కిరణ్‌ సర్కార్‌కు ముప్పుగా మారిన పవర్‌ కట్స్‌

Publish Date:Jul 12, 2012

Advertisement

ప్రభుత్యానికి ముందుచూపు లేక రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిపోయింది. చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని స్వర్ణాంద్రప్రదేశ్‌ గాను, దివంగత ముఖ్యమంత్రి హరితాంద్రప్రదేశ్‌గాను మార్చాలని ఎంతగానో ప్రయత్నించారు. అయితే ఇప్పుడున్న కిరణ్‌కుమార్‌ ప్రభుత్వం మాత్రం రాష్ట్రాన్ని అంధకారాంద్రప్రదేశ్‌ గా మార్చింది. మన రాష్ట్రానికి 11,352 మెగావాట్ల విద్యుత్‌ అవసరం వుండగా 90142 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి మాత్రమే అవుతుంది.  మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు అడ్డగోలుగా గోదావరి , కృష్ణాజలకు అడ్డుగా ప్రాజెక్టులు కట్టి  రాష్ట్రంలోకి  జలాలను రాకుండా అడ్డుకున్నారు. దీనికి తోడు వర్షాభావ పరిస్థుతులతో జలాశయాలు నిండుకోవండటంతో జల విద్యుత్‌ తగ్గిపోయింది.

 

 

 మన రాష్ట్రంలో ఉన్న బొగ్గు ఆధారిత పవర్‌ ప్లాంటులన్నీ ఎప్పటివో కాబట్టి వాటి రిపేర్లకే ఎక్కువ సమయం కేటాయించ వలసివస్తుంది. దాంతో రాష్ట్రంలో 8 ధర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలన్నుప్పటికి అవసరాలకు సరిపడా విద్యుత్‌ను   ఉత్పత్తి చేయటంలో  వెనుకబడిపోయాం. రిలయన్స్‌, గుజరాత్‌ గ్యాస్‌  సంస్థలు వారి రాష్ట్ర ప్రయోజనాలకే ఎక్కువ ప్రాముఖ్యల నిస్తూ మన రాష్ట్రవాటాగా రావలసిన భాగాన్ని రాకుండా చేస్తున్నాయి దీంతో . గ్యాస్‌ ఆధారిత విద్యుత్‌ కేంద్రాలకు గ్యాస్‌ సరఫరా సరిగా లేనంనదున విద్యుత్‌ ఉత్పత్తి మరింత తగ్గింది.  ప్రభుత్వ మెతకవైఖరే దీనికి కారణంగా చెప్పుకోవచ్చు. అధికారుల ముందుచూపులేకుండా ఇప్పుడు ఏకంగా కోతలు విధించడం విడ్డూరం. ఇదే పరిస్థితి కొనసాగితే రాష్ట్రంలో కాంగ్రెస్‌ పరిపాలన మరింత కష్టాలను ఎదుర్కోవలసివస్తుంది. ఇప్పటికే  కరెంటు కోతలవల్ల పరిశ్రమలు మూత పడ్డాయి. కార్మికులు దీంతో విపత్కర పరిస్థితులకు లోనవుతున్నారు. ఒకప్ఫుడు పరిశ్రమలు పెడతామని బారులు తీరిన పారిశ్రామిక వేత్తలంతా రాష్ట్రాన్ని వదిలి పోయారు.

 

 

