‘గడపగడపకూ’కు ద్వితీయ విఘ్నం.. జనాగ్రహానికి జడిసి మొహం చాటేసిన వైసీపీ నేతలు

Publish Date:May 12, 2022

Advertisement

ప్రభుత్వాన్ని ప్రజల వద్దకు చేర్చాలంటూ ఆర్భాటంగా ప్రారంభమైన గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమానికి ద్వితీయ విఘ్నం తప్పలేదు. అసలు గడప గడపకూ వైసీపీ అంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నది జగన్ యోచన. కానీ పార్టీ పట్ల ప్రజలలో ఉన్న వ్యతిరేకతను అంచనా వేసిన ఆయన ఈ కార్యక్రమం పేరును గడప గడపకూ ప్రభుత్వంగా మార్చారు. ఇలా అయితే అధికారిక కార్యక్రమం అవుతుంది. జనం నిరసనలు వ్యక్తం చేసినా, కార్యక్రమాన్ని అడ్డుకున్నా.. పోలీసు కేసులతో వారిని దారిలోకి తీసుకురావచ్చన్న ఉద్దేశంతోనే గడప గడపకూ వైసీపీ కార్యక్రమం పేరును గడప గడపకూ ప్రభుత్వంగా మార్చారన్నది పరిశీలకుల విశ్లేషణ.

అయితే ఈ ఎత్తు కూడా పారలేదు. ప్రభుత్వ పథకాల లబ్ధి దారుల జాబితా తీసుకుని మరీ వెళ్లిన వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలకు ప్రజల నుంచి నిరసనల స్వాగతం లభించింది. నిలదీతల హారతులు దక్కాయి. శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా ఎక్కడికక్కడ వైసీపీ నేతలకు ప్రజా నిరసన జ్వాలల స్వాగతమే లభించింది. రోడ్లు, పథకాలు, పింఛన్లపై గడప గడపలోనూ నిలదీతలే, నిరసనలే. మూడేళ్ల పాటు జనం ఊపే పట్టని ప్రభుత్వానికి ఇప్పుడు అభిమానం తన్నుకొచ్చిందంటే నమ్మేందుకు సిద్ధంగా లేమంటూ గడప గడపలోనూ తిరస్కారాలే, ఛీత్కారాలే ఎదురయ్యాయి. మా గడప తొక్కద్దంటూ అడ్డగింతతో జనం వారిని వెనక్కు పంపారు.

పథకాల లబ్ధిదారుల జాబితా ప్రకారమే వెళ్లినా, లబ్ధిదారుల నుంచీ ఆదరణ లభించకపోవడంతో నేతలకు గడప గడపకూ కొనసాగించడమెలాగో అర్ధం కాలేదు. దీంతో బుధవారం మొదలైన ఈ కార్యక్రమం గురువారం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నిలిచిపోయింది. వైసీపీ నేతలెవరూ బయటకే రాలేదు. ముఖం చాటేశారు. అధికారుల నుంచి సమగ్ర సమాచారం అందలేదంటూ సాకులు చెప్పుకున్నారు. కొందరైతే ప్రజాగ్రహం ముందు నిలవడం కష్టమని ఒప్పేసుకున్నారు. గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా జగన్ సర్కార్ పై ప్రజలలో ఉన్న వ్యతిరేకత తీవ్రత బహిర్గతమైందని విశ్లేషకులు చెబుతున్నారు.

ముందు ముందు కూడా ఈ వ్యతిరేకతను తట్టుకుని నేతలు ప్రజలలోకి వెళ్లే పరిస్థితి ఉండే అవకాశాలు కనిపించడం లేదని అంటున్నారు. ఒక వైపు తెలుగుదేశం బాదుడే బాదుడు కార్యక్రమానికి అశేష జనవాహిని మద్దతు పలుకుతూ కదులుతుంటే.. ప్రభుత్వ కార్యక్రమానికి నిరసనల సెగ తగులుతుండటంతో అధికార పార్టీ నేతలలో తమ రాజకీయ భవిష్యత్ పై ఆందోళన ప్రారంభమైందంటున్నారు. 

By
en-us Political News

  
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేసేందుకు కొలీజియం కీలక నిర్ణయం తీసుకుంది.
సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రి ప్రాంగణంలో ఓ మానసిక రోగి హల్‌చల్‌ చేయడంతో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
దేశ రాజకీయాల్లో ప్రాంతీయ అసమానతలు, ఉత్తరాది ప్రాబల్యంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి తన గళాన్ని గట్టిగా వినిపించారు.
జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత యువ షూటర్, తెలంగాణ ముద్దుబిడ్డ ఈషా సింగ్ అద్భుత ప్రతిభ కనబరిచారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు సంబంధించి ప్రభుత్వం అధికారిక ప్రకటన జారీ చేసింది.
హైదరాబాద్ నగరంలో మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేస్తూ మరో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది.
బాలీవుడ్‌లో మరోసారి ఆదాయపు పన్ను శాఖ దూకుడు పెంచింది.
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సంక్షేమ అధ్యాయానికి తెరలేచింది.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.