ఆమంచి చూపు.. జనసేన వైపు.!

Publish Date:Jul 4, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో  కీలక పరిణామం చోటుచేసుకుంటోంది. ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్  జనసేన గూటికి చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. గత కొంతకాలంగా రాజకీయాలలో క్రీయాశీలంగా ఉండకుండా మౌనం వహించిన ఆమంచి ఇప్పుడు జనసేనాని పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన తీర్ధం పుచ్చుకుంటారంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.  సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్..  2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా  రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే..  2019 ఎన్నికలకు ముందు  తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.  2019 ఎన్నికల్లో వైసీపీ టికెట్‌పై పోటీ చేసి  కరణం బలరాం చేతిలోపరాజయం పాలయ్యారు.  ఆ ఓటమి తరువాత  వైసీపీలో ఆమంచి కృష్ణమోహన్ ను ఇసుమంతైనా ప్రాధాన్యత దక్కలేదు.  

దీంతో   2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆమంచి కృష్ణమోహన్  వైసీపీని వీడి.. వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్  తీర్థం పుచ్చుకున్నారు. ఆ ఎన్నికలలో కాంగ్రెస్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించి అధికారపగ్గాలు చేపట్టింది.  దీంతో ఆమంచి రాజకీయంగా ఇన్ యాక్టివ్ అయ్యారు. అయితే ఇటీవల కొంత కాలంగా ఆయన తన అనుచరులు, నియోజకవర్గ ముఖ్య నేతలతో వరుస భేటీలు నిర్వహించి భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. ఆ చర్చలలో చీరాలలో తన పట్టు నిలుపుకోవాలన్నా, రాజకీయంగామనుగడ సాగించాలన్న జనసేనలో చేరడమే కరెక్ట్ అన్న నిర్ణయానికి వచ్చారు.  

ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో జనసేనను మరింత బలోపేతం చేయాలని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పట్టుదలతో ఉన్నారు. ఇందుకోసం ఆపరేషన్ ఆకర్ష్ ఒక్కటే మార్గమని భవించిన.. ఆమంచి నేడో రేపు ఇదే విషయాన్ని బహిరంగంగా ప్రకటించే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఆ దిశగా ఇప్పటికే  జనసేన ముఖ్యులతో ఆమంచి చర్చలు జరిపారనీ, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అప్పాయింట్ మెంట్ ఖరారైన తరువాత ఆయన జనసేన చేరిక ప్రకనట చేసే అవకాశం ఉందనీ, జనసేన వర్గాల ద్వారా తెలుస్తోంది.  

Amanchi Krishna Mohan, Janasena Party, Pawan Kalyan, Chirala Politics, Teluguone

By
en-us Political News

  
G.D. Naidu, known as the “Edison of India,” was an Indian inventor, industrialist and pioneer of innovation. This article explores his remarkable life, curiosity, self-learning, experimentation and practical approach to technology, and the lessons his journey offers to Millennials, Gen Z and Gen Alpha.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
G.D. Naidu జీవితంలో నుంచి Millennials, Gen Z, Gen Alpha నేటి తరాలు ఏం నేర్చుకోవాలి? ఆయన Curiosity, Self-Learning, Innovation, Technology, Learning by Doing, Experimentation మరియు India కోసం కొత్తగా ఆలోచించే విధానం గురించి తెలుసుకోవడానికి ఈ కథనం చదవండి.
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.