మంత్రి కొడాలి నాని తెలుసుగా. ఆయన మాట్లాడితే.. ఆ వీడియోకి బీప్ సౌండ్‌లు వేయాల్సిందే. లేదంటే రూల్స్ ఒప్పుకోవు. ఆ బాషను సభ్యసమాజం అంగీకరించదు. పైగా అసహ్యించుకుంటుంది. అలాంటి ఆయన.. లేటెస్ట్‌గా మరో బ్రేకింగ్ న్యూస్ చెప్పారు. కొన్ని న్యూస్ ఛానెల్స్‌ను నిషేధిస్తున్నామని తెలిపారు. అందుకు ఆయన చెప్పిన కారణం.. ఆ మీడియా ఎల్లప్పుడూ అసత్య కథనాలు ప్రసారం చేస్తోందట. ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందట. ఆ ఆరోపణలతో.. టీవీ 5, ఏబీఎన్, ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఈటీవీలపై ఎల్లో ముద్ర వేసేసి.. వాటిని మండలస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు నిషేధిస్తున్నామని నాని ప్రకటించేశారు.
ఇదేమీ షాకింగ్ న్యూస్ మాత్రం కాదు. గతంలోనే ఆయా వార్తా సంస్థలను వైసీపీ ఎప్పుడో బయ్‌కాట్ చేసింది. ఆ టీవీ ఛానెల్స్‌లో చర్చలకు వైసీపీ నాయకులు వెళ్లరు. వాళ్ల పార్టీ మీడియా సమావేశాలకు వారిని రానివ్వరు. పాత విషయాన్నే మరోసారి కొత్తగా చెప్పారు కొడాలి నాని.
ఇంతకీ ఆ ఛానెల్స్‌పై వైసీపీకి అంత కోపం ఎందుకొచ్చింది అనేదే ప్రశ్న. వెరీ సింపుల్. ప్రభుత్వం ఏదో ప్రకటన చేస్తుంది.. అందులో లోటుపాట్లను, మభ్యపెట్టే అంశాలను వీళ్లు వెలికి తీస్తారు. జనాల జేబులకు ప్రభుత్వం పెడుతున్న చిల్లులను బయటపెడతారు. వైసీపీ నేతల అరాచకాలను, అక్రమాలను వివరిస్తారు. ఇది చాలదా.. ఆ మీడియాపై కోపం పెంచుకోడానికి. వాటిని నిషేధించడానికి.. అంటున్నారు.
ఏపీలో మీడియా మొత్తం రెండు వర్గాలుగా చీలిపోయిందనే ఆరోపణ ఎప్పటి నుంచో ఉంది. బ్లూ మీడియా, ఎల్లో మీడియా.. అంటూ జగన్, చంద్రబాబు సపోర్టర్స్‌గా మారింది. టీవీ9, ఎన్టీవీ, సాక్షి.. లాంటివి జగన్ భజన చేసే అనుకూల సంస్థలని అందరికీ తెలుసంటారు. ఇలా కొన్ని ఛానెళ్లు వైసీపీకి, మరికొన్ని టీడీపీ.. సపోర్ట్‌గా ఉంటున్నాయి. ఇదేదో కొత్త విషయంలా.. కొడాలి నాని ప్రెస్‌మీట్ పెట్టి మరీ.. కొన్ని మీడియా సంస్థలపై నిషేధం అంటూ, అసత్య కథనాలంటూ నీతివ్యాఖ్యానాలు చేసి.. నిషేధాజ్ఞలు విధించడం కామెడీ కాక మరొకటి కాదంటున్నారు. అంతా ఆ తాను ముక్కలేనని అంటున్నారు. ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేది బ్లూ మీడియా.. ప్రభుత్వ విధానాల లోటుపాట్లను తెలియజెప్పేది ఎల్లో మీడియా.. అంతేగా.. అంతేగా. మరెందుకు ఇంతటి ఓవరాక్షన్ అంటున్నారు వ్యూయర్స్.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/political-media-controversy-in-ap-39-129798.html
కేవలం తన కోటరీ మాటలు నమ్మి ప్రజా క్షేత్రానికి దూరం కావడం వల్లే ఘోర పరాజయాన్ని చవిచూశారు. అయితే 2024 ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిత్వం ప్రజలకు చేరువగానే ఉంటోంది. ఇక తాజాగా ఈ నెల 9 నుంచి 15 వరకూ ప్రజాబాట కార్యక్రమాలను నిర్వహించనుంది.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై తన విమర్శల మోతాదు పెంచారు. ఒక భూమి విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పెరు లాగి మీడియా దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తమ అభ్యర్థుల ఎంపికను అధికారికంగా పూర్తి చేసింది.
