ప్రజా సమస్యలను పక్కన పెట్టి.. రాజకీయాలను ముందుకు నెట్టి.. ఎలక్షన్ మూడ్ లో నాయకులు

Publish Date:May 12, 2022

Advertisement

తెలుగు రాష్టాల్లో ఇప్పటికిప్పుడు ఎలాంటి ఎన్నికలూ లేవు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో అధికారంలో ఉన్న పార్టీలు ముందస్తు నిర్ణయం తీసుకున్నా వచ్చే ఏడాది వరకూ ఎలక్షన్లు జరిగే అవకాశాలే లేవు. అయినా కూడా రెండు రాష్ట్రాలలో అన్ని రాజకీయ పార్టీలూ ఎన్నికల మూడ్ లోకి జారుకున్నాయి. ప్రజా సమస్యల పట్టింపే లేకుండా వ్యవహరిస్తున్నాయి. ఫోకస్ మొత్తం రాజకీయం, ఎన్నికల మీదే పెట్టేశాయి.  ప్రజలు నేతలను సమస్యలపై ప్రశ్నలు సంధిస్తున్నా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పట్టించుకునే మూడ్ లో లేవు. ముఖ్యంగా ఏపీలో అధికార వైపిపి ప్రజా సమస్యలు ప్రస్తావించే విపక్ష నేతలపై కక్షసాధింపు చర్యలకు దిగుతూ వారి ఆందోళనలు, నిరసనలను అడ్డుకోవడం,అణచి వేయడం, అరెస్టులు చేయడంలో యమా బిజీగా ఉంది. టెన్త్ ప్రశ్నపత్రాల లీకేజీ వంటి సీరియస్ ఇష్యూలను కూడా జగన్ ప్రభుత్వం లైట్ గా తీసుకుంటోంది.

దీనిని కూడా కక్ష సాధింపు చర్యలకు ఒక అవకాశంగా భావిస్తూ అరెస్టులకు పాల్పడుతోంది.  ఇక తెలంగాణ విషయానికి వచ్చే సరికి ఇక్కడ అధికార తెరాసకు దీటుగా బీజేపీ, కాంగ్రెస్ లు కూడా వరుస కార్యక్రమాలతో బిజీగా ఉంటూ రానున్న ఎన్నికలపైనే దృష్టి కేంద్రీకరించారు.  అధికార పార్టీ కార్యాలయానికి వంద కోట్ల రూపాయల విలువైన భూమిని ప్రభుత్వం ధారాదత్తం చేసిన అంశం కంటే.. రాజకీయంగా ప్రజలలో మరింత పట్టు సాధించుకోవడంపైనే ప్రతిపక్షాలు తమ దృష్టి మొత్తం కేంద్రీకృతం చేశాయి. బీజేపీ అయితే వరుసగా జాతీయ నాయకుల పర్యటనలకు షెడ్యూల్ చేసుకుని, అధికార పార్టీపై విమర్శల దాడికే ప్రాధాన్యత ఇస్తున్నది. ఇక కాంగ్రెస్ రాహుల్ గాంధీ రాష్ట్ర పర్యటనకు వచ్చిన స్పందన ఉత్సాహంలో ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోయింది.  

అధికార టిఆర్‌ఎస్‌ నేతలు కూడా  జిల్లాల పర్యటనతో బిజీగా ఉన్నారు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో హోరెత్తిస్తూ, ఆ కార్యక్రమాలను కూడా బీజేపీ, కాంగ్రెస్ లపై విమర్శనాస్త్రాలు సంధించడానికే ఉపయోగించుకుంటున్నారు.  అకాల వర్షాలు, కొనుగోలు కేంద్రాలలో తడిసిన ధాన్యం, రైలుత ఇక్కట్లు, ఇంటర్మీడియెట్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ వంటి అంశాలేవీ రాజకీయ నాయకులకు ఎన్నికల మూడ్ లో కనిపించడం లేదు. తెలంగాణలో వచ్చే ఎన్నికలలో త్రిముఖ పోరు తప్పదన్న అంచనాతో కాంగ్రెస్, బీజేపీలు పూర్తిగా ఎన్నికల సన్నాహాలపైనే దృష్టి సారించాయి. ఇదే అంచనాతో తెరాస కూడా సొంత ఇంటిని చక్కదిద్దుకుంటూనే, విపక్షాల తీరుపై విమర్శలు గుప్పించడానికే పరిమితమైంది. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం మేమే అని చాటుకోవడానికి బీజేపీ, కాంగ్రెస్ లు సర్వ శక్తులూ ఒడ్డుతుంటే.. టీఆర్ఎస్ రాష్ట్రంలో తమకు ప్రత్యామ్నాయం లేదని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నది.

దీంతో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలూ కూడా ప్రజా సమస్యలను గాలికి వదిలేశాయి. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ముందుకు రావడం లేదు, సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ప్రతిపక్షాలు ఆ పని చేయడం లేదు. ఎంత సేపూ పరస్పర ఆరోపణలతో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించి జనాల్లో కూడా ఎలక్షన్ మూడ్ వచ్చేసిందన్న భ్రమలో ఉన్నాయి.

By
en-us Political News

  
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేసేందుకు కొలీజియం కీలక నిర్ణయం తీసుకుంది.
సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రి ప్రాంగణంలో ఓ మానసిక రోగి హల్‌చల్‌ చేయడంతో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
దేశ రాజకీయాల్లో ప్రాంతీయ అసమానతలు, ఉత్తరాది ప్రాబల్యంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి తన గళాన్ని గట్టిగా వినిపించారు.
జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత యువ షూటర్, తెలంగాణ ముద్దుబిడ్డ ఈషా సింగ్ అద్భుత ప్రతిభ కనబరిచారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు సంబంధించి ప్రభుత్వం అధికారిక ప్రకటన జారీ చేసింది.
హైదరాబాద్ నగరంలో మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేస్తూ మరో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది.
బాలీవుడ్‌లో మరోసారి ఆదాయపు పన్ను శాఖ దూకుడు పెంచింది.
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సంక్షేమ అధ్యాయానికి తెరలేచింది.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.