రాజకీయాల ఫై నో కామెంట్ అన్న బాలయ్య
Publish Date:Jan 2, 2012
Advertisement
హైదరాబాద్: తాను ఇప్పుడు రాజకీయాలు మాట్లాడనని సినీ హీరో నందమూరి బాలకృష్ణ అన్నారు. ఆయన ఇండో అమెరికన్ ఇన్స్టిట్యూట్లో కొత్తగా ఏర్పాటు చేసిన సీవేజ్ పవర్ ప్లాంట్‌ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనను మీడియాతో మాట్లాడుతూ అందుబాటులో ఉన్న జలవనరులను అందరూ సద్వినియోగపరిచినప్పుడే నీటి లభ్యతను పెంచిన వారమవుతామన్నారు. నీటిని వృథా చేయడమంటే వాటిని దూరం చేసుకున్నట్లేనన్నారు. 2012 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు రాష్ట్ర ప్రజలకు తెలియజేశారు. ఇప్పుడు తాను రాజకీయాలు మాట్లాడదల్చుకోలేదని చెప్పారు. బసవతారకం ఆసుపత్రిలో వ్యర్థ జలాల రీసైక్లింగ్ ప్రక్రియ చేపట్టామన్నారు.
మూడు లక్షల లీటర్ల సామర్థ్యంతో దీన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ తరహా ప్లాంట్లు ప్రతిచోటా ఉంటే లక్షలాది లీటర్ల నీటిని వృథా కాకుండా కూడవచ్చునన్నారు. శ్రీరామరాజ్యం ఘన విజయం తనకు వెయ్యి ఏనుగుల బలాన్నిచ్చిందన్నారు. ఆయన సిబ్బందితో కలిసి నూతన సంవత్సరం సందర్భంగా కేక్ కట్ చేశారు. సీవేజ్ వాటర్ ప్లాంట్‌తో పాటు సెక్యూరిటీ గది, లంచ్ గదులను ఆయన ప్రారంభించారు.
http://www.teluguone.com/news/content/politics-24-10496.html





