సలామి కోల్డ్ స్టోరేజ్ ఇండస్ట్రీపై పోలీసుల దాడి... కుళ్ళిన మాంసం స్వాధీనం
Publish Date:Apr 10, 2026
Advertisement
హైదరాబాద్ పాతబస్తి బాలాపూర్ ప్రాంతంలో ఉన్న సలామి ఇండస్ట్రీస్‌పై పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన దాడులు స్థానికంగా కలకలం రేపాయి. మదీనా కాలనీలో ఉన్న సలామి కోల్డ్ స్టోరేజ్ లో కుళ్ళిన మాంసాన్ని విక్రయిస్తున్నట్లుగా అందిన విశ్వసనీయ సమాచారం మేరకు బాలాపూర్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో కనీస పారిశుద్ధ్యం లేకుండా, మాంస వ్యర్థాలను నిల్వ ఉంచినట్లుగా అధికారులు గుర్తించారు. నిల్వ ఉంచిన మాంసం చాలా భాగం కుళ్లిపోయినట్లు అధికారులు నిర్ధారించారు. దాడుల్లో భాగంగా భారీ మొత్తంలో అపరిశుభ్ర మాంసం మరియు ఇతర వ్యర్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై సలామీ కోల్డ్ స్టోరేజీ ఇండస్ట్రీ యజమానిపై కేసు నమోదు చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు అధికారులు తెలిపారు. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇలాంటి మాంస పరిశ్రమలు మరెన్నో ఉన్నాయని, ఉన్నతాధికారులు దృష్టి సారిస్తే మరిన్ని దాడులు చేపట్టి ఇలాంటి అక్రమ యూనిట్లను మూసివేయడం సాధ్యమని స్థానికులు అంటున్నారు.
http://www.teluguone.com/news/content/police-raid-on-salami-cold-storage-industry-36-217105.html





