కింద పడ్డా మాదే పై చేయి.. సజ్జల వితండ వాదన!

Publish Date:May 13, 2022

Advertisement

గడప గడపకూ ప్రభుత్వం పేరుతో జగన్ సర్కార్ చేపట్టిన కార్యక్రమంలో గడప గడపకూ ప్రభుత్వంపై నిరసనలు వ్యక్తమౌతుంటే.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం అందుకు ససేమిరా అంగీకరించడం లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్న వారెవరికీ ఆ అర్హత లేదంటున్నారు. గడప గడపకూ కార్యక్రమంలో నిరసనలు ఎదురౌతున్నాయని అంగీకరిస్తూనే కింద పడినా పై చేయి మాత్రం మాదేనంటూ వితండ వాదనను తెరపైకి తీసుకువస్తున్నారు.

ప్రభుత్వ వ్యతిరేక నిరసనలకు మీడియాలో విస్తృత ప్రచారం రావడం, సామాజిక మాధ్యమంలో ప్రభుత్వంపై ట్రోలింగ్ పెరగడంతో ఆయన ఒకింత అసహనానికి గురయ్యారని పిస్తోంది. జగన్ సర్కార్ లో ప్రభుత్వ సలహాదారు హోదాలో సూపర్ మంత్రిగా అన్ని శాఖల ఇన్ చార్జిగా వ్యవహరిస్తున్న సజ్జల గడప గడపకూ కార్యక్రమంపై ప్రభుత్వ రియాక్షన్ చెప్పేందుదుకు మీడియా ముందుకు వచ్చారు. ప్రజా నిరసనలను తగ్గించి చూపే ప్రయత్నం చేశారు. నిరసనలు ఎదురౌతున్న మాట వాస్తవమేనని అంగీకరిస్తూనే ఆ నిరసనలు చేసే వారెవరికీ ఆ అర్హత లేదని, అలా నిరసనలు చేస్తున్న వారంతా ప్రభుత్వ పథకాలకు అర్హత లేనివారేనని తీర్మానించేశారు.

అర్హత లేకుండా తమకు కూడా ప్రభుత్వ పథకాలను అమలు చేయాలని కోరుతూ వారు నిరసనలకు దిగుతున్నారని కొత్త వాదనను తెరమీదకు తీసుకువచ్చారు.   పథకాలకు నిబంధనల సంకెళ్లు వేసి ఎవరికీ అందకుండా విధానాలు రూపొందించిన ఘనత వహించిన ప్రభుత్వం.. పథకాల గురించి తప్ప అభివృద్ధి గురించి, సమస్యల గురించి మాత్రం గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమంలో ప్రస్తావించడం లేదు. లబ్ధిదారుల జాబితాలతో లబ్ధిదారుల గడప కు వెళ్లి ఘనంగా ప్రచారం చేసుకుందామనుకున్న ప్రభుత్వానికి తొలి రోజునే నిరసనల సెగ తగలడంతో ఉక్కిరి బిక్కిరైంది. స్వయంగా ముఖ్యమంత్రి జగన్ గురువారం కేబినెట్ సమావేశం తరువాత మంత్రులతో మళ్లీ ప్రత్యేకంగా సమావేశమై ( ఈ సమావేశానికి అధికారులెవరినీ అనుమతించలేదు) గడప గడపకూ కార్యక్రమంపై మరోసారి దిశా నిర్దేశం చేశారు.

అయితే ప్రజా నిరసనల ఉధృతిని స్వయంగా అనుభవించిన నేతలు.. కార్యక్రమాన్ని కొన్ని రోజులు వాయిదా వేసి.. ఏవో కొన్ని ప్రజోపయోగకరమైన పనులను ప్రారంభించి తరువాత కొనసాగిద్దామని ప్రతిపాదించినా సీఎం ససే మిరా అన్నారట. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకు వచ్చి గడప గడపకూ కార్యక్రమం బ్రహ్మాండంగా సాగుతోందని నమ్మించడానికి ప్రయత్నిస్తూ.. నిరసనలు వాస్తవమే కానీ, అనర్హుల నిరసనలవి అని భాష్యం చెబుతున్నారు.

 గడప గడపకూ కార్యక్రమం వల్ల పార్టీకి కానీ, ప్రభుత్వానికి కానీ ఒనగూరే ప్రయోజనం ఇసుమంతైనా లేదని వైసీపీ క్యాడర్ చెబుతున్నారు. సంక్షేమ పథకాలలో లబ్ధిరాదుల సంఖ్యను కుదిస్తూ పోవడం వల్లనే ప్రజాగ్రహం పెల్లుబుకుతోందనీ, విద్యుత్ చార్జీల బిల్లులు కూడా గతం కంటే 70 నుంచి 75 శాతం అధికంగా రావడం వల్ల కూడా జనాగ్రహం తీవ్రంగా వ్యక్తమౌతోందని వారు చెబుతున్నారు.  

By
en-us Political News

  
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేసేందుకు కొలీజియం కీలక నిర్ణయం తీసుకుంది.
సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రి ప్రాంగణంలో ఓ మానసిక రోగి హల్‌చల్‌ చేయడంతో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
దేశ రాజకీయాల్లో ప్రాంతీయ అసమానతలు, ఉత్తరాది ప్రాబల్యంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి తన గళాన్ని గట్టిగా వినిపించారు.
జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత యువ షూటర్, తెలంగాణ ముద్దుబిడ్డ ఈషా సింగ్ అద్భుత ప్రతిభ కనబరిచారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు సంబంధించి ప్రభుత్వం అధికారిక ప్రకటన జారీ చేసింది.
హైదరాబాద్ నగరంలో మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేస్తూ మరో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది.
బాలీవుడ్‌లో మరోసారి ఆదాయపు పన్ను శాఖ దూకుడు పెంచింది.
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సంక్షేమ అధ్యాయానికి తెరలేచింది.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.