కమ్ముకోనున్న చీకట్లు..సర్‌చార్జీ వడ్డనకు రంగం సిద్ధం

Publish Date:Jan 2, 2012

Advertisement

హైదరాబాద్: విద్యుత్ వినియోగదారులకు మరో వాత. ఇంధన సర్దుబాటు చార్జీల కింద అదనంగా సర్‌చార్జీని విధించే ప్రతిపాదనలకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపిఇఆర్‌సి) ఓకే చెప్పనుంది. ఇప్పటికే సూత్రప్రాయ అంగీకారం తెలిపినట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఈమేరకు ఏ క్షణమైనా ఆదేశాలు వెలువడే అవకాశం లేకపోలేదు. గత నెలలోనే ఏపి ట్రాన్స్‌కో, డిస్కాంలు తాము నష్టాల్లో ఉన్నామని, చార్జీల పెంచేందుకు అనుమతించాలని కోరుతూ ప్రతిపాదనలు సమర్పించిన విషయం విదితమే. ఈ అంశంపై ఏపిఇఆర్‌సి బహిరంగ విచారణ నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. మార్చి నెలాఖరున ఏపిఇఆర్‌సి చార్జీల పెంపుదలపై తన నిర్ణయం వెలువరిస్తుంది. కాగా ఇంధన సర్దుబాటు చార్జీల సంగతి ఇప్పటిది కాదు. గత మూడేళ్లుగా ఇది ఏపిఇఆర్‌సి వద్ద నలుగుతోంది. ఏపిఇఆర్‌సి అనుమతిస్తే 2.5 కోట్లకుపైగా ఉన్న విద్యుత్ వినియోగదారులపై భారం పడుతుంది. 2008-09లో 3141 కోట్ల రూపాయలు, 2009-10లో 1480 కోట్ల రూపాయలను విద్యుత్ కొనుగోళ్లకు ట్రాన్స్‌కో, డిస్కాంలు ఖర్చుపెట్టాయి. ఈ భారం తాము మోయలేమని, వినియోగదారుల నుంచి వసూలు చేస్తే తప్ప డిస్కాంలు బతకవని గత రెండేళ్లుగా ఏపిఇఆర్‌సిని కోరుతున్నాయి. ఈ అంశంపై బహిరంగ విచారణ కూడా పూర్తయింది. 2008-09కిగాను మొత్తం వ్యయంలో 502 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం భరించింది. కానీ మిగిలిన మొత్తం, 2009-10కి సంబంధించిన మొత్తాలను భరించేందుకు బడ్జెట్‌లో నిధుల్లేవని ప్రభుత్వం సూచన ప్రాయంగా చెప్పింది. ఏపిఇఆర్‌సి అన్ని కోణాల్లో నుంచి ఆలోచించి 2008-09 సంవత్సరానికి 1650 కోట్ల రూపాయలు, 2009-10కి 1460 కోట్ల రూపాయలను వినియోగదారుల నుంచి వసూలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని డిస్కాంలు కోరుతున్నాయి. కానీ రెండేళ్లకు కలిపి 2500 కోట్ల రూపాయల వరకు సర్‌చార్జీలను విధించుకునే దిశగా ఏపిఇఆర్‌సి నుంచి ఆదేశాలు వెలువడవచ్చని తెలుస్తోంది. సర్‌చార్జీకి ఏపిఇఆర్‌సి పచ్చజెండా ఇస్తే, ఈనెల నుంచి అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ట్రాన్స్‌కో వర్గాలు తెలిపాయి.


