100 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టు తెలిపారు.

దేశంలో కొత్తగా 8800 కిలోమీటర్ల మేర హైవేలు నిర్మించి రవాణా సదుపాయాలు మెరుగు పరుస్తామన్నారు. వచ్చే దశాబ్దంలో వ్యవసాయాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.

దేశంలో ఉన్న వితంతువులు, వికలాంగులకు ప్రస్తుతం ఇస్తున్న పింఛన్ మొత్తం 200 రూపాయల నుంచి 300 రూపాయలకు పెంచుతున్నట్టు ప్రణబ్ తెలిపారు. అలాగే చేనేత కార్మికులకు 388ల కోట్ల రూపాయల మేర వడ్డీ మాఫీ చేస్తున్నట్టు ఆయన చెప్పారు. వ్యవసాయ రుణాలను ఈ ఏడాది 5.75 లక్షల కోట్ల వరకు అందిస్తామన్నారు. చేపల పెంపకానికి 500 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. గిడ్డంగుల కోసం 5 వేల కోట్లు సమకూరుస్తామన్నారు.

By
en-us Political News

  
తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వంతో త్వరగా అంగీకారం కుదిరేలా చర్యలు తీసుకుని, అనుమతులు ఇప్పించాలని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ను
JNTU కాలేజీలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది.
సికింద్రాబాద్ బొల్లారం పరిధిలో జరిగిన సంచలనాత్మక ఆర్మీ ఆయుధాల చోరీ ఉదంతం తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
స్థానిక సమస్యలను క్షేత్రస్థాయిలో  తెలుసుకునేందుకు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే  కోమటిరెడ్డి  రాజగోపాల్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. కారు వదిలేసి ద్విచ్రవాహనంపై మునుగోడు వీధుల్లో  ఆయన పర్యటించారు.
ఆర్థిక నేర ఆరోపణలు, అవినీతి అభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తులు విచారణను ఎదుర్కొనేందుకు అందుబాటులో లేకుండా విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని పేర్కొంటూ..  వారి పాస్‌పోర్ట్‌లను నిలిపివేయాలని ఏసీబీ పిటిషన్ దాఖలు చేసింది.
తెలంగాణలో వైద్య విద్య ప్రవేశాలకు సంబంధించిన లోకల్ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక స్పష్టత ఇచ్చింది.
తెలంగాణ సచివాలయంలో సోమవారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.
గ్రేటర్   పరిధిలో బీఆర్ఎస్ కు చెందిన  పలువురు  ఎమ్మెల్యేలు, జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లు కాంగ్రెస్ లోకి జంప్ చేశారు.  దానం నాగేందర్, వివేకానంద వంటి నేతల ఫిరాయింపులు పార్టీ కేడర్‌లో నిరుత్సాహాన్ని నింపాయి.
పదేళ్లుగా పక్కింటివారిలా పరిచయం.. మెల్లిగా చీటీలతో నమ్మకం సంపాదించారు.. ఆ నమ్మకంతోనే ఒక్కొక్కరి నుంచి భారీగా డబ్బులు తీసుకున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన ఉల్లాస్ పరీక్షకు హాజరవుతున్న లక్షలాది మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు మంత్రి సీతక్క అభినందనలు తెలిపారు.
పోయింది అధికారం మాత్రమే.. కేసీఆర్‌పై అభిమానం తగ్గలేదు.!
గడ్డిపోచలు కూడా గడ్డపారలుగా మారుతాయి..!
గణేష్‌ నిమజ్జనం సందర్భంగా పోలీసుల బందోబస్తు కొనసాగుతుండగా.. అల్మాస్‌గూడలో అర్ధరాత్రి కొందరు వ్యక్తులు హల్‌చల్‌ చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.