మేమింతే...!

Publish Date:Oct 1, 2012

Advertisement

 

వడ్డించేవాడు మనవాడు అయితే పంక్తిలో చివర్లో కూర్చున్నా వస్తుందన్న మాట నేటి కాలంలో ముమ్మాటికి ఎవరూ కాదనలేని నిజం. ముఖ్యంగా రాజకీయనేతల అండదండలున్న పెద్దలకు అటువంటిది మంచినీళ్ళు త్రాగినంత పని. రైతుల శ్రేయస్సు దృష్ట్యా రైతు ప్రతినిధులకు సైతం ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలకమండలిలో పదవులను ప్రాతినిధ్యం కల్పించాలని ప్రత్యేక చట్టం చెబుతోంది. పాలకమండలిలో నలుగురు ఆదర్శరైతులుండాలన్నది నిబంధన. మరి ఈ నిబంధనలు ఎంతవరకు అమలుజరుగుతున్నాయో పాలకులకే తెలియాలి. ఆదర్శం కోటా పేరుతో తిరుపతి పట్టణానికి చెందిన బి. మమత అనే మహిళను ఎంపికచేశారు. ఈమెకు భూములున్నా వ్యవసాయం చేయడంలేదు. అంతేకాదు ఓ బ్యూటీపార్లర్‌ నిర్వాహకురాలు ఈమె. అలాగే ఎంపికైన మరో ఇద్దరు కూడా భూములున్నా వ్యవసాయం చేయడం లేదు. ఇలా ఏమిలేకుండానే ఉన్నాయని అందలం ఎక్కిస్తే ఎవరికి ప్రయోజనం! ఇప్పటికే దేశంలో, అందునా రాష్ట్రంలో వ్యవసాయం పరిస్థితి దయనీయంగా వుంది. ఎంతోమంది ఉన్నతులు అధిరోహించిన స్థానాలను కొందరు తమ అవసరాలకోసం పదవుల పందేరా చేయడం ఎంతవరకు సమంజసం! వ్యవసాయంలో పలు ప్రయోగాలుచేస్తూ పంటలను సాగుచేస్తూ మంచి దిగుబడిని సాధిస్తున్న ఎంతోమంది సామాన్యరైతులున్నారు. వారిని ఇటువంటి పదవులకు ఎంపిక చేస్తే .. వారికి వ్యవసాయంపై పూర్తి అవగాహన ఉంటుంది కనుక రైతులకు ఉపయోగపడే నిర్ణయాలను, పద్ధతులపై ఆసక్తిని చూపిస్తారు. అంతేకాని బ్యూటీపార్లర్‌ నడుపుకునేవారిని, వ్యాపారాలు చేసుకునేవారికి విజ్ఞానానికి పట్టుకొమ్మలైన విశ్వవిద్యాలయాల్లో అందునా ఆచార్య రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అవకాశం కల్పించడమంటే మేం చేసినా చెల్లుబాటవుతుందని, మాకు, మా సంబంధీకులకు పదవులే ముఖ్యం. మిగిలినవి ఏమైపోతే మాకేమి?. అన్నట్లుగా వుంది పాలకుల ఈ చర్య అంటున్నారు ఎంతోమంది విజ్ఞానప్రేమికులు. నిజమే బ్యూటీపార్లర్‌కు వ్యవసాయానికి సంబంధం ఏమిటో? ఎంపికచేసిన వారికే తెలియాలి?

By
en-us Political News

  
రాష్ట్ర రాజధాని నగరంలోని ప్రముఖ నియోజకవర్గాల్లో ఒకటైన ఖైరతాబాద్‌లో జరగబోయే రాజకీయ పోరుపై గులాబీ పార్టీ శిబిరంలో సర్వత్రా ధీమా వ్యక్తమవుతోంది.
హైదరాబాద్‌లో డీఆర్‌ఐ అధికారులు భారీ ఆపరేషన్ నిర్వహించి ఏనుగు దంతాల అక్రమ విక్రయాల వ్యవహారాన్ని గుట్టురట్టు చేశారు.
హైదరాబాద్‌ నగరంలోని పాతబస్తీ అంటేనే చరిత్రకు చిరునామా.... నగర నిర్మాణం, సంస్కృతి, సంప్రదాయాలతో పాటు శతాబ్దాల నాటి జలవనరులు కూడా నేటికీ ఆనాటి వైభవాన్ని గుర్తు చేస్తుంటాయి.
హైదరాబాద్ రాజకీయాల్లో ఓట్ల తొలగింపు వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది.
ఏడడుగులు కలిసి నడిచిన నాటి నుంచి ఒకే బాటగా జీవన పయనం సాగించిన ఆ వృద్ధ దంపతులు..   అంతిమ అడుగు కూడా కలిసే వేశారు. కలిసి బతికిన వారు కలిసే తనువు చాలించారు.
గతంలో ఆంధ్రా ప్రాంతానికి చెందిన కొందరి వ్యక్తుల పేర్లపై ఉన్న ఆస్తులు, ఇటీవల  కేటీఆర్, ఆయన కుటుంబ సభ్యుల పేరిట బదిలీ అయ్యాయన్న రేవంత్ రెడ్డి..  హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఖరీదైన ఆస్తులు, ఫైవ్ స్టార్ హోటళ్లు, అపార్ట్‌మెంట్లు, సర్వీస్ ప్రాపర్టీల వివరాలను వెల్లడించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. జిల్లాలో మొత్తం రూ.345.78 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఉపాధి కోసం రష్యా వెళ్లిన తెలంగాణకు చెందిన నలుగురు యువకులు అనూహ్యంగా అక్కడి మిలిటరీ క్యాంపులో చిక్కుకున్నారని వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త చర్చకు తెరలేచింది.
‘ది ప్యారడైజ్’ సినిమాలో ఎమ్మెల్యే శంకరన్న పాత్రలో మాజీ సీఎం కేసీఆర్‌ను పోలిన పాత్రను పోషిస్తున్న నటుడు ప్రియదర్శిని మాజీ మంత్రి హరీశ్ రావు కలిసి అభినందించారు.
లక్ష్మీ భాస్కర్‌ను ఏసీబీ అధికారులు సెప్టెంబర్ 22న అరెస్ట్ చేశారు. ఆయన 48 గంటలకు మించి కస్టడీలో ఉన్నట్లు నిమ్స్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగి 48 గంటలకు పైగా కస్టడీలో ఉంటే నిబంధనల ప్రకారం అరెస్టయిన తేదీ నుంచే సస్పెండ్ అయినట్లు పరిగణిస్తారు.
హైదరాబాద్‌ పాతబస్తీలో ఆన్‌లైన్‌ ద్వారా ఆహార పదార్థాలను విక్రయిస్తున్న సంస్థలపై తెలంగాణ ఫుడ్‌ సేఫ్టీ అధికారులు కొరడా ఝళిపించారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.