ఈ ఏడాది విద్యుత్ కోతలు విపరీతంగా ఉంటాయని ట్రాన్స్‌కో వర్గాలు తెలిపాయి. 2012-13కి 93913 మిలియన్ యూనిట్లు విద్యుత్ అవసరమని అంచనా వేశారు. ఇందులో ఉత్పత్తి, కొనుగోళ్ల ద్వారా 81464 ఎంయు విద్యుత్ లభ్యతలో ఉంది. 12,449 ఎంయు విద్యుత్‌ను ఎలా సేకరిస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ప్రస్తుతం రోజుకు 25 ఎంయు విద్యుత్ లోటుతో డిస్కాంలు విద్యుత్‌ను సరఫరా చేస్తున్నాయి. ఇది రానున్న రోజుల్లో 35 ఎంయుకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. జల విద్యుదుత్పత్తి కూడా ఆశాజనకంగా లేదు. జలాశయాల్లో నీటిలభ్యత లేదు. 2010-11లో రికార్డుస్ధాయిలో 6407 ఎంయు జల విద్యుత్‌ను ఉత్పత్తి చేయగా, 2011-12లో కేవలం 5580 ఎంయు విద్యుదుత్పత్తి సాధ్యమైంది. 2012-13లో ఇదే పరిస్ధితి కొనసాగితే ఐదు వేల ఎంయుకు మించి జల విద్యుదుత్పత్తి కాకపోవచ్చు. వచ్చే ఏడేళ్లపాటు కరెంటు లోటు పెరిగే అవకాశం ఉందని విద్యుత్ నిపుణుల అంచనా. వచ్చే ఏడేళ్లలో విద్యుత్‌లోటు 705 మెగావాట్ల నుంచి ఏడు వేల మెగావాట్ల వరకు చేరుకోవచ్చును. ప్రస్తుతం రానున్న సంవత్సరాల్లో విద్యుత్ కొరత తలెత్తకుండా ఉండేందుకు ట్రాన్స్‌కో, జెన్కో సంస్థలు 2012 నుంచి ఐదేళ్లపాటు రోజుకు రెండు వేల మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు ప్రణాళిక ఖరారు చేసుకున్నాయి. విద్యుత్ డిమాండ్ సగటున 13 శాతం పెరగడం, ఉచిత విద్యుత్, విద్యుత్ చౌర్యం, కాలానుగుణంగా సకాలంలో చార్జీలను పెంచి డిస్కాంలను ఆర్ధికంగా పటిష్టం చేయకపోవడం, రిలయన్స్ నుంచి ఆశించిన స్థాయిలో గ్యాస్ సరఫరా లేక గ్యాస్ ప్రాజెక్టుల్లో విద్యుదుత్పాదన తగ్గడం, ప్రకృతి ప్రకోపించినప్పుడల్లా కరవు సంభవించి జల విద్యుత్ ఉత్పాదన తగ్గడం, ఆశించిన స్థాయిలో విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం కొనసాగకపోవడం వల్ల రాష్ట్రంలో రానున్న రోజుల్లో ప్రతి రోజూ చీకట్లు అలుముకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

By
en-us Political News

  
ప్రభుత్వ ఉద్యోగం.. అందులోనూ కీలకమైన టౌన్ ప్లానింగ్ అధికారి బాధ్యతలు.
హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూ యూనివర్సిటీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
క్రీడా రంగానికి పెద్దపీట వేస్తూ రాష్ట్రంలో నిర్వహిస్తున్న ఖేలో ఇండియా క్రీడలు యువతలో ఉత్సాహాన్ని నింపుతాయని ప్రధాని రేవంత్ తో అన్నట్లు సమాచారం. ప్రధాని మోదీతో జరిగిన ఈ సమావేశం రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా  ప్రాధాన్యత సంతరించుకుంది.
అలాగే మాజీ సీబీఐ డైరెక్టర్ ఎం. నాగేశ్వరరావు, సజ్జనార్‌పై  బహిరంగంగా పలు ఆరోపణలు, తీవ్ర వ్యాఖ్యలు చేశారనీ,   పోలీసు యూనిఫాం వెనుక దాక్కున్న నేరస్థుడిగా ఆయన సజ్జనార్ ను అభివర్ణించారనీ తన లేఖలో పేర్కొన్న రాజాసింగ్, అటువంటి ఆరోపణలను ఎదుర్కొంటున్న సజ్జనార్ పై చర్యలు తీసుకోకుండా కేవలం బదలీతో సరిపెట్టడమేంటని నిలదీశారు.
అక్వాన్ ప్రభావం ప్రధానంగా తెలంగాణలోని తూర్పు దక్షిణ జిల్లాలపై అధికంగా ఉంటుంది. ఈ నెల 20 నుంచి 22 వరకూ అక్వాన్ ప్రభావంతో తెలంగాణలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.  
ఐదు తులాల బంగారం ఆశ.. రెండున్నర తులాల గొలుసు స్వాహా.!
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
భారత రాజకీయాల్లో దేశంలోనే అత్యంత సంపన్నుల ఎదుగుదలపై, ముఖ్యంగా పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ అసాధారణ ప్రగతిపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ సంక్షేమ కానుకను అందించేందుకు సిద్ధమైంది.
women cricketer Nandini suicide,BCCI Under 19 cricket, Vikarabad crickete, rFemale cricketer suicide
బీసీ రాజ్యాధికార పాదయాత్రలో తన వాహనాన్ని లారీ ఢీకొట్టిన ఘటనపై తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు చేశారు.
అక్రమ రవాణా ముఠాలకు సింహస్వప్నం.. వేలాది మంది బాధితులకు విముక్తి.. 2 వేల మందికి పైగా సివిల్ సర్వెంట్లకు మార్గదర్శకత్వం.
రాష్ట్రంలో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే అంశాలపై ప్రముఖులు స్పందిస్తుండడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.