Publish Date:Jul 10, 2026
గతంలో.. అంటే 2021-22 ఆర్థిక సంవత్సరంలో రోడ్ల నాణ్యతలో దేశంలో దారుణంగా 19వ ర్యాంకులో ఉన్న ఆంధ్రప్రదేశ్ తాజా నివేదిక ప్రకారం 2వ స్థానానికి ఎగబాకి కొత్త రికార్డు సృష్టించింది. కేవలం రెండేళ్ల వ్యవధిలోనే 19వ స్థానం నుండి రెండో స్థానానికి చేరడం ఒక అద్భుత విజయంగా.. పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
Publish Date:Jul 10, 2026
నిత్యం వందలాది మంది కార్మికులు పని చేసే ఆ బహుళ అంతస్తుల ఫ్యాక్టరీ భవనంలో.. గురువారం ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఎం జరుగుతోందో అర్థమయ్యేలోగానే 28 మంది కార్మికులు ఆ మంటల్లో సజీవదహనమయ్యారు. పలువురు గాయపడ్డారు.
Publish Date:Jul 10, 2026
న్నవరం పోలీస్ స్టేషన్‌కు చెందిన 8 మంది అధికారులతో కూడిన ప్రత్యేక బృందం శుక్రవారం స్థానిక పోలీసుల సహకారంతో సోదాలు నిర్వహించింది. గంటల తరబడి సాగిన ఈ సోదాలలో పలు కీలక పత్రాలు, డిజిటల్ రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. విద్వేషపూరిత వ్యాఖ్యలు, సమాజంలో అశాంతిని రేకెత్తించేలా సాగిన తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ మొత్తం తనిఖీ ప్రక్రియ పోలీసులు వీడియో రికార్డింగ్ చేశారు.
Publish Date:Jul 10, 2026
బుషెహర్ అణు విద్యుత్ కేంద్రం లక్ష్యంగా జరిగిన ఈ దాడుల ప్రభావంపై ఇరాన్ ప్రభుత్వ మీడియా స్పందించింది. అమెరికా జరిపిన ఈ దాడుల ధాటికి బుషెహర్ అణు కేంద్రం ప్రాంగణంలోని ఒక ముఖ్యమైన భవనం పాక్షికంగా దెబ్బతిన్నట్లు పేర్కొంది. కేవలం అణు కేంద్రమే కాకుండా, ఇరాన్ రక్షణ రంగానికి, వాణిజ్యానికి అత్యంత కీలకమైన బందర్ అబ్బాస్, కొనారక్ వంటి తీరప్రాంత నగరాలపై కూడా అమెరికా దాడులు చేసింది. ప్రధానంగా సైనిక స్థావరాలు లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్లు సమాచారం.
మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఇంగ్లాండ్ సిరీస్ కైవసం చేసుకుంది. ఇఖ నాలుగో టి20 విషయానికి వస్తే.. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లోనూ ఇంగ్లాండ్ టీమ్ ఇండియాపై సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించి 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
నకిలీ పట్టాలు, ఫోర్జరీ చేసిన విద్యా ధ్రువీకరణ పత్రాలను సమర్పించి, మోసపూరిత మార్గాల్లో ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలు సంపాదించిన వారిపై ఉక్కుపాదం మోపింది. సుదీర్ఘ కాలంగా సాగిన విచారణ అనంతరం ఏకంగా 3 వేల 35 మంది టీచర్లను ఒకేసారి విధుల్లోంచి తొలగిస్తూ బీహార్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.
మే 8న హైదరాబాద్‌లోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో బండి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదైంది. మే 16వ తేదీన భగీరథ్‌ను అరెస్ట్ చేశారు. అప్పటి నుండి అంటే దాదాపు 45 రోజులకు పైగా అతడు చర్లపల్లి జైలులోనే జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు.
తమ ప్రాంతాన్ని అక్రమంగా ఆక్రమించుకున్నందుకు ప్రతీకారంగానే పాక్ సైనిక కేంద్రాలపై దాడులు చేస్తున్నామని బలూచ్ రెబల్ గ్రూపులు హెచ్చరిస్తున్నాయి. రాబోయే రోజుల్లో పాకిస్తాన్ సైన్యంపై మరిన్ని భారీ ఎత్తున దాడులు చేస్తామని స్పష్టం చేశాయి.
తంలో అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో ఇరాన్ సైనిక కమాండర్ ఖాసిం సులేమానీ మరణించినప్పటి నుంచి ఈ రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి మారింది. ఖాసిం సులేమానీ మతికి ప్రతీకారంగా ట్రంప్‌ను టార్గెట్ చేస్తూ ఇరాన్ ఎత్తుగడలు వేస్తోందని నిఘావర్గాలు చెబుతున్నాయి.
అంతర్జాతీయ నివేదికలు, రక్షణ రంగ తాజా విశ్లేషణల మేరకు, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైనిక దళాల జాబితాలో భారత్ మూడవ స్థానానికి దూసుకెళ్లింది. అగ్రరాజ్యం అమెరికా మొదటి స్థానంలో నిలవగా, అత్యాధునిక యుద్ధ పరిజ్ఞానం కలిగిన రష్యా రెండో స్థానంలో ఉంది. అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తూ, ఇప్పటివరకు మూడో స్థానంలో కొనసాగుతూ వచ్చిన చైనాను అధిగమించి ఇండియా ఈ ఘనత సాధించింది.
స్టాక్ మార్కెట్లో సరైన ప్లాన్ లేకుండా ఇన్వెస్ట్ చేసి ₹2 లక్షలు ఎలా పోగొట్టుకున్నానో ఈ వెబ్ స్టోరీలో చూడండి. కొత్త ఇన్వెస్టర్లు ఫోమో FOMO, స్టాప్ లాస్ లేకపోవడం వంటి ఏ తప్పులు చేయకూడదో మరియు రిస్క్ మేనేజ్మెంట్ ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకోండి.
భారత స్టాక్ మార్కెట్లలో విదేశీ ఇన్వెస్టర్ల FII 60 బిలియన్ డాలర్ల అమ్మకాల సునామీకి ఎట్టకేలకు బ్రేక్ పడింది. ముడి చమురు ధరల తగ్గుదలతో మారిన మార్కెట్ సమీకరణాలు మరియు దేశీయ ఇన్వెస్టర్ల రికార్డు కొనుగోళ్లపై పూర్తి విశ్లేషణ.
తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ తొలిసారి అధికారికంగా కరూర్ జిల్లాలో పర్యటించనున్నారు. గతేడాది జరిగిన తొక్కిసలాట దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 41 మంది బాధితుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగ పత్రాలను అందజేయడంతో పాటు, నూతన పారిశ్రామిక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ పర్యటన పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.