ఈ గ్లోబల్ ఎక్స్‌పోజర్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేడు ఆయనను జాతీయ స్థాయి రాజకీయాలకు, ముఖ్యంగా రాజ్యసభ కు సమర్థుడైన అభ్యర్థిగా నిలబెడుతున్నాయి. 2019 ఎన్నికలలో తెలుగుదేశం ఓటమి తరువాత టీడీపీ తీవ్ర సంక్షోభంలో ఉన్న తరుణంలో.. సాంప్రదాయ మీడియా కంటే డిజిటల్ మీడియా ద్వారా అధికార పక్షాన్ని ఎదుర్కోవడం ముఖ్యమని పార్టీ గుర్తించింది
ప్రస్తుత జాతీయ రాజకీయాల పరిస్థితులు, పార్టీ భవిష్యత్ ను పరిగణనలోకి తీసుకుని చింతకాయల విజయ్ రాజ్యసభకు పంపడమే సముచితమని ఆయన నిర్ణయించారు.
ప్రస్తుతం కేంద్రంలో తెలుగుదేశం పార్టీ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న తరుణంలో పార్లమెంట్‌లో పార్టీ గళాన్ని బలంగా వినిపించగల యువ, విద్యావంతులైన నాయకత్వం అవసరమని చంద్రబాబు భావించినట్లు కనిపిస్తోంది.
అన్నామలై ఇప్పుడు నేరుగా సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో చేతులు కలపబోతున్నారనే వార్త దావానలంలా వ్యాపిస్తోంది. వీరిద్దరూ కలిసి తమిళనాడులో ఒక సరికొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నారనే వదంతులు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
అలాగే అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఊహించని రేంజ్‌లో పెంచడానికి ఈ ప్రాజెక్ట్ దేశానికి ఎంతో రక్షణ, ఆర్థిక ప్రయోజనకరమని కేంద్ర ప్రభుత్వం బలంగా చెప్తోంది. అయితే ఈ మెగా ప్రాజెక్టుపై లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, ఇది దేశ చరిత్రలోనే అతి పెద్ద స్కామ్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.
తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందన్న పవన్ కల్యాణ్ ప్రకటనపై స్పందించిన ప్రకాశ్ రాజ్ సింగిల్ గానా, పొత్తుతోనా అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.
గతంలో ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ నుండి గానీ, అంతకుముందు రెండుసార్లు గెలిచిన జార్ఖండ్ నుండి గానీ, లేదా ఆయన సొంత రాష్ట్రమైన గుజరాత్ నుండి గానీ ఈసారి అభ్యర్థిత్వం లభించలేదు. దేశంలోనే అత్యంత శక్తిమంతమైన రిలయన్స్ కార్పొరేట్ లాబీయింగ్ పప్పులు మారిన రాజకీయ సమీకరణాల ముందు ఉడకలేదు.
పవన్ రాజకీయ అవగాహనారాహిత్యానికి ఆయన వ్యాఖ్యలే తార్కానమన్నారు. ప్రపంచ పరిణామాలు ఏదిశగా నడుస్తున్నాయో కూడా ఆయనకు అర్థం కావడం లేదన్న వీ శ్రీనివాసరావు. . తమిళనాడులో సినీ నటుడు విజయ్ గెలుపు తర్వాత పవన్ కల్యాణ్‌పై ఒత్తిడి తీవ్రంగా ఉండడంతో ఆయన నిస్పృహనకు లోనవుతూ.. దీనివల్ల ఆయన ఏదేదో మాట్లాడుతున్నారన్నారు.
తమిళనాట విజయ్ సునామీ ప్రకంపనలు సద్దుమణగక ముందే, తమిళనాట మరో సీనియర్ సూపర్ స్టార్ రజినీకాంత్ పేరు పొలిటికల్ స్క్రీన్ పైకి రావడం పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.
ఈ వివాదం కాస్తా ముదరడంతో తెలంగాణ రాజకీయాలపై పవన్ కళ్యాణ్ అత్యంత కీలకమైన ప్రకటన చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పార్టీ ఒంటరిగానైనా బరిలోకి దిగుతుందని, అవసరమైతే ఏ పోరాటానికైనా తాను వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ప్రకటించారు. తెలంగాణ సెంటిమెంట్‌ను టచ్ చేస్తూ కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో.. పవన్ కళ్యాణ్ ఈ సవాల్‌ను స్వీకరించడం సంచలనం సృష్టించింది.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలై కేవలం 80 స్థానాలకే పరిమితమైన టీఎంసీలో అసంతృప్తి జ్వాలలు భగ్గుమన్నాయి. అసమ్మతి గళాలు రోడ్డెక్కాయి. పార్టీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై మెజారిటీ టీఎంసీ నేతలు తిరుగుబావుటా ఎగురవేశారు. గడిచిన 15 ఏళ్లుగా బెంగాల్‌ను ఏకఛత్రాధిపత్యంగా పాలించిన దీదీ, ఇప్పుడు సొంత పార్టీపై పట్టు కోల్పోయే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.