ఢిల్లీ మద్యం కుంభకోణంలో పులుకడిగిన ముత్యంలా తిరిగి వస్తానంటూ.. కవిత చేసిన వ్యాఖ్యలు ఢిల్లీ కోర్టు ఆమెకు క్లీన్ చిట్ ఇవ్వడంతో నిజమయ్యాయనే చెప్పాలి. అయితే.. మద్యం కేసులో నిందితురాలిగా కవిత ఉండటం వల్లే బీఆర్ ఎస్ 2023 ఎన్నికల్లో పరాజయం పాలైందంటూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆయన హుందాతనాన్ని తగ్గించాయని పరిశీలకులు అంటున్నారు. కవిత సైతం తన వల్ల పార్టీ ఎలా ఓడిపోయిందని ప్రకటించి చేతులు దులుపుకోవడం కాదు.. అందుకు సంబంధించి వివరణ ఇవ్వాలనీ, లెక్కలు తేల్చాలనీ డిమాండ్ చేయడం ద్వారా మొత్తం బీఆర్ఎస్ నే డిఫెన్స్ లో పడేశారు.
దాని నుంచి బయటపడడానికి ఇప్పుడు బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ రంగంలోకి దిగి.. అప్పటి కేటీఆర్, కేసీఆర్ ల ప్రసంగాలు, ప్రకటనలను రీ పోస్టు చేస్తూ హడావుడి చేస్తున్నది. అప్పట్లో అంటే కవిత అరెస్టు అయినప్పుడు మంత్రులుగా ఉన్న కేటీఆర్, హరీష్‌రావు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేయడం.. కవిత జైల్లో ఉన్నప్పుడు.. ఆమెను కలుసుకునేందుకు గంటల కొద్దీ వెయిట్ చేయడం.. వంటి వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ బీఆర్ఎస్ అప్పట్లో కవితకు అండగా నిలిచిందని చెప్పుకోవడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నది.
అలాగే బీఆర్ఎస్ అధినేత, అప్పటి సీఎం కేసీఆర్ అప్పట్లో మీడియాతో మాట్లాడుతూ కవితపై అక్రమంగా కేసులు బనాయించారని.. తనపై ఉన్న అక్కసును తన కుమార్తెపై తీర్చుకుంటున్నారని చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన బైట్లనూ సోషల్ మీడియా వేదికగా వైరల్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవలసినదేమిటంటే.. కవితకు ఢిల్లీ మద్యం కుంభకోణంలో క్లీన్ చిట్ ఇస్తూ తీర్పు వెలువడిన తరువాత బీఆర్ఎస్ బీజేపీ టార్గెట్ గా విమర్శలు గుప్పించాలి.. కానీ అందుకు భిన్నంగా కవితకు తాము అప్పట్లో అండగా నిలబడ్డామని చెప్పుకోవడానికే ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు.
కవిత కాదన్నా సరే.. వారు అదే పాట పాడుతున్నారు. కేవలం కవిత అప్పట్లో తనకు పార్టీ అండగా నిలవలేదని చేసిన వ్యాఖ్యలను తిప్పి కొట్టేందుకే బీఆర్ఎస్ సోషల్ మీడియా తన పేజీలన్నిటినీ నింపేస్తున్నది. దీనిని బట్టి చూస్తుంటే కవిత బీఆర్ఎస్ మధ్య పొలిటికల్ వార్ ముదిరిందని అవగతమౌతోంది. మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ ఇప్పుడు కవిత ఫియర్ తో వణికిపోతున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/political-fight-between-kavitha-and-brs-25-214871.html
సీఎం పర్యటన ద్వారా ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు, తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసేందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
కోలీవుడ్‌లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.