పల్లెల్లో రాత్రి 6నుండి ఉదయం 6వరకు కరెంటు లేక పోవడంతో రాత్రిపూట దోమలకు బలై ప్రజలు మలేరియా, ఫైలేరియా వంటి రోగాలు పడిన పడి ఆసుపత్రులకు సమయాన్ని , ధనాన్ని వ్యయపరచవలసి వస్తుంది. డిల్లీ హైదరాబాదుకు  రాష్ట్ర ి నాయకులు ఎన్ని సార్లు తిరిగినా ఎవ్వరూ కరెంటు సమస్యపై  కేంద్రాన్ని సహాయం కోరడం జరగటం లేదు. స్వప్రయోజనాలకే ప్రాముఖ్యత నిస్తూ, ప్రజలగురించి ఆలోచించడం మానేశారు. గడచిన మూడు సంవత్సరాలనుండి సరైన నాయకత్వంలేని కారణంగా ఆంద్రప్రదేశ్‌ అన్ని రంగాలలోనూ విపరీత మైన నిర్లక్ష్యానికి గురైందనటానికి ఇదొక ఉదాహరణ. దీనివల్ల పల్లె ప్రాంతాలలో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది.హాస్పటల్‌ సేవలకు ప్రమాదం వాటిల్లుంతుంది. ప్రజారంజక ప్రభుత్వాలు కానందుకే ఇలాంటి పరిస్ధితులు దాపురించాయని ప్రజలు వాపోతున్నారు. రానున్న ఉపద్రవాన్ని పసిగట్టి ప్రత్యామ్నాయ యత్నాలుగా పవన  విద్యుత్‌ను, సోలార్‌ ఎనర్జీని ప్రమోట్‌ చేయటం  జరగలేదు. ప్రతిపక్షాలు దీన్ని ఒక అస్త్రంగా వాడుకుంటున్నాయే తప్ప ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదు. ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి పేరులోనే కిరణాలు గాని, రాష్ట్రం మొత్తం కటిక చీకటే. విద్యుత్‌ సమస్య కిరణ్‌ ప్రభుత్వ ప్రతిష్టను దారుణంగా దెబ్బతీస్తోంది. అయినా ఆయన ఏమి చేయలేని నిస్సహాయ స్దితిలో ఉన్నారు.

By
en-us Political News

  
బాసరలోని  రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం  ట్రిపుల్ ఐటీ లో అసాధారణ పరిణామాలు చోటుచేసుకున్నాయి. క్యాంపస్‌లో వేలాది మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఎల్ నినో ఎఫెక్ట్ తో అక్కడ   నీటి ఎద్దడి తీవ్రతరమైంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా, స్థానిక నీటివనరుల్లో నీటి లభ్యత లేకుండా పోయింది.
తెలంగాణ భవన్ వేదికగా జరిగిన మీడియా సమావేశంలో భారత్ రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర రాజకీయాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.
జీవితాంతం కలిసుంటామని మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన దంపతుల మధ్య వివాహేతర సంబంధం చిచ్చు పెట్టింది.
గతంలో హైదరాబాద్ నగరం తక్కువ ధరలో మెరుగైన మౌలిక వసతులతో కూడిన నివాసాలను అందించే ప్రాంతంగా ప్రత్యేక గుర్తింపు ఉండేది. కానీ ఇటీవల ప్రైమింగ్ వ్యూహాలు,  విలాసవంతమైన ప్రాజెక్టులపై రియల్టర్లు, బిల్డర్లు అతిగా దృష్టి సారించడం వల్ల ధరలు విపరీతంగా పెరిగి.. ఇళ్లు కొనుగోలు అంటేనే సాధారణ, మధ్య తరగతి, వేతన జీవులు వణికిపోయే పరిస్థితి ఏర్పడింది
వనదేవతలు పూజలందుకునే గుడిని గుర్తుతెలియని వ్యక్తులు కూల్చివేయడం పట్ల భక్తులు,  గిరిజనులు  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దసరా పండుగను తన స్వగ్రామమైన కొండారెడ్డిపల్లిలో కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకున్నారు.
అడవిలో స్వేచ్ఛగా తిరుగుతూ ప్రకృతి అందాలను పెంచే మూగజీవాలపై తుపాకీ గురిపెట్టారు.
తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన సౌలభ్యం, శాంతిభద్రతల పటిష్టత దిశగా ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది.
రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా ముంచుకొస్తున్న వాతావరణ మార్పులు, అసాధారణ వాతావరణ పరిస్థితులపై తెలంగాణ ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది.
1,000 మందికి పైగా టార్గెట్‌.. నిందితుడు అరెస్టు.!
తాజాగా వెలువడిన ఆర్థిక ఫలితాల ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మెట్రో సంస్థ భారీ మొత్తంలో లోటును చవిచూడాల్సి వచ్చింది. ప్రయాణాల ద్వారా వచ్చే ఆదాయం కంటే, రోజువారీ నిర్వహణ, ఫైనాన్స్ ఖర్చులే అధికంగా ఉండటంతో  లోటు 405 కోట్ల రూపాయలు దాటేసింది. 
తీరొక్క పూలతో కళకళలాడుతున్న మార్కెట్లు.!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.