టీఆర్ఎస్ కుదరదు.. మరో పేరు పెట్టుకోండి.. కల్వకుంట్ల కవితకు ఈసీ తాఖీదు.!
Publish Date:Jul 4, 2026
Advertisement
కల్వకుంట్ల కవితకు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఆమె స్థాపించిన కొత్త పార్టీ తెలంగాణ రక్షణ సేన పేరుపై భారీ ఎత్తున అభ్యంతరాలు వచ్చిన కారణంగా పార్టీ పేరు మార్చుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ మేరకు పార్టీకి అధికారిక సమాచారం ఇచ్చింది. ఈసీ ఆదేశాల మేరకు తన పార్టీకి తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పేర్కొంటూ.. రిజిస్ట్రేషన్ కోసం కవిత ఈసీకి దరఖాస్తు చేసుకున్న సంగతి విదితమే. అయితే.. ఈ పేరుపై వెయ్యికి పైగా అభ్యంతరాలు వచ్చాయని అందువల్ల మూడు ప్రత్యామ్నాయ పేర్లను కు సర్పించాలని ఈసీ కవితకు లేఖ రాసింది. కాగా ఈసీ నుంచి వచ్చిన అభ్యంతరాలపై స్పందించిన కవిత.. ఈసీ కోరినట్లు ప్రత్యామ్నాయంగా కొత్త పేర్లు ఇచ్చే ప్రసక్తే లేదనీ.. ఈ విషయంలో న్యాయపోరాటం చేస్తామనీ తెలిపారు. గత ఫిబ్రవరిలో తెలంగాణ ప్రజా జాగృతి, తెలంగాణ జాగృతి, తెలంగాణ రక్షణ సేన, తెలంగాణ రాష్ట్ర జాగృతి, తెలంగాణ ప్రజా శక్తి పేర్లను సూచిస్తూ కవిత సీఈసీకి లేఖ రాశారు. ఈ క్రమంలో ఏప్రిల్ 25న మునీరాబాద్ లో జరిగిన పార్టీ ఆవిర్భావ సభలో తమ పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేనగా ప్రకటించిన కవిత, అదే సభలో పార్టీ జెండాను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన మూడు రోజులకు కవిత కొత్త పార్టీ పేరును తెలంగాణ రక్షణ సేన గా ఈసీ ప్రాథమికంగా గుర్తించింది. తాజాగా ఈసీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. ప్రత్యామ్నాయ పేర్లు ఎంపిక చేసుకోవాలని సూచించడం తెలంగాణలో రాజకీయ సంచలనానికి తేరతీసింది. ECI, Kalvakuntla, Kavitha, TRSname, Teluguone, Telangana Politics
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
http://www.teluguone.com/news/content/choose-another-name-25-225033.html





