యూపీ ఎన్నికలు యోగీకి కాదు మోడీకే సవాల్..
Publish Date:Dec 21, 2021
Advertisement
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర వుతున్న కొద్ద్దీ రాజకీయం వేడెక్కుతోంది. కొత్త పుంతలు తొక్కుతోంది. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న అధికార కార్యక్రమాలను ఎన్నికల ప్రచారానికి వేదిక చేసుకుంటోంది. నిజానికి ఇప్పుడు కాదు, మూడు నెలల ముందు నుంచే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఒకదాని వెంట ఒకటిగా అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంబోత్సవాలు చేసుకుంటూ పోతున్నారు. వివరాలలోకి వెళితే అక్టోబర్ 25 పూర్వాంచల్ ప్రాంతంలోని ఒకే రోజున తొమ్మిది వైద్యకళాశాలలు ప్రధాని ప్రారంభించారు. అందులో ఎనిమిది కళాశాలలకు కేంద్ర ప్రభుత్వమే నిధులు సమకూర్చింది. ఒక్క జున్పూర్ వైద్య కళాశాలకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మించారు. ఈ ఆసుపత్రుల నిర్మాణానికి రూ.2,329 కోట్లు ఖర్చు చేశారు.ఈ తొమ్మిది వైద్య కళాశాలల జిల్లా అసుపత్రులకు అనుసంధానం చేయడం వలన ఆ ఆసుపత్రులలో 2509 అదనపు పడకల సదుపాయం ఏర్పడింది. ఓ ఐదు వేల మంది వరకు, డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బందికి ఉద్యోగాలు లభించాయి. అదే వారంలో ప్రదానమంత్రి మరో రూ .5,200 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారని ప్రధాని కార్యాలయం (పీఎంఓ) సమాచారం. నవంబర్ 16 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, 341కిమీ పూర్వాంచల్ ఎక్ష్ప్రెస్స్’వే ప్రారంభించారు. అందులో ఇండియన్ ఎయిర్ఫోర్సు విమానాలు దిగేందుకు 3.2 కిమీ ఎయిర్ స్ట్రిప్ కూడా ఉంది. ఈ ప్రాజెక్ట్ విలువ రూ.22,500 కోట్లు. వెనకబడిన పూర్వాంచల్ ప్రాంతానికి ఈ ప్రాజెక్ట్ జీవధార అంటారు. ఇక డిసెంబర్ 14న ప్రధాని మోడీ, కాశీలో గంగా నది నుంచి కాశీ విశ్వనాథ దేవాలయం వరకు నిర్మించిన 500 మీటర్ల్ కారిడార్, 24 భవనాల భవన సముదాయం ప్రారంభించారు. ఇది మరో రూ. 339 కోట్ల భరీ ప్రాజెక్ట్ ... ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఒక మెగా ఈవెంట్’ మలిచారు. మోడీ వీధుల్లో నడుస్తూ,జనంతో కలుస్తూ, పూజలు, హారతులు, గంగా స్తానాలతో మీడియా ఫోకస్’ను పూర్తిగా తమ వైపుకు తిప్పుకున్నారు. కాషాయ మెరుపులు మెరిపించారు. ఇంతవరకు ఇంతే అయినా ఇక ముందు ఇంకెన్ని ప్రారంభోత్సవాలు ఇంకెన్ని తళుకు బెళుకులు చూపిస్తారో ఏమో కానీ, మెరీసేదంతా బంగారం కాదు, కేవలం తళుకు బెళుకుల ప్రారంభోత్సవలతోనే ఎన్నికల్లో విజయం సాధించడం అయ్యే పని కాదని పరిశీలకులు అంటున్నారు. అంతే కాదుఈ వరస ప్రారంభోత్సవాలు, ముఖ్యమంత్రి అధిత్యనాథ్ ప్రభుత్వ విజయాలు కాదు, వైఫల్యాలను కప్పిపెట్టే ప్రయత్నంగానే పరిశీలకులు భావిస్తున్నారు. అయితే కేవలం ఆర్థిక లెక్కలపైనే ఎన్నికల గెలుపు ఓటములు ఆధార పడవు. శక్తివంతమైన రాజకీయ సందేశాల ముందు ఆర్ధిక పద్దులు, అభివృద్ధి లెక్కలు నిలబడవు. ఈ విద్యలో మోడీ గురువులకే గురువు... చెప్పదలచుకున్న విషయాన్ని మాటతోనే కాదు మౌనంగానూ చెప్పగల దిట్ట మోడీ. సో.. నిజంగానే ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ బీజేపీ గెలిస్తే అది ఆదిత్యనాథ్ ప్రభుత్వ విజయం కాదు, అలాగని మోడీ విజయము కాదు. నిజానికి మళ్ళీ మరో మారు బీజేపీ గెలిస్తే అది విపక్షాల ఓటమే కాని, బీజేపే విజయం కాదు.
http://www.teluguone.com/news/content/pm-modi-facing-big-fight-in-up-assembly-election-25-128793.html





